Site icon A2Z ADDA

Karthika Deepam Episode 1201 : సమాధుల దగ్గరకి వెళ్దామన్న దీప.. మోనితకు చివర్లో వంటలక్క షాక్

కార్తీకదీపం సీరియల్‌లో ఇప్పుడు దీపావళి పండుగ జరుగుతోంది. కానీ కార్తీక్ ఇంట్ల్ మాత్రం అందరి మొహాల్లో వెలుగు కనిపించకుండా పోయింది. డాక్టర్ బాబు, సౌందర్య, ఆనంద్ రావు, ఆదిత్య ఇలా అందరూ బాధల్లో ఉన్నారు. దీప మరుక్షణం ఏం చేయబోతోందా? అని ఆందోళన చెందుతున్నారు. ఇక గురువారం నాటి ఎపిసోడ్‌లొ డాక్టర్ బాబును మోనిత బెదిరించడం, ఇంటికి వస్తాను అంటూ అనడంతో కార్తీక్ వెళ్తాడు. ఇక శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో కార్తీక్ ఇంట్లో దీపావళి పండుగ సెలెబ్రేషన్స్ జరుగుతాయి. కానీ అందరూ టెన్షన్‌లోనే ఉంటారు. 1201వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

పిల్లలతో సౌందర్య కూర్చుని ఉంటుంది. పండుగ అన్నట్టు లేనే లేదు.. ఒకప్పటిలా ఎందుకు లేం అని పిల్లలు అడుగుతారు..ఒకప్పటిలా అంటే ఏంటే అని సౌందర్య అడుగుతుంది.. సినిమాలకు వెళ్లేవాళ్లం, బయటకు వెళ్లే వాళ్లం..కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్లడం లేదు.. అమ్మ బర్త్ డే కూడా ఉంది.. అని పిల్లలు అంటారు. అవునా? దీప నీ బర్తే డేనా?.. ప్రతీ రోజూ పుట్టి చచ్చే వాళ్లకు బర్తే డేలు ఏంటి అత్తమ్మ.. అని దీప కౌంటర్ వేస్తుంటుంది. పిల్లలు గోల్కోండ కోటకు వెళ్దామని అంటున్నారని దీపతో సౌందర్య అంటుంది.

గోల్కోండ కోటకు ఎందుకు.. పక్కనే ఉన్న సమాధాలకు వెళ్దామని దీప అంటుంది. పండుగ రోజు అలాంటా మాటలేంటే అని సౌందర్య అంటుంది.. ఎప్పుడైనా అక్కడికివెళ్లాల్సిందే కదా? అని దీప అంటుంది.. గుడికి వెళ్దాం ఆ తరువాత రెస్టారెంట్‌కు వెళ్దామని పిల్లలంటారు.. నా బదులు మీరు గుడికి వెళ్లొచ్చారు కదా? అని సౌందర్యతో దీప అంటుంది.. ఆ మొక్కు తీర్చుకున్నప్నుడు నా గురించి కూడా మొక్కుకుని ఉంటుంది కదా? అని దీప అంటుంది..

ఎందుకు మొక్కుకోదు.. నానమ్మకి నువ్వంటే చాలా ఇష్టం అని అని శౌర్య అంటోంది.. ఎక్కడికైనా వెళ్దామమ్మ..అని పిల్లలంటే.. ఎక్కడికి లేదు. ఇంట్లోనే చేసి పెడతాను ఇక్కడే తినండని దీప అంటుందిత.. బోర్ కొడుతుందమ్మా అని పిల్లలంటే.. మీకు కూడా నేను బోర్ కొడుతున్నానా? చూశార? అత్తమ్మ వీళ్లకు కూడా నేను బోర్ కొడుతున్నానట అని దీప అంటుంది.. క్రాకర్స్ కాల్చుకునేది ఉందా లేదా?.. దీపావళి ఎందుకు చేసుకుంటారమ్మ.. అని పిల్లలు అడుగుతారు. నరకాసురుని వధించినందుకు దీపావళి చేసుకుంటారు. నరకాసురుడు అంటే రాక్షసుడు కదా? అమ్మా అని పిల్లలు అడుగుతారు..

