కార్తీక దీపం ఈ రోజు ఎపిసోడ్ అంటే.. మంగళ వారం నాడు.. అంటే.. Karthika Deepam Episode 1216 ధారావాహికలో కార్తీక్ తన ఆస్థి మొత్తాన్ని దానం చేస్తాడు. తన వల్ల చనిపోయిన పేషెంట్ భార్యకు తన ఆస్తి మొత్తాన్ని దానం చేస్తాడు. కానీ ఇవేమీ తెలియని దీప.. అటు వైపు బస్తీలో ల్యాండ్ కొనేందుకు సైట్ చూస్తుంటుంది. పది లక్షలు అడ్వాన్స్ ఇస్తాను అని కూడా మాటిస్తుంది. మొత్తానికి కార్తీక దీపం నేటి ఎపిసోడ్ మాత్రం మంచి ఎమోషనల్ కంటెంట్ ఇచ్చింది. గుండెలు పిండేసే సీన్లతో ముందుకు సాగింది. మంగళవారం నాటి ఎపిసోడ్ ఇలా జరిగింది..
చనిపోయిన పేషెంట్ భార్యతో కార్తీక్ ఇలా అంటాడు. జరిగిన నష్టాన్ని పూడ్చలేను.. పోయిన ప్రాణాన్ని తీసుకురాలేను.. కానీ ఒక్కటి మాత్రం చేయగలను.. నేను జీవితాంతం కష్టపడ్డ ఆస్తి.. మీకు ఇస్తున్నా.. దీంతో హాయిగా ఉండొచ్చు.. పిల్లల చదువుచెప్పొచ్చు అని ధీనంగా బతిమిలాడుతాడు.. ప్రాణాలు తీసి పట్టాలిస్తున్నావా?.. మనిషే పోయాక.. ఆస్తులేం చేసుకోను అని పేషెంట్ భార్య తన బాధను వెళ్లగక్కుతుంది.
అమ్మ మీకు దండం పెడతాను.. కాదనకండి అని కార్తీక్ ప్రాధేయపడతాడు..నువ్వే చంపుతావ్..ఆస్తులు ఇస్తావా? నా మొగుడి ప్రాణాలు తీసుకొచ్చివ్వు అని ఆమె అంటుంది. నీ కాళ్లు పట్టుకుంటాను.. కష్టపడి సంపాదించిన ఆస్తులు.. నీకు నీ కూతుళ్లకు ఉపయోగపడతాయ్.. తీసుకో అమ్మ.. అని పదే పదే కార్తీక్ ప్రాధేయపడతాడు. ఆవేశంలో ఇలా అంటున్నావ్ నీలమ్మ.. తీసుకోవే.. నీ పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగపడుతుంది అని చుట్టు పక్కల వాళ్లు చెబుతారు.
నా పిల్లలకు ఉసురు తగలాలని మాత్రం అనకండి.. నేను బతికేదే వాళ్ల కోసం.. నా పిల్లలను శపించకండమ్మ.. ప్లీజ్ ప్లీజ్ అని కార్తీక్ కుమిలిపోతాడు.. కార్తీక్ పద నాన్న అంటూ అక్కడి నుంచి తీసుకెళ్తుంది సౌందర్య.. కార్తీక్ ఇలా ఆస్తి మొత్తాన్ని ఇచ్చేస్తే.. మరో వైపు దీప మాత్రం సైట్ చూసిన ఆనందంలో ఉంటుంది. మంచి ప్లేస్ చూపించినందుకు థ్యాంక్స్ వారణాసి అడ్వాన్స్ ఇచ్చేందుకు కూడా ఓకే అంటుంది. పది లక్షలు ఇవ్వమంటే.. పదిహేను ఇస్తానని చెప్పమంటుంది. డాక్టర్ బాబు కూడా ఉత్సాహంగా ఉన్నారు అని దీప అంటుంది.
