Site icon A2Z ADDA

Karthika Deepam నేటి ఎపిసోడ్.. మోనిత బిడ్డపై ప్రేమ పెంచుకున్న కార్తీక్.. ఎవ్వరూ వేరు చేయలేరన్న డాక్టర్ బాబు

కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే సోమవారం నాటి Karthika Deepam Episode 1239 ధారావాహికలో కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. ఎందుకు పనికి రాని వాడినంటూ తనను తానే కించపరుచుకుంటాడు. మరో వైపు సౌందర్య తన మనవరాళ్లను తలుచుకుంటూ కుమిలిపోతుంది. పుస్తకాల్లో చిట్టి చిట్టి రాతలను చూడాలని తాపత్రయ పడుతుంది. ఇక రుద్రాణి మాత్రం వంటలక్క పిండి వంటలను చెడగొట్టాలని ప్రయత్నిస్తుంది. ఇందుకోసం కార్తీక్‌ను ఉసిగొల్పాలని ప్రయత్నిస్తుంది. మోనిత బిడ్డ అని తెలియకుండానే కార్తీక్ మాత్రం కోటేశు శ్రీవల్లి కోసం ఆనంద్‌ను తన సొంత బిడ్డగా పెంచుకుంటాను అని మాటిస్తాడు. అలా నేటి ఎపిసోడ్ ముందుకు కొనసాగింది.

వంటగదిలో దీప పిండి వంటలు చేస్తుంటుంది. హిమ, శౌర్యలు తమకు కూడా నేర్పించమని అడుగుతారు. కానీ దీప మాత్రం అందుకు ఒప్పుకోదు. ఈ వంటలక్క బిరుదు, ఈ పని అంతా కూడా తనతోనే ముగిసిపోవాలని, వంటలు నేర్పిస్తానులే అని దీప చెబుతుంది. ఈ మాటలన్నీ కూడా కార్తీక్ వింటాడు. ఇంతలో హిమ, శౌర్యలు కార్తీక్‌ను చూస్తారు. డాడీ అంటూ వచ్చి పక్కనే కూర్చుంటారు. పిండి వంటలు నేర్పించమని అంటే నేర్పించడం లేదు అని పిల్లలు కార్తీక్‌కి చెబుతారు ఈ ఊరు వదిలి వెళ్దాం, మన తమ్ముడు కాదని అంటున్నారు అంటూ శౌర్య అంటుంది. వేరే ఊరు వెళ్దామని అంటారు. అక్కడైతే తమ్ముడు మన వాడే అని చెప్పొచ్చని అంటారు. తమ్ముడిని మనమే పెంచుకుందామని.. చెబుతారు.

మీరు గొప్పగా ఆలోచిస్తున్నారు.. కానీ ఇప్పుడే మనం ఈ ఊరు వదిలేసి వెళ్లలేం అని అంటారు. రుద్రాణి బాండ్ గురించి ఆలోచించిన కార్తీక్ ఏం చెప్పలేకపోతాడు. ఇక టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఆకలి అవుతుంది అని చెబుతాడు.. పిల్లలు ప్లేట్లు తీసుకురండి అని దీప ఆ ఇద్దరిని పంపించేస్తుంది.. ఏం ఆలోచిస్తున్నారు.. అని కార్తీక్‌ను దీప అడుగుతుంది. అప్పు గురించి అయితే కంగారు పడకండి.. తీర్చేద్దాం.. అని దీప ధైర్యం నింపుతుంది. కావాలంటే ఈ ఇళ్లు ఇస్తే తీసుకుంటుంది కదా? అని దీప అంటుంది.. శ్రీవల్లి, కోటేశు చావులకు అర్థమే లేదు.. ఇది వారి పూర్వీకుల ఆస్తి.. అది ఆనంద్‌కు రావాలి.. అని కార్తీక్ అంటాడు. నా దగ్గర ఏదైనా దాచేస్తున్నారా? అని కార్తీక్ గురించి దీప లోలోపల అనుకుంటూ ఉంటుంది.

