Site icon A2Z ADDA

Karthika Deepam నేటి ఎపిసోడ్.. కొన ఊపిరితో శౌర్య.. హిమ కోసం బేరమాడిన రుద్రాణి

Karthika Deepam కార్తీకదీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే శనివారం నాడు జనవరి 29న ప్రసారం కానున్న Karthika Deepam Episode 1262 ధారావాహికలో గుండె బరువెక్కే సీన్లు పడ్డాయి. ఓ వైపు శౌర్య కొనఊపిరితో ఉంది.. దీప, హిమలు వెక్కి వెక్కి ఏడుస్తుంటారు. ఆపరేషన్ డబ్బుల కోసం కార్తీక్ ప్రయత్నిస్తుంటాడు. ఇక రుద్రాణి మనుషులు కార్తీక్ వెంట పడుతుంటారు. అలా కార్తీకదీపం నేటి ఎపిసోడ్ ముందుకు సాగింది.

కార్తీక్ ఆపరేషన్ డబ్బుల కోసం తిరుగుతుంటాడు. ఇక కార్తీక్‌ను తీసుకురండని తన మనుషులకు రుద్రాణి చెబుతుంది. ఊరంతా నడుచుకుంటూ కార్తీక్ కోసం ఇద్దరు మనుషులు తిరుగుతారు. అక్కకు కోపం వస్తే కారు ఇవ్వదని తెలుసు కదా.. తాడి కొండ చిన్న ఊరురా.. రెండు రౌండ్లు తిరిగితే అతనే దొరుకుతాడు.. వెతకపోయిన తీగ కాలికి దొరికినట్టు.. ఎదురుగా వస్తున్నాడు చూడు అని అంటారు.

అక్క నిన్ను తీసుకుని రమ్మంది.. అని కార్తీక్‌ని ఆపుతారు. తప్పుకోండ్రా.. అరేయ్ తప్పుకోండ్రా అని కార్తీక్ అంటాడు.. అక్క నిన్ను తీసుకుని రమ్మంది.. ప్లీజ్ రా.. కూతురికి బాగా లేదు.. ఆస్పత్రికి తీసుకెళ్లాలి.. అర్జెంట్‌గా హోటల్‌కి వెళ్లాలి.. చాలా సీరియస్ ప్రాబ్లం.. అని కార్తీక్ ప్రాధేయ పడతాడు. అప్పు తీసుకున్న ప్రతీవాడు ఇలానే చెబుతాడు.. అవన్నీ మాకు తెలీదు.. రుద్రాణి అక్క రమ్మంది రావాల్సిందే.. అని అంటారు. నీ బిడ్డలేనా? అబద్దం చెబుతున్నావా? అని అనడంతో కార్తీక్‌కి కోపం వస్తుంది. ఆ ఇద్దరినీ తన్ని అవతల పాడేస్తాడు. సైకిల్ ఎక్కి కార్తీక్ వెళ్తుంటాడు. ఆ వెంటే రౌడీలు కూడా పరిగెడతారు. ఇక అక్కడేమో రుద్రాణి ఎదురుచూస్తుంటుంది. వాళ్లకి ఫోన్ చేస్తే వారేమో లిఫ్ట్ చేయరు. పరిగెత్తరా.. పట్టుకోకపోతే.. అక్క మన పీక పట్టుకుంటుందిరా.. పరిగెత్తురా..అని ఇద్దరూ రోడ్ల వెంట పోతుంటారు.

ఇక ఇంట్లో శౌర్య పరిస్థితి తీవ్రంగా మారుతుంది. అమ్మా.. నాన్న వచ్చారా? భయంగా ఉంది.. అని శౌర్య అంటుంది. మేం అంతా ఉన్నాం.. నీకేం కాదమ్మా.. అని దీప అంటుంది. తొందరగా హాస్పిటల్‌కి తీసుకెళ్లండమ్మా.. నానమ్మ తాతయ్యలను చూడాలని ఉందమ్మా.. నాన్న పెద్ద కార్డియాలజిస్ట్.. నాన్న నాకు ట్రీట్మెంట్ చేస్తే బతుకుతాను..అని శౌర్య అంటుంది.

