Site icon A2Z ADDA

Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. సిగ్గులేని మోనితకు దీప గుణపాఠం.. బస్తీలో డాక్టర్ బాబు మకాం

కార్తీక దీపం నేటి ఎపిసోడ్ అంటే.. సోమవారం (నవంబర్ 29) జరగబోయే ధారావాహికలో మోనితను బస్తీవాసులు ఉరికిస్తారు. ఇక దీప కార్తీక్ ఇద్దరూ కూడా వంటగదిలో సరదాగా నవ్వుతూ పని చేస్తుంటారు. ఇక మోనిత మరో ప్లాన్ వేసి రెడీగా ఉంటుంది. ఇలా మొత్తానికి కార్తీక్ ఇంట్లో మాత్రం సంతోషాలు వెల్లివిరుస్తాయి. పిల్లలు బస్తీలోనే బాగుంది కదా? అని అంటే ఆదిత్య కోప్పడతాడు. అలా Karthika Deepam Episode 1209 లో ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

బస్తీలో ఏర్పాటు చేసిన క్యాంపు వద్ద మోనిత రచ్చ చేయాలని చూస్తుంటుంది. ఈ క్రమంలో ఆనంద్ రావు అక్కడికి వస్తాడు. ఏంటమ్మ.. నువ్ చేసిందే నీచమైన.. పచ్చమని సంసారంలో చిచ్చుపెట్టావ్.. కలిసిపోయారని కడుపు మండుతోందా? ఇదేమైనా బాగుందా? అంటూ చెడామడా తిట్టేస్తాడు. అస్సలు బాగాలేదు మామయ్య గారు.. ఎవరు ఎలా పోతే నాకేంటి.. నాకు నా కార్తీక్ కావాలి.. నా బిడ్డకు కార్తీకే తండ్రి అని ఒప్పుకోవాలి.. అని మోనిత అంటుంది..మోనిత అని ఆనంద్ రావు అరుస్తాడు.

మావయ్య గారు తనకు అలా మంచిగా చెబితే ఎందుకు అర్థమవుతుంది. తనకు అర్థమయ్యే భాషలోనే చెబుతాను.. అంటూ బస్తీ వాసులకు మోనిత నీచపు పనుల గురించి వివరిస్తుంది దీప. డాక్టర్ బాబు గారి గురించి మీ అందరికీ తెలుసు.. ఈమె పేరు మోనిత.. తప్పుడు దారిలో బిడ్డను కనింది.. మన డాక్టర్ బాబును బద్నాం చేస్తోంది. చేసిందే తప్పు.. అది డాక్టర్ బాబు మీదకు నెడుతోంది.. ఆ బిడ్డకు డాక్టర్ బాబుకు ఏ సంబంధం లేదు.. ఇదే మోసం చేసింది బిడ్డను కన్నది అంటూ బస్తీలోని ఆడవాళ్లకు దీప చెప్పింది.

ఇలాంటి తప్పు మన బస్తీలో ఏం చేస్తాం.. అని దీప అంటే.. జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి నాలుగు తంతామని అంటారు. పెళ్లైన మగాడి వెనకాల ప్రేమ ప్రేమ అని వెనకాల తిరిగితే ఏం చేస్తాం.. అని దీప అడుగుతుంది. చీపురు తిరగేసి కొడతాం అని సమాధానం చెబుతాడు.. ఇంకా చూస్తారేంటే.. మన బస్తీకి వచ్చిన డాక్టర్ బాబు మీద నిందలు వేస్తే చూస్తారేంటి.. దీని సంగతి చెబుదామ పదా? అని బస్తీ వాళ్లు చెలరేగిపోతారు.

ఏంటమ్మా నీ గోల.. మా బస్తీ వాళ్ల సంగతి నీకు తెలీదు.. అని చీపుర్లు పట్టుకుని వస్తారు. దీంతో బయపడ్డ ప్రియమణి అక్కడి నుంచి మోనితను తీసుకెళ్తుంది. నీ బస్తీ వాళ్లను నా మీదకే ఉసిగొల్పుతావా? నిన్ను వదలను.. కార్తీక్.. నీ వంటలక్కే నా దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పేలా చేస్తానంటూ బెదిరించుకుంటూ వెళ్తుంది. అలా అక్కడ సీన్ కట్ చేస్తే కార్తీక్ ఇంట్లో ఓపెన్ అవుతుంది.

