కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే 31 జనవరి సోమవారం నాటి Karthika Deepam Episode 1263 ధారావాహికలో గుండె బరువెక్కే సీన్లు పడ్డాయి. శౌర్య కోసం హిమ త్యాగం చేసేందుకు రెడీ అవుతోంది. డబ్బుల కోసం తనంతట తానే రుద్రాణి వద్దకు వెళ్తుంది హిమ. అంతకు ముందు డబ్బుల కోసం ఆదిత్యకు ఫోన్ చేస్తాడు కార్తీక్. కానీ ఫలితం ఉండదు. అలా మొత్తానికి కార్తీక దీపం నేటి ఎపిసోడ్ మాత్రం ఫుల్ ఎమోషనల్‌గా సాగింది.
పిల్లలంటే నాకు ఇష్టం, ప్రేమ అందుకే ఈ డబ్బు ఇస్తున్నా.. చూస్తుంటే నీ బాధేంటో తెలుస్తోంది.. పాపం నీ కూతురికి ఏమైందో ఏమో ఆపరేషన్ చేయించుపో.. తీసుకెళ్లి వైద్యం చేయించుకోండి.. డబ్బుదేముంది.. శాశ్వతం కాదు.. ఒకరి అవసరాలు మరొకరు తీర్చుకోవాలి.. డబ్బంటే నాకు పిచ్చి.. కానీ అంతకంటే ఎక్కువగా పిల్లలంటే ఇష్టం.. సంతకం పెట్టావ్. డబ్బులు కట్టవు.. కట్టలేవు.. ఎటూ నీ కూతుళ్లలో నాకు ఒకరిని ఇవ్వాలి కదా?.. డబ్బులు ఎవరు ఇచ్చినా కూడా అవసరానికి పనికొస్తాయ్ కదా?. నాకు తెలుసు సార్.. నువ్ డబ్బులు తీసుకుంటావ్ అని.. ఎలాంటి వారినైనా మాయ చేస్తాయ్..అని రుద్రాణి అంటుంది.
మీకు డబ్బు ఎక్కువగా ఉండొచ్చు.. కానీ నాకు అంతకంటే ఎక్కువ ఆత్మాభిమానం ఉంది.. గడువులోగా డబ్బులు చెల్లిస్తాను.. మీ వాళ్లను నా వెంట పడొద్దని చెప్పండి. ఇది చెప్పడానికే వచ్చాను.. అని కార్తీక్ చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు. నాకు ఇంకా వేరే మార్గం లేదు.. ఆదిత్యకు ఫోన్ చేయాలి.. అని కార్తీక్ అనుకుంటూ వస్తాడు. ఇదేంట్రా మరీ ఇంత ఆత్మాభిమానం ఉందని రుద్రాణి అనుకుంటుంది.
ఇక ఇంటికి వచ్చిన కార్తీక్‌ను చూసి హిమ ఎమోషనల్ అవుతోంది. ఎక్కడికి వెళ్లావ్ డాడీ.. శౌర్య ఏదేదో మాట్లాడింది తెలుసా? అని హిమ అంటుంది. డాడీని విసిగించకు.. వెళ్లిన పని అయిందా?.. అని దీప అడుగుతుంది. కాలేదని చెబుతాడు కార్తీక్. శౌర్య పరిస్థితి బాగా లేదు.. అని లోలోపల అనుకుంటాడు కార్తీక్. ఏదైనా ప్రమాదమా? అని దీప అంటే.. ఏం పర్లేదు.. ఈ టాబ్లెట్ నాలిక కింద పెట్టు అని చెబుతాడు., ఇది పెడితే హార్ట్ ఎటాక్‌ని కాసేపు ఆపొచ్చు అని నీకు ఎలా చెప్పాలి.. అని కార్తీక్ బాధపడతాడు. అప్పు దగ్గర ఫోన్ తీసుకుని ఆదిత్యకు కాల్ చేస్తాడు. కానీ అది కలవదు. దీంతో అంబులెన్స్‌కు కాల్ చేస్తాడు.
ఆస్పత్రిలో రుద్రాణి గొడవ చేస్తుంది. డబ్బులు తీసుకోండి.. నాకు హిమను ఇవ్వండి అని అడుగుతంది. డబ్బులు తీసుకోకుండా ఇలా ఉంటే.. జరగరానిది జరిగితే ఏంటని..రుద్రాణి అంటుంది.దీంతో దీప ఫైర్ అవుతుంది. ఇది హాస్పిటల్ కాబట్టి అరవడం లేదు అని అంటుంది. డబ్బులు తీసుకోకుండా కూతురి ప్రాణాలు పోగొట్టుకుంటారో.. నా దగ్గరకు పాపను పని సౌభాగ్యంగా చూసుకుంటారో మీ ఇష్టమని రుద్రాణి వెళ్తుంది.
ఆ తరువాత డాక్టర్‌తో కార్తీక్ వాదిస్తాడు. చాలా సీరియస్, స్టంట్ వేయాల్సి ఉంటుంది.. అని కార్తీక్ చెబుతాడు. నువ్వే పెద్ద డాక్టర్‌లా మాట్లాడుతున్నావ్.. ఆపరేషన్ థియేటర్ ఇస్తే ఆపరేషన్ కూడా చేసేలా ఉన్నావ్.. అని అంటాడు. త్వరగా సర్జరీ చేయండి అని అంటాడు కార్తీక్. డబ్బులు కట్టావా? అని డాక్టర్ అడుగుతాడు. ఈ ప్లేస్‌లో మీ కూతరుంటే ఇలానే చేస్తావా? అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. వీళ్లను బయటకు గెంటేయండని డాక్టర్ అంటాడు. ఇంతలో అప్పు వచ్చి.. హిమ కనిపించడం లేదని చెబుతాడు. టైం మనది కానప్పుడు గొడవ పడొద్దు బావా అని చెబుతాడు.
