Site icon A2Z ADDA

Rashmi-Sudheer: సుధీర్‌ను గల్లా పట్టి లాగిన రష్మీ.. దెబ్బకు అంతా షాక్

Rashmi-Sudheer వెండితెరపై రష్మీ తన పరువును పొగొట్టుకున్న సందర్భాలెన్నో ఉన్నాయి. కేవలం అందాల ఆరబోతకు తప్పా దేనికి పనికి రాదనే అపవాదు తెచ్చుకుంది. ఆమె ఎంచుకున్న సినిమాలు, పాత్రలు కూడా అలానే ఉంటాయి. కేవలం స్కిన్ షో కోసమే రష్మీని తీసుకున్నట్టు అనిపించేది. రష్మీ కూడా డబ్బుల కోసమే సినిమా చేసినట్టుగా అనిపించేది. అలాంటి వాటిలో గుంటూరు టాకీస్ అనే సినిమా కచ్చితంగా ఉంటుంది.

ఆ పాత్రను రష్మీ ఎలా ఒప్పుకుంది? ఎందుకు ఒప్పుకుందో కూడా ఎవ్వరికీ అర్థం కాదు. మితిమీరిన శృంగార సన్నివేశాలుంటాయి. హీరో సిద్దు, రష్మీ మధ్య నాటు సీన్లుంటాయి. అలా గుంటూరు టాకీస్ సినిమాలో రష్మీని చూసిన అభిమానులు తీవ్రంగా హర్ట్ అయ్యారు. అలా అప్పటి నుంచి రష్మీ సినిమాలకు దూరంగా ఉండిపోయింది. అయితే సిద్దు ఈ సారి ఢీ షోకు గెస్టుగా వచ్చాడు.

గుంటూరు టాకీస్ 2 అంటూ కొత్త కథను అల్లాడు ఆది. కొబ్బరికాయ కొట్టడం, వాటిని ఏరుకుని రష్మీకి సుధీర్‌ తినిపించడం.. కోరుకునే వాడి కన్నా.. ఏరుకుని వచ్చిన వాడే అందంగా ఉన్నాడు.. అంటూ రష్మీ డైలాగ్ చెప్పడం.. సుధీర్ గల్లా పట్టుకుని దగ్గరకు లాక్కోవడం, కన్ను కొట్టడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ రొమాన్స్‌కు గెస్టుగా వచ్చిన మంచు లక్ష్మీ సైతం వామ్మో ఇవన్నీ కూడా మామూలుగా లేవని అనుకున్నట్టు కనిపిస్తోంది.. మొత్తానికి ఈ ప్రోమోలో సుధీర్ రష్మీ రొమాన్స్ మామూలుగా లేదు.

Exit mobile version