కార్తీక్ రూం అంతా వెదికిన సౌందర్యను.. ఏం వెతుకుతున్నావ్ అని ఆనంద్ రావు అడుగుతాడు. మాట్లాడవేంటి సౌందర్య..అని ఆనంద్ రావు అడుగుతాడు. పిల్లల పుస్తకాలు వెతుకుతున్నాను.. చిట్టి చిట్టి రాతలు చూస్తే పిల్లలు గుర్తుకు వస్తారని అంటూ సౌందర్య ధీనంగా చెబుతుంది. వాటిని ఆదిత్య స్టోరూంలో వేశాడు.. అని చెబుతాడు. మనల్ని వదిలేసి, ఇన్ని సౌకర్యాలను వదిలేసి వెళ్లారు.. ఏం తింటున్నారో ఏమో, కనీసం పిల్లలు స్కూల్‌కు వెళ్తున్నారో లేదో.. అని సౌందర్య బాధపడుతుంది.

నిజమైన ఆనందం సౌకర్యాల్లో ఉండదు.. మనసులో ఉంటుంది.. మనకు దూరమయ్యారు తప్పా.. సంతోషానికి కాలేదు.. కచ్చితంగా వస్తారు.. ఏదో ఒక రోజు రాకపోరు.. కాకపోతే వాళ్లు వచ్చే వరకు మనం నిబ్బరంగా ఉండాలి.. అని ఆనంద్ రావు ధైర్యం చెబుతాడు. ఏంటయ్య మోనిత ఇక్కడే ఉంటుంది.. ఏం చేయరా? అని సరోజక్క అంటుంది.. బుద్ది చెప్పి పంపిస్తానని ఆమె భర్త అంటాడు.. పుట్టిన బిడ్డను కార్తీక్ బిడ్డనే అంటున్నారు.. దోష నివారణ పూజ కూడా చేశారట.. నిప్పు లేనిదే పొగ రాదు కదా?.. మీరు కూడా ఒకసారి ఆలోచించండి..అని మోనిత గురించి పాజిటివ్‌గా ఆలోచిస్తుంటారు బస్తీవాసులు.

పిండి వంటలు రెడీ చేసి బయటకు వెళ్లేందుకు దీప రెడీ అవుతుంది. అప్పుడే బయటి నుంచి కార్తీక్ వస్తాడు. మీ గురించే ఎదురుచూస్తున్నాను అని దీప అంటుంది. నేను ముళ్ల చెట్టులాంటి వాడిని నా వల్ల ఎలాంటి ఉపయోగం లేదు.. నా గురించి ఎందుకు ఎదురుచూస్తున్నావ్.. నువ్ కష్టపడుతుంటే నేనేం చేయలేకపోతోన్నాను.. నేను దేనికి పనికొస్తానో కూడా తెలియడం లేదు.. ఇన్నాళ్లూ పనికి రాని వాడని అంటే ఏమో అనుకున్నాను.. నేను ఇప్పుడు సరిగ్గా సరిపోతానేమో.. అని కార్తీక్ బాధపడుతుంటాడు.

మిమ్మల్ని మీరు తగ్గించుకోకండి.. అని దీప అంటుంది. తగ్గించుకోవడానికి ఇంకా ఏముంది.. అసలు నేనేంటి.. నేనొక జీరోని.. నా కల్ల ముందు ఒక అమ్మాయి పురిటినొప్పులతో బాధపడింది. డాక్టర్‌ని అయి ఉండి కాపాడలేకపోయాను.. శ్రీవల్లి, కోటేశులకు న్యాయం చేయలేకపోయాను.. రుద్రాణి చేసింది తప్పు అని లోకానికి చెప్పాలనుకున్నా.. కాళ్లకు మట్టి అంటకుండా పెంచాను.. కానీ ఇప్పుడు చెప్పులు లేకుండా నడిపిస్తున్నాను..

కార్లో తిప్పాల్సిన మిమ్మల్ని.. కాళ్ల మీద నడిపిస్తున్నాడు.. కనీసం భోజనం కూడా పెట్టలేకపోతోన్నాను. ఇదంతా ఆత్మ వంచన.. ఏదైనా చేసుకుంటానని నువ్ ఇలా అంటున్నావ్. నేను ఎవరిని.. ఒక డాక్టర్‌నా?, వైద్యం చేయలేకపోతోన్నాను.. మనిషినా?. సాటి మనిషికి సాయం చేయలేకపోతోన్నా.. తండ్రినా? పట్టెడన్నం పెట్టలేకపోతోన్నాను.. భర్తనా? ఏ బాధ్యతా తీసుకోకుండా నువ్ పని చేస్తుంటే.. కళ్లప్పగించి చూస్తున్నా.. అని పరివిధాలుగా తపిస్తుంటాడు.