ఏంటి హిమ.. ఎవ్వరూ కనిపించడం లేదు.. ఇళ్లు ఇంత సైలెంట్‌గా ఉందేంటి?. అని శౌర్య అంటుంది. దీంతో అక్కడకు వచ్చిన ఆదిత్య.. మీరు లేరు కదా?అందుకే ప్రశాంతంగా ఉంది అని అంటాడు.. జోకా నవ్వలా బాబాయ్ అని శౌర్య అనడంతో.. హిమ నవ్వేస్తుంది.. అమ్మ వాళ్లు ఎక్కడికి వెళ్ళారు అని పిల్లలు అడిగితే.. బయటకు వెళ్లారు అని సమాధానం చెబుతాడు. బయటకు వెళ్లారా? మాకు చెప్పకుండా వెళ్లారా? అంటే షాపింగ్ కోసమే వెళ్లి ఉంటారు..

అందుకే నన్ను తీసుకెళ్లలేదు అని హిమ ఫీలవుతుంది. బయటకు వెళ్లారంటే షాపింగ్ అని ఆలోచిస్తారా? సరిగ్గా ఆలోచించండి.. బస్తీకి వెళ్లారు అని ఆదిత్య అంటాడు.. బస్తీకి వెళ్లారా?.. మేం కూడా వెళ్లేవాళ్లం కదా? బస్తీకి వెళ్లడం మాకు ఇష్టం.. మమ్మల్ని కూడా తీసుకెళ్లాల్సింది.. ఎఫ్పుడూ అక్కడే ఉంటే బాగుండేది కదా? హిమ అనడంతో ఆదిత్య ఫైర్ అవుతాడు..అదేం కోరిక.. ఇంకోసారి బస్తీ అని అనకండి.. అని పిల్లల మీద అరిచేస్తాడు.

మేం బస్తీకే కదా? వెళ్తాం అనేది.. అంటూ శౌర్య అనేస్తుంది. పైన తదాస్థు దేవతలుంటారు.. మనం ఏది అనుకుంటే.. అదే దీవిస్తారట.. అలాంటి మాటలు మాట్లాడకు.. అని ఆదిత్య వార్నింగ్ ఇస్తాడు. బస్తీలో దీనికి ఏం నచ్చిందో నాకు తెలీదు. కానీ..బస్తీలో వదిన ఎన్నో కష్టాలు పడింది.. నాకు తెలుసు.. అది వీళ్లకు చెప్పలేను.. అని లోలోపల అనుకుంటాడు. ఇంకోసారి మీ నోటి నుంచి బస్తీ పేరు రాకూడదు.. అని చెప్పి వెళ్తాడు ఆదిత్య.

ఇక అక్కడ సీన్ ఓపెన్ చేస్తే మోనిత ఇంట్లో భోజనం చేస్తుంటుంది. ఆహా ఓహో చాలా బాగుంది.. అప్పుడప్పుడు నిన్ను తిడతాను కానీ నువ్ వంటలు బాగా చేస్తావ్ ప్రియమణి.. నాకు ఇష్టమైన వెజ్ బిర్యానీ వండావ్.. తృప్తిగా చాలా రోజులకు తింటున్నాను.. ఇంకాస్త వెయ్ ప్రియమణి.. అని మోనిత ఫుల్ జోష్‌లొ ఉంటుంది. అమ్మా మీరు ఇంత హుషారుగా ఉన్నారేంటి?.. మీరేంటి మరీ ఇంత ఉత్సాహంగా ఉన్నారు.. అని అడుగుతుంది.

పరిగెత్తేవాడికి.. దెబ్బ తగిలితే.. మెల్లిగా కుంటుతూ నడుస్తాడు. కానీ నేను మాత్రం ఇంకా ఫాస్ట్‌గా పరిగెడతాను.. నన్ను రెచ్చగొడితే ఇంకా రెచ్చిపోతాను.. నేను అందరిలాంటి దాన్ని కాదు.. అంతకు మించి ఆలోచిస్తాను.. దీప మీద కోపం చల్లారలేదు .. ఏంటి కోతలు కూస్తోంది అని అనుకుంటున్నావా? కోతలు కోయడం లేదు.. కూతలు పెట్టిస్తా.. మోనిత పని అయిపోయిందని అనుకుంటారు..ఎవరి పని అయిపోయిందో… రేపు ఉదయం చూపిస్తా.. రేపే చూడండి.. మీ అభిమానా దీపాయణం.. బిర్యానీ అదిరింది.. మోనిత ఉత్సాహంగా ఉంది.. దీపక్క రెడీగా ఉండు.. అంటూ మోనిత తనలో తాను రాక్షసానందం పొందింది.