నాన్న పెద్ద డాక్టర్ కదా? ఇట్టే బాగు చేస్తాడు.. అందరికీ సాయం చేశారు.. గొప్ప డాక్టర్.. తన అవసరాలకే అస్త్రాలు గుర్తురాని కర్ణుడిలా మారిపోయారు.. పసిదానికి ఎందుకీ శిక్ష.. అత్తమ్మ కళ్లు తెరువు అని దీప.. శౌర్య కళ్లు తెరువు అని హిమ తల్లడిల్లిపోతారు.. ఇలాంటి పరిస్థితి ఎలాంటి తల్లిదండ్రులకు రాకూడదు.. బిడ్డ విలవిల్లాడుతుంటే.. వైద్యం చేయించలేకపోతోన్నాం.. అని దీప బాధపడుతుంది.

నాన్నమ్మ, తాతయ్య , బాబాయ్‌ వాళ్లకు ఫోన్ చేయ్ అమ్మా.. వాళ్లు వచ్చి హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. ఎందుకు మనం దూరంగా వచ్చేశాం.. ఇలా ఉన్నా కూడా మనం వాళ్లని కలవకూడదా? అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంది హిమ. నన్నేం అడకమ్మా నీకు పుణ్యం ఉంటుంది అని దీప అంటుంది. నానమ్మ తాతయ్య.. మేం రాకపోతే మీరైనా రావొచ్చు కదా? అని శౌర్య బాధపడుతుంది.

కార్తీక్ హోటల్ వద్దకు వెళ్తే.. ఓనర్, అప్పిగాడు ఇద్దరూ ఉండరు. మొన్నే అడ్వాన్స్ తీసుకున్నా..ఇప్పుడు ఇస్తాడో లేదోనని అప్పారావ్ దగ్గర ఉన్నాయేమోనని వచ్చా అని కార్తీక్ అంటాడు.. ఇక హోటల్ వద్దకి కూడా రౌడీలు వస్తారు. నా కూతురికి బాగా లేదు.. నేను వెళ్లాలి అని కార్తీక్ అంటాడు. హలో సారు.. మాతో వచ్చేయండి.. అని మళ్లీ మళ్లీ అంటారు.

చెబుతుంటే అర్థం కాదా?.. అని వాయించేస్తాడు కార్తీక్. మీరు ఎంత చేసినా మీ వెంటే వస్తుంటాం.. అదేదో అక్క దగ్గరకు రండి. కావాలంటే ఆ డబ్బులేవో అక్కే ఇస్తుంది.. అని రౌడీలు అంటారు. వచ్చి తేల్చుకుంటాను పదా అని కార్తీక్ వారితో వెళ్తాడు.. ఎక్కడున్నారు డాక్టర్ బాబు.., నా గుండె ఆగిపోతోంది..అని దీప బాధపడుతుంటుంది. నానమ్మకు ఫోన్ చేయండి.. బాబాయ్‌కి ఫోన్ చేయండి.. శౌర్యకు ఏదైనా అవుతుంది.. భయం వేస్తోంది..అని హిమ బాధపడుతుంది. నేనున్నా.. భయపడకు ఏం కాదు.. అని దీప ధైర్యం చెబుతుంది.

అసలు మీరు మనుషులేనా?. నా బాధల్లో నేనుంటే.. అక్క రమ్మంటుంది.. అని నా వెంటపడతారేంటి.. సంతకం పెట్టాను కదా.. డబ్బులు ఇస్తాను అని రుద్రాణి వద్ద కార్తీక్ చెబుతాడు. ఏంటి సారు.. మీరు చెప్పేది నమ్ముతున్నాను.. కానీ మాలాంటి వాళ్లకు సెంటిమెంట్లు ఉండవు కదా? నా బాకీ కట్టి.. హాస్పిటల్‌కి తీసుకెళ్తావో.. ఇంకా ఎక్కడికైనా వెళ్తావో.. నీ ఇష్టం అని అంటుంది.. ఒంట్లో బాగాలేదు.. వెళ్లాలి.. మీకు డబ్బులు ఇవ్వకుండా తాడికొండ గ్రామం వదలను.. వెళ్తున్నాను.. వెళ్తున్నాను.. అని కార్తీక్ చెబుతాడు. సారూ ఒక్క నిమిషం.. అని ఆపేస్తుంది రుద్రాణి.