మీరు ఇన్ని చెప్పారు కదా? నేను ఒక మాట చెబుతాను వినండి.. మీకు ఇష్టమైన, చేతనైనా పని ఏదో ఒకటి చేయండి.. అప్పుడైనా మీకు ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉంటాయ్.. బాబుని చూస్తు ఉండండి.. నేను ఇవన్నీ అమ్మేసి వస్తాను.. అని దీప వెళ్తుంది. ఇక స్టోర్ రూంలో సౌందర్య పిల్లలను తలుచుకుంటూ కుమిలిపోయింది. అదేంటి? ఇదేంటి? అటు వెళ్దాం,. ఇటు వెళ్దాం అంటే కోపం వచ్చేది. కానీ ఇప్పుడు నాకు కోపం తెప్పించేది ఎవరు.. వదిలేసి ఎటు పోయారే.. అంటూ బాధపడుతుంది సౌందర్య.

స్టోర్ రూంలో మోనిత ఫోటో చేసి ఆదిత్యను తిడుతుంది. కుప్పతొట్టిలో వేసేయక.. ఇక్కడెందుకు తెచ్చి పెట్టాడు.. అని బయటకు విసిరి కొడుతుంది. అదే సమయంలో మోనిత ఆ ఫోటోను క్యాచ్ పడుతుంది. నువ్వా.. ఇక్కడెందుకు వచ్చావ్ అని సౌందర్య నిలదీస్తుంది.. మీరు విసిరేస్తే క్యాచ్ పట్టుకున్నాను.. దీని కోసమే వచ్చాను. ఇది న్యూ ఇయర్ గిఫ్ట్‌గా భావిస్తాను.. మీ మంచితనం టన్నుల కొద్దీ ఉంది అని మోనిత అంటుంది.. మీరు పాడేద్దామని అనుకున్నాను.. నేను తీసుకెళ్దామని వచ్చాను.. ఒకే టైమింగ్.. కదా? అని అంటుంది. అయితే కొన్ని జరగవు.. మీరు నన్ను ఫ్యామిలీకి దూరం చేయాలని అనుకుంటున్నారు.. నేను దగ్గరవ్వాలని అనుకుంటున్నాను అని చెబుతుంది.

అప్పుడే మిడిసి పడకు.. అని మోనితకు సౌందర్య కౌంటర్ వేస్తుంది. వెళ్లొస్తాను.. మళ్లీ వస్తాను.. నా కార్తీక్‌తో నా బిడ్డతో మళ్లీ ఇంట్లోకి వస్తాను.. రావమ్మా మోనితమ్మ అని మీరే స్వాగతం పలుకుతారు.. ఆశీర్వదించండి ఆంటీ..అని సౌందర్య కాళ్లకు మోనిత దండం పెట్టబోతోంది. కానీ సౌందర్య పట్టించుకోదు. ఏంట్రా నీ ఒళ్లు ఇలా కాలిపోతోంది.. అనుకోని అతిథిలా వచ్చావ్.. ఈ పేదరికంలో నిన్ను ఎలా చూసుకోవాలి.. మీ అమ్మానాన్నలు ఎవరో తెలీదు.. నీకు మేం ఉన్నాం.. వీళ్లిద్దరి ఆత్మలు పుణ్య లోకాలకు వెళ్లాలని కోరుకుందాం.. ఆనంద్ ఇక నుంచి నా కొడుకు.. నా బిడ్డలతో సమానంగా చూసుకుంటాను.. ఎవ్వరూ వేరు చేయలేరు.. అంటూ మొత్తానికి మోనిత బిడ్డను తన బిడ్డగా తెలియకుండానే కార్తీక్ ఒప్పేసుకున్నాడు. ఇక రుద్రాణి మాత్రం కార్తీక్ దీపల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. పిండి వంటలు అమ్మి నా అప్పు తీర్చేస్తావా? దీప.. నేను ఎలా చేయనిస్తాను.. మగాడి అహం మీద దెబ్బ కొడితే అది మామూలుగా పని చేయదు అంటూ కార్తీక్‌ను రెచ్చగొట్టేందుకు దేవయాణి వస్తుంది. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Exit mobile version