కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే జనవరి 22న శనివారం నాడు ప్రసారం కానున్న Karthika Deepam Episode 1256 ధారావాహికలో అందరినీ కంటతడి పెట్టించేస్తారు. బిడ్డ కోసం దీప ఆరాటపడటం, దీప కోసం సౌందర్య, ఆనంద్ రావులు తల్లడిల్లిపోవడం వంటివి జరుగుతుంటాయి. మొత్తానికి కార్తీక దీపం నేటి ఎపిసోడ్ మాత్రం ఎంతో ఎమోషనల్ అనిపిస్తుంది.
సౌందర్య, ఆనంద్ రావులు హోటల్‌కు రావడంతో అప్పిగాడు మోనిత సంగతి కూడా చెబుతుంటాడు. ఇదంతా చూసిన కార్తీక్.. ఒరేయ్ అప్పారావ్.. ఏం చేస్తున్నావ్ రా.. ఆపరా బాబు.. మమ్మీ డాడీ అనవసరంగా టెన్షన్ పడతారు.. అని అనుకుంటాడు. మోనిత వచ్చి ఉంటుందా? అని సౌందర్య అనుమాన పడుతుంది. ఇప్పుడు దాని గోల ఎందుకు చెప్పు అని ఆనంద్ రావు అంటాడు.
డాడీ ఏంటి డల్లుగా కనిపిస్తున్నారు.. నా మీద పిల్లల మీద బెంగ పెట్టుకున్నారా? అని బాధపడతాడు. మనం ఇక్కడకు వచ్చింది ఎందుకు రుద్రాణి గురించి మరిచిపోవడానికే కదా?. మళ్లీ మోనిత అంటావేంటి? అని ఆనంద్ రావు అంటాడు.. రుద్రాణి టెన్షన్ నుంచి బయట పడేసేందుకు ఇక్కడకు తీసుకొచ్చానని మీకు తెలుసా? అని సౌందర్య అంటుంది. నాకు తెలుసు అని ఆనంద్ రావు అంటాడు.
ఇంతలో కాఫీని అప్పిగాడు తీసుకొస్తాడు.. కాఫీ చాలా బాగుంది.. అని ఇద్దరూ మెచ్చుకుంటారు. సినిమాల్లో పనికొస్తానా? అని అప్పిగాడంటే.. సినిమాల్లో పనికొస్తావ్.. మంచి కాఫీ ఇచ్చావ్ కదా? నీ కోరిక నెరవేరాలని ఆశీర్వదించాను అని అంటారు .. మోనిత ఫోటోను అప్పిగాడు చూపించడంతో సౌందర్య, ఆనంద్ రావులు వెళ్లిపోతారు. మోనిత గురించి వినడం వద్దు అని అందుకే ఇళా వెళ్తున్నామని సౌందర్య అంటుంది.
ఆనంద్‌ని మహాలక్ష్మీ తీసుకొచ్చి ఇస్తుంది. నిన్ను ఇబ్బంది పెట్టాడా? అని దీప అడుగుతుంది. ఏం ఇబ్బంది పెట్టలేదు.. రుద్రాణి ఎక్కడ మా ఇంటికి వస్తుందా? అని అనుకున్నాను.. నా పరిస్థితే ఇలా ఉంటే నువ్ ఎలా ఉన్నావో ఊహించగలను.. ఎన్నాళ్లు ఇలా భయపడుతుంటావ్.. ఏదో ఒకటి తేల్చేసేయ్ దీప.. వస్తాను దీప.. అని మహాలక్ష్మీ వెళ్లిపోతుంది. వడ్డీ గడువు కూడా తీరిపోయింది.. ఎలాగోలా కట్టేయాలి..అని దీప అనుకుంటుంది.
నా సమస్యల నుంచి పారిపోయి ఇక్కడకు వచ్చాను.. నా స్వార్థం చూసుకున్నాను.. మోనిత ఇంటికి వెళ్లి సమస్య తెచ్చిపెట్టిందా? మోనిత అనే పెద్ద సమస్యను వదిలేసి వచ్చాను.. డాక్టర్స్ ప్రశాంతమైన వాతావరణాన్ని సజెస్ట్ చేసి ఉంటారేమో.. మరి మోనిత ఎందుకు వచ్చింది.. పెద్ద కొడుగ్గా పుట్టాను గానీ.. బాధ్యతలు తీసుకోలేదు.. ఎందుకు వచ్చారు.. ఏం జరిగిందో తెలుసుకోవాలి.. అని బాధపడుతుంటాడు.
ఏంటి బావ ఏదో కోట్లు పోయినట్టు మొహం పెట్టావ్.. అని కార్తీక్‌ను అప్పిగాడు అడుగుతాడు. నీకు అలా అనిపించిందా? అని కార్తీక్ అడుగుతాడు రాబోయే కాలానికి.. కాబోయే స్టార్‌ని ఆ మాత్రం కనిపెట్టలేనా? అని అప్పిగాడు అంటాడు. నా మనసు బాగాలేదు నాకు లీవ్ కావాలి అని కార్తీక్ అంటే.. నువ్వెప్పుడు వచ్చావ్ అని లీవ్ ఇస్తాడు.. విరేచనాలు, కడుపు నొప్పి అని చెబుదామని అంటాడు. అలా కార్తీక్ వెళ్లిపోతాడు.