హిమ నువ్ ఏడ్వకు.. ఏడిస్తే నీకు జ్వరం వస్తుంది కదా.. అని హిమ అంటుంది. నీకు ఇలా ఉండి కూడా హిమ గురించి ఆలోచిస్తున్నావా? నాకు తమ్ముడిని చూడాలని ఉందమ్మా.. ఒకసారి అందరినీ చూడాలనిపిస్తుంది.. నానమ్మ, తాతయ్య, బాబాయ్, పిన్ని, దీపుగాడిని.. వీళ్లెవ్వరినీ చూసే అవకాశం లేదు కదా? కనీసం తమ్ముడినైనా చూపించు అని అంటుంది శౌర్య.

అత్తమ్మ ఇవన్నీ ఆలోచించకు.. అని దీప అంటుంది. ఇంతలో అప్పు వస్తాడు. ఏమైందక్కా.. అని అడుగుతాడు. పాపకు ఒంట్లో బాగాలేదు అని దీప చెబుతుంది.. బావ కూడా హోటల్‌కి. అని చెబుతుంటే.. పక్కకి తీసుకెళ్తుంది దీప. ఊర్లో వడ్డీకి ఎవరైనా డబ్బులు ఇస్తారా? అని అప్పారావుని దీప అడుగుతుంది. ఇంతకు ముందులా లేరు.. బంగారం పెడితేగానీ ఇవ్వడం లేదు.. ఇదే ఊరు వాళ్లైతే ఇచ్చేవారేమో.. మీ మంచితనం వారికి తెలీదు కదా? అని అంటాడు. మంచితనం వినడానికే బాగుంటుంది.. అని దీప అంటుంది. అందరికీ డబ్బు పిచ్చి పట్టింది అని అప్పారావ్ అంటాడు.. పాపం డాక్టర్ బాబు.. ఎక్కడెక్కడ తిరుగుతున్నారో..అని బాధపడుతుంది.

తీసుకో సారూ..ఐదు లక్షలు తీయించుకుని వైద్యం చేయించు.. అసరమైతే ఇంకా ఇస్తాను.. అని రుద్రాణి అంటుంది. అక్కా ఇంకా డబ్బులు ఇస్తున్నావేంటి.. పాతవే ఇవ్వలేదు ఎందుకు అని పిల్లిగడ్డం గాడు అడ్డు పడతాడు. వాడిని లాగి ఒక్కటి ఇస్తుంది రుద్రాణి. మాట్లాడుతున్నాను కదా? మధ్యలో ఎందుకు వస్తున్నావు.. పిల్లలంటే నాకు ప్రేమ.. నిన్ను చూస్తుంటేనే నాకు జాలి వేస్తుంది.. మీ వెనక నేనున్నాను.. అంటూ డబ్బులు ఇవ్వడానికి రెడీ అవుతుంది. అలా ఎపిసోడ్ ముగుస్తుంది.

ఇక వచ్చేవారం అదిరిపోయే సీన్ జరిగేట్టుంది. రుద్రాణి ఇచ్చే డబ్బులు కార్తీక్ తీసుకోడు. ఎలాగోలా హాస్పిటల్‌కు తీసుకెళ్తారు.. అక్కడ డబ్బులు లేవని చేర్చుకోరు. ఇంతలో రుద్రాణి కూడా వస్తుంది. పాతది రద్దు చేస్తాను. ఇప్పుడు ఇచ్చేది అప్పే కాదు.. బదులుగా నాకు ఈ పాపను ఇవ్వండి అని హిమను అడిగేస్తుంది. దీంతో కార్తీక్, దీప సీరియస్ అవుతారు. రుద్రాణి ఇది హాస్పిటల్ కాబట్టి ఇక్కడ ఏం అనడం లేదు.. అని దీప వెళ్లగొడుతుంది. కానీ హిమ మాత్రం ముందుకు వస్తుంది. రుద్రాణి ఇంటికి వెళ్లి మరీ తనది తాను అమ్మేసుకుంటుంది. శౌర్య ఆపరేషన్‌కు డబ్బులు ఇవ్వండి.. నేను మీ దగ్గరే ఉంటాను..అని అంటుంది హిమ. అలా మొత్తానికి గుండె బద్దలయ్యే సీన్ జరగబోతోంది.

Exit mobile version