జరిగిన విషయాలను తలుచుకుంటూ కార్తీక్, సౌందర్యలు కారులో వస్తుంటారు. నన్ను చూస్తుంటే అసహ్యంగా ఉందా మమ్మీ అని కార్తీక్ అంటే.. నేను నీ అమ్మను రా అని సౌందర్య అంటుంది.. అందుకే నేను ఎంత పెద్ద తప్పు చేసినా ఏమీ అనడం లేదు.. తప్పేంటి. పాపం చేశాను మమ్మీ.. చచ్చిపోయాడు.. ఈ చేతుల్లో చచ్చిపోయాడు.. పాపం ఆవిడ ఎలా ఏడుస్తుందో చూశావా.. డబ్బు ఇచ్చాను గానీ, తండ్రి ప్రేమను మాత్రం ఇవ్వలేను.. ఎలా జరిగిందో అర్థం కావడం లేదు అని కార్తీక్ పరివిధాలు పరితపిస్తుంటాడు.
ఆస్తి మొత్తం ఇచ్చావ్ గా ప్రశాంతంగా ఉండు అని సౌందర్య అంటే. ఆస్తి ఇచ్చాను కానీ ప్రాణం తిరిగి ఇవ్వలేదు కదా?.. ఇంతకంటే ఏం చేయగలం.. ఆడపిల్లల గురించి ఎక్కువగా ఆలోచించావ్ అని సౌందర్య ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. నేను నా పిల్లల గురించి ఆలోచించాను.. ఆవిడ ఉసురు నా పిల్లలకు తగలకూడదని ఆస్తి పత్రాలతో తుడుచుకున్నాను.. ఒక్కసారైనా నన్ను తిట్టు.. నీకు కొడుగ్గా పుట్టి ఎన్ని తలవొంపులు తెచ్చాను.. అవమానాల పాలు చేశాను.. దీపను అనుమానించాను.. పదకొండేళ్లు దూరం చేశాను.. మోనిత విషయంలో ఎన్ని అవమానాలు పడ్డారు.. పోలీస్, కోర్టు, ఇంటా బయట ఎన్ని అవమానాలు. ఎన్ని భరించారు.. నేను దురదృష్టవంతుడిని.. చెడ్డ కొడుకు, చెడ్డ భర్త, చెడ్డ తండ్రిని.. ఇప్పుడు చెడ్డ డాక్టర్‌ని కూడా అయ్యాను.. నా మీద నాకే అసహ్యం వేస్తోంది.. ఇంత జరిగినా కూడా తిట్టవేంటి మమ్మీ.. తిట్టేందుకు కూడా అర్హత లేదా? అంత దిగజారానా? మమ్మీ.. అని కార్తీక్ బాధపడతాడు. ఆపరా అంటూ కార్తీక్‌ను ఓదార్చుతుంది సౌందర్య.. నా మీద నాకే అసహ్యంగా.. కళ్లలో కళ్లు పెట్టి చూడలేకపోతోన్నాను.. మమ్మీ అని కార్తీక్ తనలో తాను అనుకుంటాడు.
