Site icon A2Z ADDA

Karthika Deepam Episode 1202 : మాయమైన దీప.. మోనిత షాక్.. వంటలక్క ప్లాన్ ఏంటి?

కార్తీకదీపం సీరియల్‌లో శనివారం అంటే నవంబర్ 20వ తేదీ అంటే ఎపిసోడ్ నంబర్ 1202లో ఏం జరిగిందో ఓ సారి చూద్దాం. దీపావళి వేడుకల్లో కార్తీక్, దీప, పిల్లలు అంతా సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అంతా సంతోషంగా ఉన్న సమయంలో సౌందర్యకు మోనిత ఫోన్ చేస్తుంది. హాలో ఆంటీ, నేను మోనిత, మీ కోడలు.. దీపావళి శుభాకాంక్షలు ఆంటీ.. అని మోనిత కాస్త ఓవర్ చేస్తుంది. ఎందుకు ఫోన్ చేశావ్ అని సౌందర్య అడుగుతుంది. పూజ అయిపోతే ఫోన్ చేయోద్దా? ఒంట్లో బాబుకు బాగాలేదు.. ఒంటరిగా ఉన్నాను.. కార్తీక్‌ను అయినా రమ్మనండి.. మీరు వచ్చినా పర్లేదు.. అని మోనిత రెచ్చిపోతుంది. దీప.. జాగ్రత్త చీరకాలుతుంది.. అని కార్తీక్ అన్న మాటలను వింటుంది మోనిత. దీంతో కోపం వచ్చిన మోనిత. ఫోన్ కట్ చేస్తుందది.

పండుగ పూట కూడా ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. అందుకే ఇలా చేస్తోందేమో.. ఈ విషయం కార్తీక్‌కు చెప్పడం అవసరమా? అని తనలో తాను అనుకుంటుంది సౌందర్య. ఇక అక్కడ సీన్ కట్ చేస్తే ఉదయం పూట మోనిత మీద ఓపెన్ అవుతుంది. దీప మాటలు గుర్తు చేసుకున్న మోనిత.. ఆ ధైర్యం ఏంటి? ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు.. అని కంగారు పడుతుంటుంది. కార్తీక్ అన్న మాటలు.. ఇంపాజిబుల్.. సంతకం పెట్టకుండా ఉండాల్సింది అనే సీన్స్ గుర్తు చేసుకుంది.

ఇంత జరిగినా కూడా నా మీద ప్రేమ పెరగలేదు.. దీప మీద ప్రేమ తగ్గలేదు.. అని మోనిత అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ప్రియమణి వచ్చి.. ఎందుకమ్మా అలా ఉన్నారు.. బాబుకు జ్వరం తగ్గింది కదా? పర్లేదులే అని అంటుంది. మోనిత ఏం మాట్లాడకుండా సరదాగా ఉంటుంది. కార్తీక్ బాబు ఏమైనా అన్నాడా? అని మళ్లీ ప్రశ్నిస్తుంది ప్రియమణి. ఎదుటి వాళ్లు మాట్లాడకుండా ఉంటే.. సమాధానాలు వేయకూడదు ప్రియమణి.. వెళ్లు వెళ్లి కాఫీ తీసుకునిరా.. డబుల్ స్ట్రాంగ్‌గా ఉండాలి.. అని అరిచేస్తుంది మోనిత. దీప జాగ్రత్త చీర కాలుతుంది.. అని కార్తీక్ అన్న మాటలే మోనిత మైండ్‌లో రన్ అవుతోంది.

ఇక కార్తీక్ ఇంట్లో సీన్ ఓపెన్ అవుతుంది. ఒంటరిగా కార్తీక్ అన్నింటిని ఆలోచిస్తూ ఉంటాడు. మళ్లీ ఈ దీపకు దీపావళి ఎప్పుడు వస్తుందో అని దీప అన్న మాటలు గుర్తు చేసుకుంటాడు. ఇంతలో సౌందర్య, ఆనంద్ రావులు కూడా వస్తారు అక్కడికి. దీప ఏం చేయబోతోంది మమ్మీ.. అని కార్తీక్ మొదలుపెడతాడు. పండుగ అంటూ అందరికీ స్వీట్లు ఇచ్చింది. అవసరానికి మించి ఆనందం చూపిస్తోంది భయమేస్తోంది తన మాటలు గుండెను కోసేస్తోంది అని కార్తీక్ అంటాడు.

ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియట్లేదు కార్తీక్ అని సౌందర్య, ఏదో గట్టి నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తోంది కీడు శంకిస్తోంది.. చివరి నిర్ణయం ఏదో తీసుకున్నట్టు అనిపిస్తోందని ఆనంద్ రావు అంటారు. అన్నీ తనకు తెలుసు. మనమే ఒక అడుగు ముందుకు వేయలేకపోతోన్నాం.. అడగలేకపోతోన్నాం.. ఇంత జరిగిన తరువాత కూడా దీప అంత బ్యాలెన్స్డ్‌గా ఎలా ఉందో అర్థం కావడం లేదు.. అని కార్తీక్ అంటాడు. రాత్రి మోనిత ఫోన్ చేసిందిరా. బాబు అని సౌందర్య పూర్తి చేయకముందే.. ఆపు మమ్మీ అని కార్తీక్ అరిచేస్తాడు.

దాని గురించి మాట్లాడకు అని కసురుకుంటాడు కార్తీక్. దీపకు బర్త్ డే విషెస్ చెప్పాలన్నా కూడా భయపడుతున్నా అని ఆనంద్ రావు అంటాడు. నిన్న ఆ టాపిక్ తీస్తే ఏదేదో మాట్లాడేసింది అందుకే నేను కూడా చెప్పలేకపోతోన్నాను అని సౌందర్య అంటుంది. ఎన్నో అడగాలని ఉంది.. ఎన్నో మాట్లాడాలని ఉంది. కానీ దీప కనిపించే సరికి ఏమీ మాట్లాడలేకపోతోన్నాను అని కార్తీక్ అంటాడు. అదే సమయంలో పిల్లలకు జోకులు చెబుతూ మెట్ల మీద నుంచి దీప నవ్వుతూ దిగుతుంది.

తాబేలు, హెల్మెట్ అంటూ చెప్పిన జోక్‌కు పిల్లలు నవ్వేస్తారు. భలే జోకులు చెబుతోందంటూ పిల్లలు నవ్వుతుంటారు. అమ్మకు బర్త్ డే విషెస్ చెప్పరా? అని కార్తీక్, సౌందర్యను పిల్లలు అడుగుతారు. వాళ్లు ఆల్రెడీ చెప్పారు.. గిఫ్ట్ కూడా ఇచ్చారు అని దీప అంటుంది. ఏం గిఫ్ట్ అమ్మా.. అని పిల్లలు అడుగుతారు. కొన్ని గిఫ్ట్‌లు ఎవ్వరికీ చెప్పకూడదు.. మనసులోనే ఉంచుకుని ఆనంద పడాలి అని దీప కౌంటర్లు వేస్తుంది. దీంతో కార్తీక్, సౌందర్యలు షాక్ అవుతారు.

అత్తయ్య మామయ్య ఇద్దరూ నిల్చోండి..నన్ను ఆశీర్వదించండి అని అడుగుతుంది దీప. చల్లగా ఉండు హాయిగా ఉండు అని దీవిస్తారు. మీరెప్పుడూ నేను ఆనందంగా ఉండాలనే కోరుకుంటున్నారు.. చాలా ఇష్టమని ఒకప్పుడు అన్నారు.. కదా? కానీ ఇప్పుడేమో తెలియదు నాకు తెలియదు.. అని దీప కౌంటర్లు వేస్తుంది. డాక్టర్ బాబు లేచి నిల్చోండి.. ఓ ఐదారు దీవెనలు ఇచ్చేయండి..అని కార్తీక్ దగ్గర దీప ఆశీర్వాదం తీసుకునే సమయంలోనే మోనిత ఎంట్రీ ఇస్తుంది.

హ్యాపీ బర్త్ డే దీపక్క.. అని మోనిత ఎంట్రీ ఇవ్వడం.. థాంక్యూ మోనిత.. బొకే బాగుంది మోనిత అని దీప రివర్స్ షాక్ ఇవ్వడంతో మోనిత తెల్లమొహం వేసుకుంటుంది.. నీ సెలెక్షన్ సూపర్‌గా ఉంటుంది మోనిత అని దీప అంటుంది. అందరినీ పలకరించిన మోనిత పిల్లలను ఎలా ఉన్నారు అని అడుగుతుంది. బాగున్నాం అని చెప్పి బయటకు వెళ్లిపోతారు.. తెలివైన పిల్లలు అంటూ మోనిత అంటుంది.. ఏంటి అందరూ సైలెంట్ అయ్యారు.. రావడం ఊహించలేదా?.. లేదా రుచించలేదా? అని మోనిత అంటుంది.

