Site icon A2Z ADDA

Karthika Deepam Episode 1199 : అత్తకు చెమటలు పట్టించిన వంటలక్క.. దీప మాటలకు కంగారు పడ్డ సౌందర్య

కార్తీకదీపం సీరియల్ ఇప్పుడు డాక్టర్ బాబు చెప్పిన డైలాగ్‌తో సూట్ అయ్యేలా ఉంది. నిజం తెలుసుకున్న ఆదిత్య వీరావేశంతో తన అన్న కార్తీక్‌ను నిలదీస్తాడు. అప్పుడు కార్తీక్ ఓ డైలాగ్ వేస్తాడు. నా పరిస్థితి ఇప్పుడు మందు పాతర మీద కాలు పెట్టినట్టు ఉందిరా అంటాడు. సీరియల్ కూడా అలానే ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుంది.. దీప ఏం చేయాలని అనుకుంటుంది? వంటలక్క నిర్ణయం ఏంటి? అని అందరూ అనుకుంటున్నారు. బుధవారం నాటి ఎపిసోడ్‌లో కార్తీక దీపం సీరియల్ ఇలా ముందుకు సాగనుంది..

రోడ్డు మీద ఆదిత్య వాగ్వాదానికి దిగాడు. తన పరిస్థితిని శాంతంగా వివరించాడు కార్తీక్. ప్రస్తుతం మందుపాతర మీద కాలు పెట్టినట్టుందిగా ఉంది నా పరిస్థితి.. నేను ఏ తప్పూ చేయలేదురా అది నేను ఎలాగోలా నిరుపించుకుంటాను.. కానీ నాకు దీప పరిస్థితి అర్థం కావడం లేదు. .ప్రతీ క్షణం చస్తూ బతుకుతున్నాను.. తనకు ఏం అర్థమైంది.. ఏం అనుకుంటోంది..నాకు తెలియడం లేదు.. మోనితను కలిసిన విషయం చెప్పొద్దు.. అని కార్తీక్ అంటాడు. అబద్దమో నిజమే నాకు తెలియదు.. అదేదో త్వరగా చెప్పు.. తప్పు చేయడం కన్నా దాన్ని దాచడం పెద్ద తప్పు..ఈ సారి దూరమైతే మాత్రం ఆ దేవుడు కూడా వదిన మనసును మార్చలేడు.. అని ఆదిత్య అంటాడు. నువ్ మాత్రం ఈ టాపిక్ .. నీ ఆవేశాన్ని నాకోసం అదుపులో పెట్టుకోరా.. ఈ ఒక్క సాయం చేయ్ రా అని కార్తీక్ బతిమాలాడుతాడు.

ఇక ఆదిత్యను ఉసిగొల్పిన మోనిత.. వాళ్లింట్లో గందరగోళం జరుగుతుందని తెగ సంబరపడిపోతుంది. ఆదిత్య ఆవేశపరుడు.. కార్తీక్ శాంతపరుడు.. ఇద్దరిలో ఎంత తేడానో అని మోనిత అనుకుంటూ మురిసిపోతోంది. ప్రియమణిని పిలిచి ఓ పిట్ట కథ కూడా చెబుతుంది… చిన్న చెరువులో పెద్ద బండ వేస్తే ఏమవుతుంది ప్రియమణి అని మోనిత అడుగుతుంది.. పెద్ద చప్పుడు.. నీళ్లన్నీ అల్లకల్లోలం అవుతాయి అని ప్రియమణి అంటుంది.

ఇప్పుడు మా అత్తగారింట్లో అదే జరుగుతుంటుందేమో.. అర్థం కాలేదా? ప్రియమణి.. అర్థం అయితే నువ్ ప్రియమణివి ఎందుకు అవుతావ్ అని మోనిత సెటైర్లువేస్తుంది. ఆదిత్యను ఇప్పుడు రెచ్చగొట్టాను కదా? ఇంటికి వెళ్లి గొడవ చేస్తాడు.. అమ్మ ఇలా ఎందుకు చేశావ్.. అన్నయ్య ఇది కరెక్టేనా? అని నిలదీస్తాడు..దాంతో మోనిత ఏం చేస్తుందోననే భయం మళ్లీ వాళ్లలో మొదలవుతుంది.. అని మోనిత తన ప్లాన్ గురించి చెబుతుంది. దీంతో ప్రియమణి అదో రకంగా చూస్తుంటుంది.

