Site icon A2Z ADDA

Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. మోనిత కపటనాటకం.. రుద్రాణి దెబ్బకు దీప షాక్

కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే గురువారం నాడు అంటే డిసెంబర్ 16 Karthika Deepam Episode 1224 నాటి ధారావాహికలో దీపకు షాక్ తగులుతుంది. ఇక మోనిత మరో వైపు కపటనాటకం ఆడుతూ ఆనంద్ రావుని బుట్టలో పడేసేందుకు ప్లాన్ వేస్తుంది. మొత్తానికి ఆనంద్ రావు మాత్రం మోనితను దూరంగానే ఉంచుతాడు. ఇక రుద్రాణి మరో వైపు దీప పొట్ట కొట్టేందుకు చూస్తుంది.

కార్తీక దీపం నేటి ఎపిసోడ్ ఎలా సాగిందంటే.. కార్తీక్ ఇంట్లోకి దూరిన మోనిత పూజలు చేస్తుంది హారతి ఇస్తుంది. కానీ ఎవ్వరూ కూడా మోనితను పట్టించుకోరు. ప్రాక్టీస్ లేక శ్రుతి తప్పింది.. రేపటి నుంచిపూర్తిగా పాడతాను. ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం.. కార్తీక్ దీప మరి నేను లేనా? అందుకే రేపటి నంుచి ఈ పాట మార్చేస్తాను. కార్తీక్ మోనిత దీపం అని పాడతాను అని మోనిత రెచ్చిపోతూ ఉంటుంది.

అత్తయ్య మామయ్య మీరు అలా కబుర్లు చెబుతూ ఉండండి.. ప్రియమణి నాలుగు కాఫీలు.. ఇలానే చెప్పానో లేదో అలా వచ్చావ్.. నీ టైమింగ్ నాకు నచ్చుతుంది ప్రియమణి అంటూ కాఫీలను మోనిత సౌందర్యకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఇక కోపంతో ఆదిత్య ఊగిపోతోంటాడు. ఏం జరుగుతోంది మమ్మీ.. అని ఆదిత్య ఫైర్ అవుతాడు.

దీంతో సౌందర్య ఆ కాఫీ ట్రేను ఈడ్చి అవతల పారేస్తుంది. ఈ పూజలేంటి.. ఈ కాఫీలేంటి?. అంటూ సౌందర్య అరిచేస్తుంది. ఉండేకొద్దీ ఎక్కువ చేస్తోంది. అన్నయ్య అంటే మెతక మనిషి.. మనం కూడా అలానే చేస్తే మన నెత్తిన కూడా ఎక్కేస్తోంది.. అని ఆదిత్య ఫైర్ అవుతాడు. అసలేం అనుకుంటున్నావ్? నీకేం కావాలి.. కార్తీక్ ఎక్కడున్నాడో తెలీక మేం బాధపడుతుంటే.. నీకు ఇది మర్యాదగా ఉంది.. అని ఆనంద్ రావు అంటాడు.

దానికి మర్యాద గురించి ఏం తెలుస్తుంది అంటూ సౌందర్య చీవాట్లు పెడుతుంది. ఇక్కడి నుంచి వెళ్లిపో అని సౌందర్య అరుస్తుంది. ఇంట్లోకి వచ్చేందుకు కోడలిగా నా హక్కు ఉంటుంది.. మీరు అవునన్నా కాదన్నా నేను మీ కోడిలినే.. మీ మనవాడే.. అది మీ నోటితోనే చెప్పిస్తాను.. ఈ ఆస్తి అంతా వాడికే వస్తుంది.. వాడు మీ మనవడే.. నేను మీ కోడిలినే.. అంటూ మోనిత చెలరేగిపోతుంది. ఏంటి ప్రియమణి అలా చూస్తున్నావ్.. ఆంటీ గారికి కోపం వచ్చి అలా విసిరేశారు.. అలా అని మనం కోపం తెచ్చుకుంటావా?. క్లీన్ చేయ్ ప్రియమణి..అని చెప్పి మోనిత వెళ్లిపోతుంది.

ఇక సీన్ కార్తీక్ మీద ఓపెన్ అవుతుంది. రుద్రాణి చేసిన హంగామాను తలుచుకుంటూ ఉంటుంది. రుద్రాణి సామ్రాజ్యం.. అంటూ ఆమె చేసిందంగా గుర్తు చేసుకుని కార్తీక్ బాధపడతాడు. నీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది.. దీప అంటూ గతంలో మాట్లాడిన మాటలను కార్తీక్ తలుచుకుంటాడు. కార్తీక్ బాబు కాఫీ చల్లారిపోతోంది.. తాగండి ఏంటి అలా చూస్తున్నారు.. తాగండి.. కార్తీక్ బాబు.. అని దీప అంటుంది.

