Site icon A2Z ADDA

Karthika Deepam నేటి ఎపిసోడ్.. బస్తీ వాసుల గుండెల్లో మోనిత!.. కూతురి ప్రశ్నకు విలవిల్లాడిన డాక్టర్ బాబు

కార్తీక దీపం ఈ రోజు సీరియల్ అంటే శుక్రవారం నాడు అంటే జనవరి 14న ప్రసారం కానున్న Karthika Deepam Episode 1249 ధారావాహికలో ఎమోషనల్ సీన్స్ అందరినీ కట్టిపడేస్తాయి. ఇక మోనితకు బస్తీలో మంచి రోజులు రాబోతోన్నట్టు కనిపిస్తోంది. శౌర్య అడిగిన ప్రశ్నకు కార్తీక్ వద్ద సమాధానం ఉండదు. ఏం చెప్పాలో తెలీక తల్లాడిపోతాడు. అలా మొత్తానికి ఎపిసోడ్ మాత్రం ఎమోషనల్‌గా ముగుస్తుంది.

రుద్రాణి ఇంట్లోకి వచ్చి వంటగదిలో వంట చేస్తుంటుంది దీప. అది చూసి రుద్రాణి అంత ఎత్తున లేస్తుంది. వంటగదిలోకి వచ్చి వంట చేస్తేనే నీకు అంత అనిపిస్తే..నా కూతుళ్ల జోలికి వస్తే నాకు ఎలా ఉంటుంది అని దీప వార్నింగ్ ఇస్తుంది. నీలా కళ్లు పెద్దవి చేసుకుని, అరిచి చెప్పగలను. కానీ నీకు నాకు తేడా ఉండాలి కదా? అని రుద్రాణికి చురకలు అంటిస్తుంది.

నేను వంటలు బాగానే చేస్తాను.. కాస్త రుచి చూడు అని దీపఅంటుంది. చేతికి వాతలు పెడతాను అని ఆలోచిస్తున్నారా? నేను ఏదైనా చెప్పి చేస్తాను.. అని టేస్ట్ చూడమని రుద్రాణిక చేతికి ఇస్తుంది. కారం కాస్త తక్కువైంది.. పిల్లలకు కారం పెట్టు.. నా దగ్గరకు వచ్చాక అలవాటు అవుతుంది అని రుద్రాణి చెబుతుంది. ఇంత చెప్పినా నీకు అర్థం కాలేదా? నా పిల్లల జోలికి రాకు అని అంటుంది దీప.

మీకు రోజులు దగ్గరపడ్డాయి. అదే అప్పు చెల్లించాల్సిన గడువు దగ్గర పడుతోందని రుద్రాణి గుర్తుకు చేస్తుంది. మీ అప్పు చెల్లిస్తాను.. నా కూతుళ్ల జోలికి రాకు అని చెప్పి దీప వెళ్తుంది. ఇక దీప వంట చేయడంతో.. రుద్రాణికి కాలిపోతుంది. ఇక ఎప్పుడూ కూడా ఇంట్లో ఆ వంటగదిని వాడకండి.. మూసేయండి.. హోటల్ నుంచి ఫుడ్ తీసుకురా అని అబ్బులుకు చెబుతుంది రుద్రాణి.

ఇంట్లో కార్తీక్ ఎదురుచూస్తుంటాడు. ఇంకా దీప రాలేదేంటి అని అనుకుంటాడు. ఇంతలో దీప వస్తుంది. గ్యాస్ అయిపోయింది. అందుకే వేరే వాళ్ల ఇంటికి వెళ్లి వండుకుని వచ్చాను అని అంటుంది. ఇక్కడ నీకు ఎవరు తెలుసు.. అని కార్తీక్ అంటే.. రుద్రాణి విషయం చెబితే డాక్టర్ బాబు కంగారు పడతాడు అని అబద్దం చెబుతుంది దీప. పిల్లలు ఆకలి అని అంటుంటే.. అలా వెళ్లి ఆడుకోమ్మని చెప్పాను అని కార్తీక్ అంటాడు.

