కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే శుక్రవారం నాటి Karthika Deepam Episode 1243 ధారావాహికలో కార్తీక్, దీపలు అష్ట కష్టాలు పడతారు. ఊరంగా తిరిగినా కూడా పిండి వంటలను అమ్మలేకపోతోంది. ఇక చివరకు పిల్లలకు కార్తీక్ అన్నం కూడా పెట్టలేకపోతాడు. మరో వైపు ఆనంద రావు ఆరోగ్యం కూడా దెబ్బ తింటుంది. ఇలా సీరియల్ మొత్తం ఎమోషనల్‌గానే సాగింది.
ఆనంద్ రావు ఆరోగ్యంపై భారతి కొన్ని విషయాలు చెబుతుంది. ఈ వయసులో టెన్షన్ పడటం మంచిది కాదని సలహా ఇస్తుంది. కొడుకు ఊరెళ్లాడు.. రేపో మాపో వస్తాడని తెలిస్తే టెన్షన్ పడను కానీ ఎప్పుడు వస్తాడో తెలియకపోతే ఇంకెలా ఉంటుందని ఆనంద్ రావు అంటాడు. అలా ఆనంద్ రావు పక్కకి వెళ్లడంతో భారతి అసలు విషయం చెబుతుంది. ఆరోగ్యం అసలు బాగా లేదని చెబుతుంది.
ఇక ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏ పని చేయనివ్వడం లేదని పాకింగ్ చేస్తుంటాడు కార్తీక్. చేయి కూడా కాలుతూ ఉంటుంది. మీరు ఇలాంటి పనులు చేయోద్దండని కార్తీక్‌ను దీప వేడుకుంటుంది. నన్ను సోమరిబోతును చేస్తున్నావ్ అని కార్తీక్ అంటే.. రాజు ఇలాంటి చిన్న చిన్న పనులు చేయరు.. నా దృష్టిలో మీరు రాజేనంటూ కార్తీక్‌కు దీప సర్ది చెబుతుంది.
మహేష్‌ను ఇన్ఫార్మార్‌గా పెట్టి కార్తీక్ కోసం సౌందర్య వెదికిస్తోందన్న విషయం మోనితకు తెలిసింది. ఈ విషయం తెలిసిన మోనిత.. సౌందర్యకు సౌందర్యంతో పాటు ఇన్ని తెలివి తేటలున్నాయా? ఫోన్ ద్వారా మహేష్‌ను కనిపెట్టింది.. మహేష్ ద్వారా కార్తీక్‌ను పట్టుకోవాలని చూస్తోందా? అని అనుకుంటుంది. ఇక ఇంకో కొత్త కారెక్టర్‌ను మోనిత తీసుకొచ్చింది. నర్సమ్మ ప్లేస్‌లో విన్నిని తీసుకొచ్చింది.
అన్ని విషయాలను తలుచుకుంటూ కార్తీక్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తాడు. ఒక్కసారిగా పిచ్చి పట్టిన వాడిలా అరిచేస్తాడు. అదే సమయంలో దీప కూడా అక్కడే ఉంటుంది. ఏమైందండి అంటూ దీప కంగారు పడుతుంది. ఇక కొన్ని మంచి మాటలు చెప్పి కార్తీక్‌ను ఓదార్చుతుంది. జీవితంలో ఏం పొగొట్టుకున్నా పర్లేదు కానీ జీవితాన్నే పోగొట్టుకోకూడదు.. మనకు ఇప్పుడేం తక్కువైంది.. కాస్త డబ్బు లేదు అంతే.. అది లేకపోతే బతకలేం.. నీకు నేను.. నాకు నువ్వు.. మనకు పిల్లలున్నారు కదా? అని కాస్త ధైర్యాన్ని నింపుతుంది. పిల్లలకు లంచ్ బాక్స్ ఇచ్చి రండి అని దీప పంపుతుంది.
ఒంటరిగా కూర్చుని సౌందర్య బాధపడుతూ ఉంటుంది. డాడీ ఎక్కడ అని ఆదిత్య అడుగుతాడు. అలా బయట వాకింగ్ చేస్తున్నాడు అని చెబుతుంది సౌందర్య. ఆయనకు ఆరోగ్యం బాగా లేదని, ప్రకృతి వైద్యశాలకు తీసుకెళ్లమని భారతి చెప్పిందంటూ సౌందర్య అసలు విషయం బయటపెట్టేస్తుంది. సరే ఆ పనులన్నీ నేను చూసుకుంటాను అని ఆదిత్య అంటాడు. అన్నయ్య, వదినలు ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆదిత్య అనుకుంటాడు.
ఇక పిండి వంటలు అమ్మేందుకు దీప చాలా కష్టపడుతుంది. ఆల్రెడీ రుద్రాణి తక్కువ ధరకే అందరికీ ఇచ్చేసి ఉంటుంది. దీప దగ్గర ఎవ్వరూ కొనరు. ఒక్క పాకెట్ అమ్మడానికి కూడా దీప చాలా కష్టపడాల్సి వస్తుంది. ఊరి ప్రజల దగ్గరకు వెళ్లి మరీ అమ్మడానికి ట్రై చేస్తుంది. కానీ ఎవ్వరూ కొనరు. మరో వైపు డాక్టర్ బాబు స్కూల్‌కు వెళ్తాడు. అప్పటికే ఆకలి అవుతుండటంతో పిల్లలు ఎదురుచూస్తుంటారు.
డాడీ అంటూ పిల్లలు దగ్గరకు వస్తారు. త్వరగా రండి ఆకలి అవుతోందని అంటారు. కానీ లంచ్ బాక్స్ ఓపెన్ చేసే సమయంలో వేరే అమ్మాయి తగలడంతో అది కాస్తా కింద పడుతుంది. అలా డాక్టర్ బాబును దరిద్రం వెంటాడుతూనే ఉంది. పిల్లలకు కనీసం అన్నం కూడా పెట్టలేకపోయాను అని బాధ పడతాడు. ఏం వద్దులే నాన్న.. అంతగా ఆకలి వేయడం లేదు అని పిల్లలు అనడంతో మరింతగా బాధపడతాడు. ఇంటికెళ్లి అన్నం తీసుకొస్తాను అని కార్తీక్ అంటాడు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో ఏకంగా దీపతోనే రుద్రాణి పిల్లల బేరం గురించి మాట్లాడుతుంది. దీంతో ఒక్కసారిగా దీప శివాలెత్తిపోతుంది.