వంటగదిలో డాక్టర్ బాబు, వంటలక్కలు కాస్త ఏకాంతంగా గడుపుతారు. జోకులు వేసుకుని నవ్వుతారు. డాక్టర్ బాబు పచ్చిమిర్చీలు సరిగ్గా కోయలేకపోతాడు. దానిపై వంటలక్క సెటైర్లు వేస్తుంది. మిరపకాయలు అలా ఎందుకు కోయాలి? అని డాక్టర్ బాబు ప్రశ్నిస్తాడు.. గుండె కోసి ఆపరేషన్ చేసే డాక్టర్ బాబుకు పచ్చిమిర్చి ఎలా కోయాలో తెలియడం లేదు.. మీరు హాస్పిటల్‌లో డాక్టర్ అయితే.. వంటగదిలో నేను డాక్టర్‌ని.. మీరు కార్డియాలాజిస్ట్ అయితే నేను ఇక్కడ డాక్టర్‌ని అని అంటుంది

ఇంతకీ ఏమంటావ్.. ఎవరి గొప్ప వారిది అని నువ్ అంటావా? అని డాక్టర్ బాబు అడుగుతాడు. అవును అని దీప అంటుంది.. క్యాంప్ పెట్టినందుకు థ్యాంక్స్ అని దీప అంటుంది. ఇంత చిన్న దానికే థ్యాంక్స్ ఎందుకు అని డాక్టర్ బాబు అంటాడు. అరుణక్కతో ఓ మాట అన్నాను అండి.. అక్కడే ఉందామని దీప పూర్తి చేసే లోపు డాక్టర్ బాబు ఫైర్ అయినట్టుగా చూపిస్తాడు. అంటే మనం ఇప్పుడు అక్కడ స్థలం కొని ఇళ్లు కట్టుకుంటామని అరుణక్కతో చెప్పావా? సీరియస్‌గా అడుగుతాడు కార్తీక్.

దీంతో దీప క్షణం పాటు భయపడుతుంది. సరే దీప.. త్వరలోనే మనం స్థలం కొందాం.. అక్కడ హాస్పిటల్ కూడా కడదాం అని అంటాడు కార్తీక్. మీరు చాలా మంచి వాళ్లు డాక్టర్ బాబు అని దీప అంటే.. ఆ బస్తీ వాళ్లు మంచోళ్లు.. ఎలాంటి బంధం లేకపోయినా.. నిన్ను బాగా చూసుకున్నారు. వాళ్లకు ఎంతో రుణపడి ఉన్నాను.. వాళ్ల రుణం తీర్చుకుంటాను.. వారంలో రోజుల్లోనే శంకుస్థాపన చేసేద్దామని కార్తీక్ అంటుండగానే సౌందర్య వస్తుంది.

ఏంటో శంకు స్థాపన అంటున్నావ్.. అని సౌందర్య అడగడంతో అసలు విషయం చెబుతాడు కార్తీక్. బస్తీలో ఇళ్లు, హాస్పిటల్ కట్టాలని అనుకుంటున్నాను మమ్మీ అని అనేస్తాడు కార్తీక్.. మమ్మల్ని వదిలేసి వెళ్లిపోతోన్నావా? అని సౌందర్య అంటే.. మైడియర్ మమ్మీ.. బస్తీకే కదా? నేను వెళ్లేది అమెరికాకో ఆస్ట్రేలియాకో కాదు కదా?. టీ అక్కడ టిఫిన్ ఇక్కడ.. లంచ్ అక్కడ.. డిన్నర్ ఇక్కడ.. బస్తీ వాళ్లకు నేను చాలా రుణపడి ఉన్నాను.. అని మిరపకాయలు కోసిన చేత్తో సౌందర్య మొహాన్ని పట్టుకుంటాడు కార్తీక్.