ఇక ప్రియమణి నీళ్లు కూడా పెట్టుకోకుండా అన్నం తింటూ ఉంటుంది. పొలమారడంతో మోనిత నీళ్లు తెచ్చిస్తుంది. నీళ్లు పెట్టుకోకుండా తింటున్నావ్ ఏంటి? అని ప్రియమణిని మోనిత అడుగుతుంది. వంటలు ఎలా ఉన్నాయ్? అని మోనిత అడుగుతుంది.. నా వంటలు నాకు నచ్చకుండా ఎలా ఉంటాయి? అని ప్రియమణ అంటుంది.. నీ తొక్కలో వంటలపైనే నీకు ఇంత ఉంటే. .నా కార్తీక్ మీద నాకు ప్రేమ ఉండ కూడదా? అని లాజిక్ తీస్తుంది
ఫుడ్ నచ్చకపోతే ఒక హోటల్‌లో నచ్చకపోతే.. ఇంకో చోట తినొచ్చు.. కానీ కార్తీక్ దొరకడదు కదా? ప్రపంచంలో ఒక్కడే కార్తీక్.. ఒక్కతే మోనిత.. ఒక్కటే ప్రేమ.. నువ్వేదో అన్నావ్.. వాళ్లేదో అన్నారని చేయలేదు.. నా లెక్కలు నాకుంటాయి.. కార్తీక్ మాత్రం దీప పక్కనే ఉంటాడు.. కానీ నా గుండెల్లో ఉంటాడు.. ఈవిడ నన్ను భోజనం కూడా చేయనివ్వదా? అని మనసులో అనుకుంటుంది ప్రియమణి. ఏంటి భోజనం కూడా సరిగ్గా చేయనివ్వడం లేదని అనుకుంటున్నావా? అయినా పర్లేదు.. ఎన్నిసార్లు చెప్పినా ఆనందంగానే ఉంటుంది ప్రియమణి అని మోనిత తన పాటికి తాను చెప్పుకుంటూనే పోయింది.
ఇంట్లోకి వస్తోన్న కార్తీక్, సౌందర్యలను కాళ్లు కడుక్కుని రమ్మని ఆనంద్ రావు చెబుతాడు. జరిగిన విషయాలన్నీ తలుచుకుంటూ కార్తీక్, సౌందర్యలు బాధపడతుంటారు. ఇంతలో దీప ఎంతో సంతోషంలో ఇంటికి వస్తుంది. వస్తూనే డాక్టర్ బాబు అంటూ.. నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను.. నా మాట వినగానే ఇల్లు, హాస్పిటల్ బస్తీలో కడదామని అన్నారు.. అత్తయ్య గారు బస్తీలో మన కోసం వారణాసి మంచి స్థలం చూపించాడు..
మామయ్య గారు నాకు చాలా సంతోషంగా ఉంది.. ఎన్నో కష్టాలు పడ్డాను..అక్కడే స్థలం కొని ఇళ్లు కట్టుకోబోతోన్నాను.. మీరు అన్న మాట నిజమే.. నేను ఈ ఇంటి పెద్ద కోడలిని.. డాక్టర్ బాబు.. దీ గ్రేట్ డాక్టర్ బాబుకు భార్యను.. తలుచుకున్న కార్తీక్.. అవును పిల్లలేరి.. ఆదిత్యతో బయటకు వెళ్లారు.. ఎగిరి గంతులేస్తారు.. వాళ్లకి నాలానే బస్తీ అంటే చాలా ఇష్టం. నాకు మీరు ఇస్తున్న గొప్ప గిఫ్ట్.. బస్తీలో ఇళ్లు కట్టివ్వడం, పది లక్షలు అడ్వాన్స్‌గా ఇవ్వమన్నారు.. ఏం మాట్లాడుతున్నారు.. నేను ది గ్రేట్ డాక్టర్ బాబు భార్యను.. పది కాకపోతే.. పదిహేను లక్షలైనా ఇస్తాను అని అన్నాను.. అంతే కదా? డాక్టర్ బాబు.. వారం రోజుల్లో డబ్బు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోమన్నారు. వారంలో కాదు.. మూడు రోజుల్లోనే కట్టేస్తాను అని చెప్పాను.. ఏంటి నేనే మాట్లాడుతున్నాను.. మీరంతా సైలెంట్‌గా ఉన్నారు.. ఏంటి డాక్టర్ బాబు.. అలా డల్‌గా మొహం పెట్టారేంటి? ఏంటి స్వామి.. అని దీప తన పాటి తాను మాట్లాడుతూనే ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో జరిగిందంతా కూడా దీపకు కార్తీక్ చెప్పేట్టున్నాడు. ఆస్తి మొత్తం ఇచ్చేశానని చెప్పడంతో దీప ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో చూడాలి. మళ్లీ బస్తీకి వెళ్లి సాధారణ జీవితం గడుపుతారేమో చూడాలి.