ఇక హిమ పరిగెత్తుకుంటూ రుద్రాణి వద్దకు వెళ్తుంది. శౌర్యకు ఏమైందో తెలియదు.. డాడీ దగ్గర డబ్బులు లేవు.. అని ఏడిచేస్తుంది. నన్నేం చేయమంటావు బంగారం.. అని రుద్రాణి అంటుంది. నేను మీ దగ్గరే ఉంటాను.. ఎప్పటికీ ఇక్కడే ఉండమన్నా ఉంటాను.. మా శౌర్యకి ఏం కాకూడదు.. నాకు శౌర్య బాగుంటే చాలు.. నేను మీ దగ్గరే ఉండమన్నా ఉంటాను.. సరేనా ఆంటీ.. డబ్బులిచ్చి శౌర్యను కాపాడండి ఆంటీ.. అని హిమ అంటుంది.
నాకు పిల్లలు లేని ముచ్చటంతా తీర్చాలి.. నువ్ మా అమ్మలానే ఉంటావ్..అందుకే నువ్వంటే నాకు ఇష్టం.. నీది ఎంత మంచి మనసురా బంగారం.. నన్ను వెతుక్కుంటూ వచ్చావా.. మీ అమ్మానాన్నలు వినడం లేదు.. ఆంటీ.. ఏంటి.. అమ్మా అని అనాలి.. నువ్ ఈ మాట మీదే ఉండూ.. నేను మీ అమ్మానాన్నలతో మాట్లాడతాను.. అని రుద్రాణి అంటుంది.
ఏంటి ఆదిత్య ఫోన్ అలా ఎలా మరిచిపోతావ్..అని శ్రావ్య అడుగుతుంది. కారు మీద పెట్టి మరిచిపోయాను.. అని చెబుతాడు ఆదిత్య. ఏంటి ఆదిత్య.. నీ ఫోన్ అలా.. నా ఫోన్ ఇలా అయిపోయిందని శ్రావ్య అంటుంది. సడెన్‌గా మమ్మీవాళ్లు ఫోన్ చేస్తే ఎలా అని ఆదిత్య అనుకుంటాడు. ఇదంతా అనుకోకుండానే జరిగాయా.. మోనిత కావాలని చేస్తుందా? అని శ్రావ్య అనుమానిస్తుంది.
ఇదంతా కో ఇన్సిడెన్స్ అని ఆదిత్య అంటే.. తను ఏమైనా చేయగలదు.. ఎంతకైనా తెగించేస్తుంది. అని శ్రావ్య అంటుంది. అదే నంబర్‌తో ఫోన్ తీసుకోవాలి.. అన్నయ్య పేరు మీదుంది.. అదే నంబర్‌తో సిమ్ తీసుకోవడం కష్టమవుతుంది.. అని ఆదిత్య అంటాడు. వారు ఎక్కడున్నారో తెలియడం లేదు.. ఇక్కడేమో దీపుగాడికి జ్వరం.. అంత పెద్ద ఇంట్లో ముగ్గురమే ఉంటే. ఏదోలా ఉంది ఆదిత్య.. అక్కాబావ పిల్లలు గుర్తొస్తున్నారు.. అని శ్రావ్య బాధపడుతుంది.
అమ్మ వాళ్లు రావడం లేదు.. అన్నయ్య వదినలు ఎక్కడున్నారో ఏమో.. అందరం దూరమైపోయాం.. ఈ వయసులో అమ్మా వాళ్లు అలా ఆశ్రమంలో ఉన్నారు. వదిన అన్నయ్యను మార్చి ఇంటికి తీసుకొస్తే బాగుండు.. అని ఆదిత్య బాధపడతాడు. ఇవన్నీ నీ కోసమే తల్లి అని స్వీట్లు తీసుకొస్తుంది రుద్రాణి.. శౌర్యకు హెల్త్ బాగా లేదు.. నేను తినను.. అని హిమ అంటుంది.
ఇదిరా పెంపకం అంటే.. ఇన్ని రకాలు ముందు పెడితే.. ఈ ఈడు పిల్లలు ఆవురావురు మని తినేస్తారు..కానీ ఈ బంగారం మాత్రం తన వాళ్ల కోసం ఆలోచిస్తుంది.. ఈరోజుల్లో ప్రేమలు లేవని ఎవరు అన్నారు.. బంగారం.. నువ్ నిజంగానే బంగారం.. అని రుద్రాణి అంటుంది. మా శౌర్య బాగుండాలంటే డబ్బులు కావాలి.. అని హిమ అంటుంది. నేను ఇస్తాను బంగారం.. డబ్బులు నేనిస్తాను కదా బంగారం.. తినమ్మా.. మరో రుద్రాణిలా తయారు చేస్తాను..అని రుద్రాణి అంటుంది. ఇంతలో దీప వస్తుంది. అక్కడితే ఎపిసోడ్ ముగుస్తుంది.
అయితే డబ్బులు తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఇంకో హాస్పిటల్‌కు వెళ్తారు. డాక్టర్ కార్తీక్ వల్లే ఈ సర్జరి అవుతుంది.. ఆయనే చేయగలరు అని చెబుతాడు డాక్టర్. ఆయన్ను నేను తీసుకొస్తాను అని దీప చెబితే డాక్టర్ ఆశ్చర్యపోతాడు. డాక్టర్ కార్తీక్ ఇంట్లో వంట మనిషిగా చేశాను అని దీప చెబుతుంది. ఇక కార్తీక్‌ను దీప ప్రాధేయపడుతుంది. కూతురి కోసం డాక్టర్‌గా కార్తీక్ మళ్లీ మారబోతాడన్న మాట.