దీంతో సౌందర్య మొహం మండిపోతుంది. వెన్న రాయమంటారా? అత్తయ్య గారు అని దీప అంటే. కొడుకు మంటపుట్టిస్తాడు.. కోడలు వెన్న రాస్తుందా? అని వెటకారంగా అనేస్తుంది సౌందర్య.. డాక్టర్‌వి వంటగదిలో ఏం పని చేస్తున్నావ్.. ఇలా చూడముచ్చటగా ఉంది అంటూ సౌందర్య అంటుంది.. వంటలు ఎలా చేయాలో నేర్చుకుంటున్నాను.. ఫీజు అడక్కండి.. అని డాక్టర్ బాబు జోకులు వేస్తాడు. పచ్చిమిర్చిలు కూడా కట్ చేయడం రాదు.. అడ్డంగా అడ్డదిడ్డంగా కట్ చేశాడు.. అని డాక్టర్ బాబు పనితనం గురించి దీప చెబుతుంది. ఇప్పుడు అవసరమా? అది చెప్పడం.. ఫస్ట్ టైం ఏదో కట్ చేశామని డాక్టర్ బాబు అంటే.. దీప, సౌందర్యలు నవ్వుకుంటారు.

ఈ నవ్వులను చూసి ఆనంద్ రావు తెగ సంబరపడిపోతాడు. భగవంతుడా.. ఈ క్షణాన్ని ఇలా ఉండనివ్వు.. నా కోడలు మనస్ఫూర్తిగా నవ్వుతోంది.. అని అనుకుంటాడు. వారి దగ్గరకు వచ్చి.. మీ ఆనందంలో ఈ ఆనంద్ రావును కూడా పాలు పంచుకోనివ్వండి..అని అంటాడు. ఏమండి మీరు ఈ పచ్చిమిర్చిని కోయండని సౌందర్య అంటుంది. ఓ దానికేముంది కోసేస్తాను అని పెన్సిల్ చెక్కినట్టు చెక్కేస్తాడు. డాడీ కంటే నేనే నయం.. డాడీ అది పెన్సిల్ కాదు.. పచ్చిమిర్చీ.. అని కార్తీక్ కోసేస్తాడు

డాక్టర్ బాబు, వంటలక్క ఫోటలను హిమ చూసుకుంటూ.. మీరు ఎప్పుడూ కలిసే ఉండాలి సరేనా? ఇలా నవ్వుతూనే ఉండాలి అని అనుకుంటుంది .. ఏంటి హిమ ఇక్కడేం చేస్తున్నావ్ అని శౌర్య అంటుంది. అమ్మానాన్న ఎప్పుడూ ఇలానూ కలిసి ఉంటే ఎంత బాగుంటుంది కదా? అని హిమ అంటే.. ఎప్పటికీ ఇలానే కలిసి ఉంటారు అని శౌర్య అంటుంది..నీకో గుడ్ న్యూస్ చెప్పాలా? అని శౌర్య అంటుంది. మనం బస్తీలో కొత్త ఇళ్లు కట్టుకోబోతోన్నామని తాతయ్య అన్నారు అని శౌర్య అంటుంది

మనం బస్తీలోకి ఇళ్లు కట్టుకోబోతోన్నామా.. బస్తీలో బాగుంటుంది..చుట్టూ అందరూ ఉంటారు.. ఆడుకోవడానికి పిల్లలుంటారు.. బస్తీలో చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది.. అని హిమ, శౌర్యలు సంబరపడిపోతారు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా కార్తీక్‌ను ఎన్నుకుంటారు. కానీ అక్కడకు వచ్చిన కార్తీక్ పరువుతీసేందుకు మోనిత ట్రై చేస్తుంది. నాకు కార్తీక్ అన్యాయం చేశాడు.. న్యాయం చేశాకే ఆ పదవిని ఇవ్వండని మోనిత అంటుంది. అసలు డాక్టర్ వృత్తికే మోనిత కళంకం అంటూ దిమ్మతిరిగిపోయేలా దీప కౌంటర్ ఇస్తుంది. చూస్తుంటే మోనితను డాక్టర్ వృత్తిలోంచి పీకించేసేలా ఉంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

Exit mobile version