Site icon A2Z ADDA

Janaki Kalaganaledu : గుండెలు పిండేసే ఎమోషన్.. తల్లి మౌనం కొడుక్కి శాపం!

Janaki Kalaganaledu  అమ్మ ప్రేమ మీద తీసే కథలు ఏవైనా సరే ఇట్టే ఆకట్టుకుంటాయి. అలా అతి తక్కువ సమయంలోనే జానకి కలగనలేదు అనే సీరియల్ తెలుగు వారికి ప్రీతిగా మారింది. అమ్మ జ్ఞానాంబ అంటే రామ (రామచంద్ర)కు ప్రాణం, సాక్షాత్తు దేవతగా కొలుస్తుంటాడు. అలాంటి తల్లికి సేవ చేయకుండా నిద్రపోడు. అలాంటి తల్లీకొడుకులు మధ్య భార్య వస్తే, దూరం పెరిగితే. భార్యను, అమ్మకు మధ్యలో సతమతమైతే.. అప్పుడు వచ్చే ఎమోషన్ అందరినీ ఆకట్టుకుంటుంది. అందుకే జానకీ కలగనలేదు సీరియల్ ఇప్పుడు ఫేవరేట్‌గా మారింది. అక్టోబర్ 27న ప్రసారమైన 158 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

ఇక తన కోడలు ఐదో తరగతి వరకే చదివింది అని ఇన్నాళ్లు భ్రమపడింది జ్ఞానాంబ. కానీ ఈ మధ్యే అసలు విషయం తెలిసింది. డిగ్రీ పాసైందని, ఐపీఎస్ కూడా చేస్తోందనే విషయం బయటపడింది. దీంతో జ్ఞానాంబ గుండె బద్దలైంది. తన కొడుకు కూడా తన వద్ద అబద్దం చెప్పాడని జ్ఞానాంబ కుంగిపోయింది. దీంతో ఇంట్లో జ్ఞానాంబ ఎవ్వరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉంటోంది.

ఒకప్పుడు కొడుక్కు చిన్న దెబ్బ తగిలినా ఓర్చుకోలేని జ్ఞానాంబ నేటి ఎపిసోడ్‌లో రామకు రక్తం కారినా పట్టించుకోలేదు. ఇక మల్లిక అయితే ఈ ఎడబాటును మరింత దూరం చేయాలని ప్లాన్ వేస్తోంది. జానకి ముగ్గు వేస్తున్నా కూడా వచ్చి భయపెట్టేసింది మల్లిక. నువ్ ఇలా ముగ్గు వేస్తున్నావ్ అని అత్తయ్యకు తెలిస్తే ఇంట్లోంచి గెంటేస్తారు అని మల్లిక భయపెట్టేసింది.

ఇక రామ అయితే తల్లికి సేవ చేయకుండా ఎలా ఉండాలి. రాత్రి కాళ్లు పట్టకుండా ఎలా ఉండాలి అంటూ మథనపడ్డాడు. చిన్నప్పటి నుంచి అమ్మ కాళ్లు పడుతూ ఉంటూనే నిద్రపోయేది.. ఇప్పుడు వద్దు అంటోంది.. ఎలా అంటూ భార్య జానకికి చెప్పుకుంటూ తెగ ఫీలయ్యాడు రామ. మొత్తానికి జ్ఞానాంబ, జానకిరామల మధ్య మాత్రం మౌనం మాట్లాడుతోంది. జ్ఞానాంబ కోపం ఎప్పుడు తగ్గుతుంది? అసలు తగ్గుతుందా? లేదా? ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.. రామాయణంలో వచ్చిన ఎడబాటే. ఇందులోనూ వస్తుందా? రాముడు, జానకి కొన్నాళ్లు విడిపోతారా? అనే అనుమానాలు ప్రేక్షకుల్లో కలుగుతున్నాయి. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.

Exit mobile version