ఏంటి ఆ ఎక్స్‌ప్రెషన్స్.. ఎందుకలా చూస్తున్నావ్.. అని ప్రియమణి మీద మోనిత ఫైర్ అవుతుంది. పాపం కదా? అమ్మ అలా ఉసిగొల్పడం.. అని ప్రియమణి అంటే.. తప్పొప్పులు నువ్ నాకు చెప్పడం ఏంటి.. నేను ఏదైనా చెబితే వినాలి.. చెబితే చేయాలి.. వినమని చెప్పాను.. సలహాలు ఇవ్వొద్దు.. తప్పొప్పులు నీ దగ్గర నేర్చుకునే స్థాయికి ఇంకా దిగజారలేదు.. అంటూ చెడామడా తిట్టేస్తుంది మోనిత. ఇక దాంతో ప్రియమణి తన మనసులో తాను ఇలా అనుకుంటుంది. పొయిన జన్మలో ఏం తప్పు చేశాను ఏ రుణబంధమో పని మానేసి వెళ్లిపోవాలని అనుకున్నా వెళ్లలేకపోతోన్నా.. ఇక్కడే పని చేస్తున్నాను అని లోలోపల అనుకుంటూ వెళ్లిపోతోంది ప్రియమణి. ఆదిత్య నీ ఆవేశాన్ని కూడా వాడుకుంటున్నాను.. అని మోనిత తనలో తాను నవ్వుకుంటుంది.

అలా సీన్ కట్ చేస్తే.. కార్తీక్ సౌందర్యల మీద ఓపెన్ అవుతుంది. పండుగ కదా? అని కార్తీక్ చీరలు తెచ్చాడు. ఏమనుకుంటున్నావ్ కార్తీక్.. చీరలు తెస్తే దీప కూల్ అవుతుందని అనుకుంటున్నావా? అని అడుగుతుంది సౌందర్య. పండుగ కదా? మమ్మీ.. పండుగకు తీసుకొచ్చినట్టే తీసుకొచ్చాను.. ఈ వంకతోనైనా మాట్లాడతాను.. చాలా ప్రశ్నలు అడగాలని ఉంది.. తనను చూస్తుంటే భయమేస్తోంది.. ఏదో ఒకటి చేయాలి.. దీపను అడుగుతాను.. అని కార్తీక్ అంటాదడు. ఏం అడుగుతావ్.. అంతా చూసింది..అంతా తెలుసు.. మనల్ని ఏమీ అడగలేదు.. దీప మౌనమే మనకు పెద్ద శిక్ష.. గుప్పిట మూసినంత వరకు బాగుంటుంది.. తెరిస్తే ఏమీ ఉండదు.. సంసారం కూడా అంతే.. అని సౌందర్య చెబుతుంది.

దీపతో మాట్లాడతాను అని కార్తీక్ అంటే.. మాట్లాడటానికి ఏముందని సౌందర్య అంటుంది.. దీప నా దారిని నేను చూసుకుంటాను అని అంటే.. నీ దగ్గర సమాధానం ఉందా? ఇంటి నుంచి వెళ్తానంటే.. నువ్ ఆపగలవా?.. పండుగ ఆనందాన్ని కూడా ఎందుకు దూరం చేసుకుంటున్నావ్.. అరేయ్ పెద్దోడా? దీప మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను.. ఇప్పటికే 11 ఏళ్లు దూరం చేశావ్.. శాశ్వతంగా దూరం చేసుకునే తప్పు చేయకు.. అని కార్తీక్‌ను ఆపేస్తుంది సౌందర్య.

ఆదిత్య.. డల్లుగా కనిపిస్తున్నావ్ ఏంటి అని శ్రావ్య అడుగుతంది.. పండుగ వాతావరణం కనిపించడం లేదు.. ఏదో తెలియని నిశ్శబ్దం కనిపిస్తుంది.. ఇంట్లో ఎవరికెవ్వరూ మాట్లాడుకోవడం లేదు.. అని ఆదిత్య అంటాడు. బయటకు వెళ్దామా? మరి అని శ్రావ్య అడుగుతుంది. మూడ్ లేదని ఆదిత్య అంటాడు. మరి కాఫీ తీసుకురావాలా?.. అని అడుగుతుంది. వద్దని అంటాడు. ఇంత స్ట్రాంగ్‌గా ఉండే నేనే ఇలా ఉంటే శ్రావ్యకు చెబితే ఏమవుతుంది.. నిజాలు చెప్పకపోవడం, అబద్దాలు దాచడం నాకే నచ్చదు.. కానీ నేను శ్రావ్యకు చెప్పడం లేదు. చెబితే ఎక్కడ బాధపడుతుందో అని. అయితే అన్నయ్య మమ్మీలు నాకు చెప్పకపోవడానికి ఇదే కారణం కావచ్చు.. కోపమెక్కువ.. బాధ పడతాను అని చెప్పలేదేమో అని ఆదిత్య తనలో తాను అనుకుంటాడు.. అన్నయ్య మాటలు గుర్తు తెచ్చుకుంటూ.. పాపం అన్నయ్య అయినా ఈ పరిస్థితుల్లో ఏం చేయగలడు.. అని ఆదిత్య అనుకుంటాడు. ఏమైంది.. ఏమైనా ప్రాబ్లమా? అని శ్రావ్య అంటే.. కొంచెం తలనొప్పిగా ఉందంతే.. ఓ స్ట్రాంగ్ కాఫీ తీసుకురా అని అంటాడు.