నా వల్ల మీకు ఎన్ని కష్టాలు వచ్చాయ్ అని కార్తీక్ బాధపడుతుంటాడు.ఆ సమయంలోనే వేలికి అయిన గాయాన్ని దీప చూస్తుంది. ఏమైందని దీప అంటే.. ఏదో సాకు చెప్పి తప్పించుకుంటాడు. పిల్లలు పిలవండి అన్నం తిందామని అంటుంది. అలా అక్కడ సీన్ క్లోజ్ అవుతుంది. ఇక బస్తీలో కడుపునొప్పితో బాధపడుతుంటుంది. మోనిత హాస్పిటల్‌లోకి రామని మంకు పట్టు పడుతాడు.

లాగి చెంప మీద కొడుతుంది మోనిత. అవతల ప్రాణాలు పోతోంటే.. మీ పంతాలు ఏంటి.. ఏమైనా ఉంటే తరువాత చూసుకుందాం.. ముందు నా హాస్పిటల్‌కు తీసుకురండి అని అంటుంది. వైద్యం చేస్తుంది మోనిత. ఇంకొంచెం లేట్ అయితే ప్రాణాలు పోయేవి అని చెబుతుంది. ఇప్పుడు మీ దీపక్క వచ్చి కాపాడిందా? అని అందరికీ గడ్డి పెడుతుంది. దీంతో వారణాసి సైతం ఏమీ మాట్లాడకుండా ఉంటాడు. చూస్తుంటే బస్తీవాళ్లు త్వరలోనే మోనితను అక్కున చేర్చుకునేలా ఉన్నారు.

ఆనంద్ రావు బాధపడుతుంటాడు. మనసులో లేని ప్రశాంతత ఇక్కడకు వస్తే దొరుకుతుందా? ఇంకెన్ని రోజులు ఇక్కడ ఉండాలి అని ఆనంద్ రావు అంటాడు. మీరు బాగయ్యే వరకు ఉండాలని సౌందర్య అంటుంది. నాకేం అయింది.. కార్తీక్ కనిపిస్తే చంటి పిల్లాడిలా ఎగిరి కూర్చుంటాను అని ఆనంద్ రావు అంటాడు. అసలు కార్తీక్ వస్తాడా? కనిపిస్తాడా? అని ఆనంద్ రావు బాధపడుతుంటాడు. ఒకప్పుడు కార్తీక్ దీప వేరుగా ఉన్నారని బాధపడ్డాం.. ఇప్పుడు కనీసం వాళ్లిద్దరూ కలిసే ఉన్నారు కదా? అని సౌందర్య అంటుంది.

ఇక మోనితను చూసిన విషయాన్ని దీపకు చెబుతాడు కార్తీక్. దీంతో దీప కంగారు పడుతుంది. తెలిసి వచ్చిందా? అని దీప అనుమానాన్ని వ్యక్తం చేస్తోంది. ఎలా తెలుస్తుందని డాక్టర్ బాబు అంటాడు. పిల్లాడు ఉన్నాడా? అని దీప అంటే.. కనిపించలేదు అని డాక్టర్ బాబు అంటాడు. తల్లి ప్రేమ తెలిస్తే కదా? పని మనిషికి అప్పజెప్పి వచ్చి ఉంటుంది అని దీప అంటుంది. కొన్ని రోజులు మీరు బయటకు వెళ్లకండి అని డాక్టర్ బాబుకు దీప సలహా ఇస్తుంది. మరి నువ్ వెళ్తున్నావ్ కదా? అని అంటే.. నేను ఉదయం వెళ్తాను అంత పొద్దున్నే చూడలేరుకదా? అని దీప అంటుంది.

ఇక ఉదయాన్నే పిల్లల కోసం టిఫిన్ తీసుకొస్తాడు కార్తీక్. పిల్లలు ఎంత తింటారో మాకు తెలీదా? అని కార్తీక్ అంటాడు. మీరు సంతోషంగా ఉంటేనే మేం సంతోషంగా ఉంటాం.. మీరు బాధపడుతుంటే మేం బాధపడతాం అని హిమ, శౌర్యలతో కార్తీక్ అంటాడు. అంటే నీ కోసం నానమ్మ, తాతయ్యలు కూడా ఆలోచిస్తుంటారు కదా? అని శౌర్య అంటుంది. దీంతో కార్తీక్‌కు ఏం చెప్పాలో అర్థం కాక.. సైలెంట్ అయిపోతాడు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో కార్తీక్ తన తల్లిదండ్రులను తలుచుకుని కుమిలిపోతాడు.

Exit mobile version