రాత్రి జరిగిన విషయాన్ని మరిచిపోండి.. ఆ రుద్రాణి గురించి తలుచుకుంటూ బాధపడకండి.. మిమ్మల్ని, పిల్లల్ని నేను చూసుకుంటాను.. కార్లు, బంగ్లాలు ఇవ్వలేనేమో.. గుట్టుగా సంసారాన్ని నడపగలను..ఏవో కష్టాలు వచ్చాయని అనుకోకండి.. అని దీప అంటే.. ఇంకా ఏం కష్టాలు వస్తాయ్ అని కార్తీక్ అంటాడు.. ఇప్పుడేం జరిగింది.. డాక్టర్ బాబు నుంచి కార్తీక్ బాబు అంటున్నాను.. పిలుపు మారినా ప్రేమ ఉంది.. కాఫీని కప్పులో ఇచ్చేదాన్ని ఇప్పుడు గ్లాసులో ఇస్తున్నాను కానీ టేస్ట్ మారలేదు.

ఇంట్లో సోఫాల్లో కూర్చునేవాళ్లం కానీ ఇప్పుడు ఇలా దగ్గరదగ్గర కూర్చుంటాం. ఇంకా ఎక్కువ ప్రేమగా ఉంటున్నాం.. జరిగిందేదో జరిగింది.. జరగబోయేదాని గురించి ఆలోచిద్దాం.. పదకొండేళ్లు విడిపోయాం.. దగ్గరగా ఉండాలని ఇలా చేశాడేమో.. అని దీప అంటుంది. నీ ధైర్యమేంటి.. దీప అని కార్తీక్ అంటే.. మీరే నా ధైర్యం.. ఇంత కంటే పెద్ద ధైర్యం ఏముంటుంది అని దీప అంటుంది.. నాకు ముగ్గురు పిల్లలు. మిమ్మల్ని అపురూపంగా చూసుకుంటాను అని దీప లోలోపల అనుకుంటుంది.. నేను స్కూల్‌కి వెళ్తాను.. మీరు పిల్లల్ని స్కూల్‌కు తీసుకురండి.. అని చెప్పి దీప వెళ్లిపోతుంది. వంటలక్క.. కాఫీ బాగుంది.. అని కార్తీక్ అంటే దీప నవ్వేసి వెళ్లిపోతుంది.

ఇక సీన్ రుద్రాణి మీద ఓపెన్ అవుతుంది. ఒరేయ్ అబ్బులు.. ఊర్లో సంగతులేంటి.. అని చెప్పరా? అంటే మీ సొమ్మేదో పోయినట్టు అలా చూస్తారేంట్రా.. ఊర్లో మన గురించి ఏమని అనుకుంటున్నారు.. అని రుద్రాణి అడుగుతుంది. ఇదేం బాగా లేదక్క.. ఒరేయ్ చెప్పరా.. శ్రీవల్లి వాళ్లింట్లోకి వచ్చినవాళ్లు.. అని అబ్బులు అంటే.. కోపంతో ఊగిపోతోంది రుద్రాణి.

అది వాళ్ల ఇళ్లు కాదు.. మనది. ఇప్పుడు చెప్పరా?. అని మళ్లీ కంటిన్యూ చేయమంటుంది రుద్రాణి. వాడు మమ్మల్ని కొట్టాడు.. వాడు కొట్టి.. వాడి పెళ్లాం కొట్టి.. ఊర్లో మన పరిస్థితి ఏంటి.. మన మాట ఎవరైనా వింటారా? అని అబ్బులు అంటాడు. ఒక్కోసారి అందరి మీద పెత్తనం చెలాయించలేం.. జింక ముందుగా పరిగెత్తినా.. పులే గెలుస్తుంది.. గెలుస్తాననన్న ధైర్యం పులిది.. ఓడిపోతోన్నానన్న భయం జింకది.. టైం చూసి కొట్టాలి.. మరీ పిచ్చుకల మీద పులి వేటాడదు.. ఎక్కడి నుంచో బతకడానికి వచ్చారు.. మరీ తోక జాడిస్తే అప్పుడు చూద్దాం.. అంటూ రుద్రాణి మంచి ప్లాన్ వేసినట్టు కనిపిస్తుంది.