ఇక వంటగదిలో వంటలక్కగా మారిపోయింది దీప. పండుగ కదా? అని తినుబండారాలు చేస్తూ ఉంది. అది చూసిన సౌందర్య, కార్తీక్‌లు దీపతో మాట్లాడదామని అనుకుంటున్నారు. నేను మాట్లాడతాను. నువ్ వెళ్లు అని కార్తీక్‌ను పంపిస్తుంది సౌందర్య. దీప ఏం చేస్తున్నావే.. అని సౌందర్య అంటుంది. పండుగ కదా? పిల్లల కోసం చేస్తున్నాను అని దీప అంటుంది. ఎందుకు ఈ పనులు.. బయటి నుంచి తెప్పించుకోవచ్చు కదా? అని సౌందర్య అంటుంది.

అన్నింటికి బయటివే కావాలా? అని దీప కౌంటర్ వేస్తుంది. ఏమంటున్నావ్ దీప అని ఆశ్చర్యపోయింది సౌందర్య.. పిల్లలకు నా చేతుల్తో చేస్తే తృప్తి.. బయటవి ఎందుకు అని అంటున్నాను.. నాకు తెలిసిన పనులే కదా?. అయినా వంటలక్కను అని నన్ను అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటారు కొందరు.. అంటే వారణాసి లాంటివాళ్లు.. తెలిసిన విద్యను మరిచిపోకూడదు..కదా? చిన్నచూపు చూడకూడదు కదా? అని దీప అంటుంది. ఆ మాటలకు సౌందర్యకు ఏం మాట్లాడాలో పాలుపోదు.

కార్తీక్ చీరలు తెచ్చాడు.. వెళ్దాం పదా? అని సౌంరద్య అంటుంది. అందరికీ తెచ్చాడా? అందరితోపాటు నాకూ తెచ్చాడా? అని దీప కౌంటర్లు వేస్తుంది. ఏంటే ఇలా మాట్లాడుతున్నావ్. నేను ఒకటి అంటే నువ్ ఒకటి అంటున్నావ్ అని సౌందర్య కాస్త చిరాకుపడుతుంది. మీరు మారిపోయారు అత్తయ్య అని దీప.. నేను మారడం ఏంటి దీప అని సౌందర్య అనుకుంటారు.. మీరు చాలా మారిపోయారు.. ఈ మధ్య మీరు డల్‌గా కనిపిస్తున్నారు.. గంభీరంగా కనిపించడం లేదు.. ఉత్సాహం లేదు.. దర్పం లేదు.. అని అంటుంది దీపి.

అవునా అలా ఏం కాలేదే.. బాగున్నాను దీప.. అని సౌందర్య కవర్ చేస్తుంటుంది. మీరు ఎలా ఉన్నారో మీకు ఎలా తెలుస్తుంది.. ఎదుటివాళ్లకు తెలుస్తుంది.. మరి మీకు నేను ఎలా కనిపిస్తున్నాను.. ఉత్సాహంగా, చలాకీగా, అందంగా కనిపిస్తున్నానా? కోడలిగా బోర్ కొట్టేశానా? అని దీప అడుగుతుంది. నువ్ నాకు బోర్ కొట్టడం ఏంటే.. నువ్వంటే నాకు ప్రేమ.. ప్రాణం.. అని సౌందర్య అంటుంది. మరి రెండో కోడలి మాటేంటి..అని దీప అడగడంతో షాక్ అవుతుంది సౌందర్య. మీకు రెండో కోడలు ఉంది కదా? అత్తయ్య.. అని దీప అనడంతో తెగ కంగారుపడిపోతుంది. రెండో కోడలు అంటే మన శ్రావ్య.. నేను మీకు ఇష్టమైతే.. రెండో కోడలు శ్రావ్య ఏంటి?..అని మాట మార్చేసింది దీప.

దీప కావాలనే అడిగిందా? అంటూ సౌందర్య తనలో తాను అనుకుంటుంది. ఇప్పుడు మంచిదైంది.. మూడో కోడలు వస్తే.. మూడో కన్ను రావాల్సి వచ్చేది.. పోలిక చెప్పేందుకు ఇబ్బందిపడేవారు.. అంటూ కౌంటర్ వేసింది దీప. దీంతో సౌందర్యకు ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో అర్థంకాక వెళ్లిపోయింది. కాఫీ ఇవ్వమంటారా? అని అడిగితే వద్దని వెళ్లిపోయింది. మీరు నిజంగానే మారిపోయారు అత్తయ్య గారు అని దీప మనసులోఅనుకుంటుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యి అనే పరిస్థితి డాక్టర్ బాబుకు ఎదురయ్యేట్టుంది. ఓ వైపు మోనిత బెదిరింపులు.. మరో వైపు మాట్లాడాలని వచ్చిన వంటలక్క. ఎటూ తేల్చుకోలేకపోయినట్టు కనిపిస్తున్నాడు. ఇక రేపు ఏం జరుగుతుందో చూడాలి

Exit mobile version