ఒకప్పుడు రాక్షసులు, మనుషులు వేర్వేరు.. కానీ ఇప్పుడు మనుషుల్లోనే రాక్షసులుంటారు. ఎవరు ఏంటో గుర్తు పట్టలేమని దీప కౌంటర్లు వేస్తుంది. దీంతో అక్కడి నుంచి సౌందర్యవెళ్లిపోతోంది. అలా వెళ్లిపోతోంటే ఆపేందుకు పిల్లలు కూడా వెళ్తారు. పెద్ద వాళ్లు ఏం చేసినా అడగకూడదు అని పిల్లలను ఆపేస్తుంది దీప.. దీపావళి అంటే నీకు ఇష్టమా?..అని దీపను పిల్లలు అడుగుతారు. నాకు ఇష్టం.. నాకు ప్రత్యేకం.. నాకు గొప్ప బహుమతి ఇచ్చారు కదా?. అంటూ మళ్లీ కౌంటర్ వేస్తుంది దీపి.

దీపి మాటలకు రూంలోకి వెళ్లిన సౌందర్య కుమిలి కుమిలి ఏడుస్తుంది.. ఏంటి సౌందర్య ఏమైంది.. నువ్విళా కన్నీళ్లు పెడితే కార్తీక్ పరిస్థితి ఏంటి?.. అని ఆనంద్ రావు అంటాడు. దీప ఏం ఆలోచిస్తోంది..ఏం చేయబోతోంది?.. అవసరానికి మించి ఆనందం.. అందులో నిజం లేదు.. ఒక రకంగా.. అందరినీ ప్రేమించేవాళ్లు.. అందరినీ వదిలి వెళ్లే ముందు, చనిపోయే ముందు ఎలా మాట్లాడుతూ ఉందో అలా మాట్లాడుతుందిఅని సౌందర్య బాధపడుతుంది. దీప చనిపోయేంత పిరికిది కాదు.. అని ఆనంద్ రావు అంటాడు. పిరికివాళ్లు చావరు అండి..చాలా ధైర్యమున్న వాళ్లే చావుకు ఎదురెళ్తారు.. దానికి చాలా ధైర్యముంది.. దాని మనసులో ఏముందో. అడగ లేకపోతోన్నాను.. పిల్లలు బయటకు వెళ్దామని అంటే.. సమాధాల దగ్గరికి వెళ్దామని అంటోంది.. అని సౌందర్య కుమిలిపోయింది. సరిదిద్దుకోలేని తప్పు జరిగింది..దాన్ని మనం సరిచేయలేం. .చేస్తే ఆ భగవంతుడు.. లేదంటే ఆ దీప.. ఈ ఇద్దరే పరిష్కరించగలరు.. అని ఆనంద్ రావు అంటాడు.

బయటకు వెళ్లిన కార్తీక్ వచ్చాడు. కార్తీక్ వచ్చే సరికి దీప గుమ్మంలోనే వెయిట్ చేస్తూ ఉంది. దీప..కొంచెం లేట్ అయింది.. అని కార్తీక్ కాస్త టెన్షన్ పెడుతూ చెప్పాడు. వెళ్లారు లేట్ అయింది.. ఓకే.. సారీలు ఏమైనా చెబుతారా? ఏంటి.. అవన్ని వదిలేయండి.. వెళ్లిన పని అయిందా? లేదా? అది చెప్పండి ముందు..ఏమైంది డాక్టర్ సాబ్.. ఈ కొత్త పిలుపు బాగుంది కదా? అయినా డాక్టర్ బాబు అంటేనే తృప్తిగా ఉంటుంది.. అని దీప అనేస్తుంది. నీతో ఒక విషయం చెప్పాలి.. ఏ తప్పూ చేయలేదు..ఆ మోనిత సహజ గర్భం అంటుంది.. ఆ మోనిత మాటలు నమ్మొద్దు.. నేను నిజమే చెబుతున్నాను.. నా వల్ల ఎలాంటి తప్పు నాకు తెలిసి జరగలేదు.. దీప ప్లీజ్ అలా చూడొద్దు.. ఏదేదో చెబుతోంది.. నేనే కారణం అంటోంది.. నువ్ నమ్మొద్దు దీప.. ఈ ప్రపంచం, ఎవ్వరు ఏమైనా అనుకున్న పార్లేదు.. నువ్వొక్క దానివి నమ్మితే చాలు.. నన్ను నమ్మడం లేదా?.. అంటూ డాక్టర్ బాబు దీపను అడిగేస్తాడు. కానీ అది నిజం కాదు. అలా అడిగినట్టుగా డాక్టర్ బాబు కలగంటాడు.