ఎందుకు వచ్చావ్.. గెటవుట్.. అని డాక్టర్ బాబు ఫైర్ అవుతాడు. అదేంటి డాక్టర్ బాబు.. ఇంటికి వచ్చిన వాళ్లని వెళ్లమనడం మర్యాద కాదు.. ఎన్ని తిట్టినా మనసులో పెట్టుకోకుండా వచ్చింది..బర్త్ డే విషెస్ చెప్పింది.. బొకే ఇచ్చింది.. అని దీప అంటుంది. దీంతో షాకైన మోనిత.. ఏంటిది దీప రివర్స్‌లో వస్తోంది.. అని మనసులో అనుకుంటుంది. ఆరోగ్యం బాగా ఉందా?.. అయినా నువ్ డాక్టర్ వే కదా? నీ ఆరోగ్యం నువ్ చూసుకుంటావ్ లే.. గుడికి వెళ్దామని రెడీ అయ్యాను.. లేదంటే కాఫీ, టీలు మర్యాద చేసేదాన్ని అని దీప అంటుంది..

నువ్ కూడా గుడికి రా.. నువ్ కూడా నా కుటుంబంలో ఒక దానివే అనుకుంటాను.. నీక్కూడా పూజలు అంంటే ఇష్టం కదా?.. మా అత్తయ్య గారికి కూడాచాలా ఇష్టం.. ఒక్కోసారి నన్ను తీసుకోకుండానే వెళ్తారు అని కౌంటర్ వేస్తుంది.. గుడిలో దేవుడి కంటే..నా గుండెలో దేవుడిని నమ్ముతాను అని మోనిత సెటైర్ వేస్తుంది. నేను గుడికి కాదు కానీ.. మీరే నా ఇంటికి రావాలి.. మా అబ్బాయి బారసాలను చేస్తున్నాను.. అందరూ రావాలి.. అని మోనిత అంటుంది.

ఎక్కువ మాట్లాడకుండా బయటకు వెళ్లు.. గెటవుట్.. అని మళ్లీ డాక్టర్ బాబు ఫైర్ అవుతాడు. బాబు నా బాబే కాదు కదా?.. నీకు కూడా బాబే.. కదా? అని మోనిత అంటుంది. ఇంకొక్క మాట్లాడితే ఇక్కడే ఉంటే ఏం చేస్తానో నాకే తెలియదు.. అని కార్తీక్ అంటాడు. కొడతావా? కొట్టు.. అని మోనిత అంటుంది. అరె ఎవరు ఏం మాట్లాడరే.. ఏంటి ఆంటీ మాట్లాడరేంటి?.. మీ వంశాంకురమే కదా?. ఏంటి కార్తీక్.. కోపం ఎందుకు.. దీపక్కే నయం.. నన్ను గుడికి రమ్మంది.. బారసాలకే కదా? రమ్మంది.. నీకన్నా దీపక్కే మంచిది.. నన్ను అర్థం చేసుకుంది.. అసలు దీపక్క.. ఏం జరిగిందో నీకు పూర్తిగా తెలుసు కదా? అని మోనిత అంటుంది.. నాకు అన్నీ తెలుసు కదా? మోనిత.. నువ్వే కదా? చెప్పావ్.. నువ్వెళ్లి బారసాలకు ఏర్పాట్లు చేసుకో.. అందరినీ తీసుకొచ్చే బాధ్యత నాది.. అని మోనిత అంటుంది.

నువ్ ఈ మాట అన్నావ్ చాలు.. వస్తారు కదా? అని మోనిత అనడం.. నేను తీసుకొస్తాను అని చెప్పాను కదా? అని దీప అనడంతో షాక్ అవుతుంది. అదిరిపోయే క్లైమాక్స్ అని చెప్పా కదా? అది రేపే ఉంటుంది.. వెళ్లు.. అని దీప అనడంతో.. మోనిత తెగ కంగారు పడిపోతుంది. బొకే తెచ్చినందుకు థ్యాంక్స్ అని దీప అనడంతో ఎపిసోడ్ పూర్తవుతుంది.ఇక వచ్చే వారం ఎపిసోడ్‌లో అసలు ట్విస్ట్ ఉండోబోతన్నట్టు కనిపిస్తోంది. దీప ఆలోచనల్ని మనం అందుకోలేకపోబోతోన్నామని కార్తీక్ అంటాడు.. మనకు షాక్ ఇస్తుందేమో అని అనుకుంటారు.. బయటకు వెళ్లివచ్చిన పిల్లలతో దీప రాకపోవడంతో అందరూ ఆందోళన చెందారు. దీప ఎక్కడా? అని కార్తీక్ తన పిల్లలను అడుగుతాడు. అమ్మ వెళ్లిపోయింది.. అని పిల్లలు సమాధానం ఇస్తారు. ఎక్కడికి వెళ్లింది అని కార్తీక్ అడుగుతాడు. రేపు ఎక్కడికో వస్తారట కదా? అక్కడే కలుస్తుందట..అని చెప్పేశారు. అంటే దీప ఏదో గట్టిగానే ప్లాన్ వేసిందని తెలుస్తోంది.

Exit mobile version