ఇక మళ్లీ సీన్ ఆనంద్ రావు, మోనితల మీద ఓపెన్ అవుతుంది. ఆనంద్ రావు కాళ్ల మీద మోనిత పడుతుంది. మామయ్య గారు.. మీరు ఈ ఇంటి పెద్ద.. మీరంటే నాకు గౌరవం.. కార్తీక్ మీ అబ్బాయి కాబట్టి.. అందరూ ఆ వైపు నుంచే ఆలోచిస్తున్నారు.. నన్ను విలన్‌ని చేస్తున్నారు.. అని మోనిత కొత్త నాటకం మొదలుపెడుతుంది. ఏంటమ్మా నీ గోల.. అని ఆనంద్ రావు విసుక్కుంటాడు.

కార్తీక్ నా దగ్గరకు వచ్చాడు.. ప్రేమ, పెళ్లి అన్నాడు.. బాబును కన్నాను.. మీ మీద ప్రేమతో పేరు పెట్టాను.. కార్తీక్ ఎక్కడికి వెళ్లాడో తెలీదు.. నా బాబును ఎవరో ఎత్తుకెళ్లారు.. నేనేం చేయగలను.. కార్తీక్ వస్తాడు.. బాబు దొరుకుతాడు.. ఈ ఇంట్లో ఉండేందుకు మీరు నాకు సాయం చేయండి.. పెళ్లి కాకపోయినా తల్లిని అయ్యాను. అయినా గ్రాము ప్రేమ కూడా తగ్గలేదు.. మామయ్య గారు నా మొహం చూడండి.. కార్తీక్ కోసం ఎన్ని కష్టాలు పడ్డాను..ఈ ఇంట్లో చీపురు, వంటసామాగ్రి, స్టోరూంలో సామాన్లలా పడి ఉంటాను.. ఇంత చోటివ్వండి.. ఇంత కన్నా నాకు ఏ కోరిక లేదు..అని మోనిత నాటకాలు ఆడుతూ ఉంటుంది.

మోనితమ్మ గారు మీరు మామూలు నటి కాదు.. నట శిరోమణి.. అని చాటు నుంచి ప్రియమణి వింటుంది. ఇలా నట్టింట్లో ఏడ్వకు అని మోనితను ఆనంద్ రావు విసుక్కుంటాడు. నా బిడ్డ కనిపించడం లేదని కంప్లైంట్ ఇద్దామంటే తండ్రి ఎవరని అడుగుతారు.. తండ్రి ఎక్కడా అని అంటారు.. మళ్ళీ మన ఫ్యామిలీకే చెడ్డ పేరు వస్తోంది.. మావయ్య గారు మీ కాళ్లకు దండం పెడతాను.. మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటాను..అని మోనిత నాటకాలు ఆడుతూ ఉంటుంది. నన్ను వెళ్లనివ్వమ్మా అని ఆనంద్ రావు వెళ్లిపోతాడు. మిమ్మల్ని మచ్చిక చేసుకుంటే ఈ ఇంట్లో కోడలిగా నా స్థానం పదిలం అవుతుందని అనుకున్నా.. నా కొడుకు ఎక్కడున్నాడో ఏమో.. అని మోనిత అనుకుంటుంది.

ఇక దీప మీద సీన్ ఓపెన్ అవుతుంది. ఈ పని దొరికింది కాబట్టి అంతో ఇంతో చూసుకోగలుగుతాను అని దీప అనుకుంటూ స్కూల్‌కు వెళ్తూ ఉంటుంది. కానీ ఇంతలోనే దీపకు షాక్ తగులుతుంది. పని వేరే వాళ్లకు ఇచ్చేం.. పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి.. అని అంటుంది. జీతం కొంచెం తగ్గించి ఇచ్చినా పర్లేదు.. అని దీప వేడుకుంటుంది. ఎవ్వరికి ఇచ్చినా కూడా పర్లేదు.. నీకు మాత్రం ఇవ్వొద్దన్నారు.. అని ఆమె చెబుతుంది. ఎవరు చెప్పారు అని దీప అడుగుతుంది. రుద్రాణి నీకు ఇవ్వొద్దని అన్నారు.. తన మాట కాదంటే.. నేను ఇబ్బందుల్లో పడతాను.. సారీ దీప.. నేను నీకు మాటిచ్చాను.. కానీ రుద్రాణిని ఎదురించలేను.. అని ధీనంగా చెబుతుంది. థ్యాంక్స్ అండి మీ వంతు మీరు సాయం చేద్దామని అనుకున్నారు.. మీరు బాగుండాలి.. అని దీప చెబుతుంది. అలా మొత్తానికి ఎపిసోడ్ ముగుస్తుంది. మరి దీప తన సంసారాన్ని ఎలా ముందుకు కొనసాగిస్తుందో చూడాలి.

Exit mobile version