బయట తిరిగితే ప్రశాంతంగానే ఉంది అంటూ ఆనంద్ రావు కాస్త రిలాక్స్ అవుతాడు. ఆ కాఫీ తాగినప్పటి నుంచి ఏదోలా ఉంది.. ఇంట్లో తాగినట్టే ఉంది.. మన దీప పెట్టిన కాఫీలా ఉంది.. అని సౌందర్య, ఆనంద్ రావులు అనుకుంటారు. మన వంటలక్క కూడా అక్కడే ఉందేమో.. అని సంబరపడతాడు ఆనంద్ రావు. మన కోడలు వంటలక్క దొరికినంత ఫీలవుతున్నారు ఏంటి అని సౌందర్య అంటాడు… మనం ఇంత హ్యాపీగా నువ్వుకుని ఎన్ని రోజులు అవుతోంది.. అని ఆనంద్ రావు అంటాడు. ఇక వెంటనే కారు వెనక్కి తిప్పి హోటల్‌కు బయల్దేరుతారు.
బాబును ఎత్తుకెళ్లిందని తెలిసి.. ఆవేశంలో రుద్రాణి ఇంటికి వస్తుంది దీప. రుద్రాణి అంటూ అరిచేస్తుంది దీప.. ఎక్కడ మీ అక్క అని అనేలోపే రుద్రాణి వస్తుంది.. పిల్లాడిని ముట్టుకునేలోపు.. ఆగు బంగారం అని రుద్రాణి అడ్డుకుంటుంది.. నేను ఊరికే పిల్లాడిని తీసుకురాలేదు అని రుద్రాణి అంటుంది.. ఇంకొక్క మాట మాట్లాడినా నేనేం చేస్తానో నీకు తెలుసు.. డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా.. ఇలా తీసుకొచ్చావ్ అని దీప అంటుంది..
అసలు ఇవ్వడానికి టైం ఉంది.. కానీ వడ్డీకి టైం అయిపోయింది.. 6400 తెచ్చి రంగరాజును తీసుకెళ్లు.. అప్పటి వరకు నా వద్దే ఉంటాడు.. వడ్డీ డబ్బులు.. న్యాయంగా ధర్మంగా వడ్డీ తీసుకుంటాను.. కాదు కూడదు అంటే.. మీ ఇద్దరి పిల్లలను తీసుకొస్తాను ఏమనుకుంటున్నావో.. కళ్లురుమి చూస్తే భయపడతాను అని అనుకున్నావా? డబ్బులు కక్కండి.. రంగరాజును తీసుకోండి.. ఇప్పటి వరకు మర్యాదగా మాట్లాడాను.. రచ్చ చేయాలనుకుంటే ఇంటి దగ్గరే చేసేదాన్ని.. ఏ గొడవ లేకుండా ఇలా బాబును తెచ్చుకున్నాను.. నీ ఇద్దరు పిల్లల్నీ తీసుకొస్తాను జాగ్రత్త.. వెళ్లు దీప.. మర్యాదగా పంపించినప్పుడే వెళ్లిపో.. అంత పౌరుషమే ఉన్నదానివైతే.. వడ్డీ డబ్బులు కట్టి తీసుకెళ్లిపో.. అని రుద్రాణి దుమ్ముదులుపుతుంది. దీంతో ఏం చేయలేక దీప వెనక్కి తగ్గుతుంది. పాలు పట్టండి వడ్డీ డబ్బులు తీసుకొస్తాను..అని అంటుంది.
ఇక మరో వైపు హెటల్ ముందు అప్పారావు తుడుచుకుంటూ ఉంటాడు. ఇదే అప్పారావ్.. ఇదే హోటల్ ముందు.. పెద్ద కారులో దిగుతాడు అని కలలు కంటాడు. ఇంతలో సౌందర్య కారు ఆగుతుంది.. దీప గురించి అడుగుదామని వస్తారు. కానీ అప్పిగాడిని కాకుండా యజమానిని అడుగుతారు. రుద్రాణి మనుషులేమోనని అనుకుని అబద్దం చెబుతాడు. నా దగ్గరేనా? మీ వేషాలు.. భద్రం.. ముంబై భద్రం..దీపమ్మ గురించి అడుగుతారా? నన్ను బోల్తా కొట్టిస్తారా? అని లోలోపల అనుకుంటాడు. దీంతో సౌందర్య, ఆనంద్‌లు బాధతో తిరిగి వెళ్తారు
ప్రకృతి వైద్యశాలకు కూరగాయలు సప్లై చేసే వాడి దగ్గరకు కార్తీక్ వెళ్తాడు. కూరగాయలు మీరే సప్లై చేస్తారు కదా?. అక్కడికి హైద్రాబాద్ నుంచి ఇద్దరు దంపతులు వచ్చారు.. ఎందుకు వచ్చారో కనుక్కుని చెబుతారా? అని అడుగుతాడు. ఆశ్రమంకి వచ్చిన వారికి ఏదో సమస్య వచ్చి ఉంటుంది.. ఎందుకు అడుగుతున్నారో నాకు తెలియకపోయినా.. ఆశ్రమం వాళ్ల గురించి బయటకు చెప్పొదని అన్నారు.. అని అంటాడు. దీంతో కార్తీక్ వెనుదిరిగిపోతాడు. రాక్షసి.. వడ్డీ డబ్బులు కట్టలేదని పిల్లాడిని తీసుకెళ్లింది..అని దీప వెక్కి వెక్కి ఏడ్చేస్తుంది. ఇక బాబును ఎత్తుకెళ్లిన విషయం కార్తీక్‌కి తెలుస్తుంది. రుద్రాణి వద్దకు కోపంగా వెళ్తాడు.మరి ఆ తరువాత ఏం జరుగుతుందో చూడాలి.