ఏ లోకం లోకి వెళ్లారు.. డాక్టర్ బాబు అని దీప అంటుంది. అంటే నేను దీపకు నిజం చెప్పలేదా. ఇదంతా నా ఊహేనా?.. అని డాక్టర్ బాబు అనుకుంటాడు. ఇంతలో అందరూబయటకు వస్తారు. టపాసులు కాల్చేందుకు రెడీ అవుతారు. ఏంటి అందరూ అలా డల్లుగా ఉన్నారు.. దీపావళి పండుగ ఆనందంగా ఉండండి.. టపాసులు కాల్చరా? ఏంటి డాక్టర్ బాబు.. మీరే ముందు మొదలుపెట్టాలి.. అత్తయ్య గారు ఏంటిది? ఆదత్య డల్లుగా ఉన్నావేంటి? లోకమంతా దీపాలతో వెలిగిపోతోంటే.. మీరు మాత్రం ఇలా డల్లుగా ఉన్నారేంటి?.. ఈ దీపావళికి ఏదో తగ్గిందని అనుకుంటున్నారు కదా? అని దీప వాగేస్తుంటుంది. ఏంటి దీప నువ్ నవ్వితే భయంగా ఉంది అని డాక్టర్ బాబు భయపడతాడు.. అదేంటో నాకు తెలుసు.. అని లోపలకి వెళ్తుంది దీప.

అలా దీప లోపలకి వెళ్లడంతో అందరూ భయపడతారు. అన్నయ్య.. వదిన ఏం చేయబోతోంది.. అని అడుగుతాడు ఆదిత్య. కొంపదీసి తను ఏమైనా.. అని అనుకునే లోపు దీప వస్తుంది. ఏంటి డాక్టర్ బాబు.. నేను ఇంకా రావడం లేదని టెన్షన్ పడ్డారా? నాకు ఈరోజు ప్రత్యేకం.. అందుకే స్వీట్స్ తెచ్చాను.. మళ్లీ ఈ దీపకు.. దీపావళి మళ్లీ ఎప్పుడు వస్తుందో.. అని అందరికీ స్వీట్లు పెడుతుంది. మరి నువ్ తినవా? అమ్మా అని పిల్లలు అడుగుతారు. నాకు దీపావళి ముందే వచ్చింది..అని కౌంటర్ వేస్తుంది. ఇక టపాసులు కాలుద్దామా? అంటారు. టెన్ థౌజండ్ వాలా? కాలుద్దాం అని శౌర్య అనడం, హిమ భయపడుతుంది. నీకు భయం లేదా? అమ్మా అని దీపను అడుగుతారు. నాకు ఆ భయం ఈ మధ్యే పోయిందని దీప అంటుంది. నాన్న రా? డాక్టర్ బాబు రా అని అందరూ పిలుస్తారు. అమ్మే భయపడటం లేదు మీరు ఎందుకు భయపడుతున్నారని అలా అంతా టపాసులు కాలుస్తారు.

ఇంతలోసౌందర్యకు మోనిత ఫోన్ చేస్తుంది. హలో ఆంటీ.. నేను మీ కోడలిని.. ఎలా ఉన్నారు అని అడుగుతుంది. బారసాలకు పిలిచేందుకు కార్తీక్ ఇంటికి మోనిత వస్తుంది. ప్రత్యేకంగా నువ్ రావాలి కార్తీక్ అని మోనిత అంటుంది. నోర్మూసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపో అని కార్తీక్ అంటాడు. అందరినీ నేను తీసుకొస్తాను..నువ్వెళ్లు. నీకు క్లైమాక్స్అక్కడే చూపిస్తాను అని దీప అనడంతో మోనిత షాక్ అవుతుంది. మరి దీప ప్లాన్ ఏంటో చూడాలి.

Exit mobile version