Site icon A2Z ADDA

Intinti Gruhalakshmi : కోడళ్ల మధ్య దూరం.. అత్తకు మోయలేని భారం

Intinti Gruhalakshmi October 27th Episode In A2z Adda

Intinti Gruhalakshmi October 27th Episode In A2z Adda

Intinti Gruhalakshmi  ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ మొత్తం కూడా తులసి చుట్టే తిరుగుతుంది.ఎవరి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అది తులసి మీదే ప్రభావం చూపుతుంటుంది. ఇంత వరకు లాస్య వల్ల సమస్యలు ఎదురయ్యాయి. ఇక ఇప్పుడు ఇద్దరు కోడళ్ల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. అసలే పెద్ద కోడలు అంకిత ఎప్పుడెప్పుడు వేరు కాపురం పెడదామా?అని తొందరపడుతూనే ఉంది. కానీ తన చిన్న కోడలు శ్రుతీ, పెద్ద కోడలు అంకిత రెండు కళ్ల వంటివారు అని, ఎవ్వరూ గొడవపడకండి అని తులసి ప్రాధేయపడుతుంది.

అక్టోబర్ 27న ప్రసారం కాబోతోయే సీరియల్ సారాంశం అదే. కోడళ్లు ఇద్దరూ కూడా గొడవలు పడటం, పెద్ద కొడుకు మితి మీరి మాట్లాడటం, అమ్మ తులసికి అభి స్వీట్ వార్నింగ్ లాంటివి ఇవ్వడం జరుగుతుంది. నీ అండ చూసుకుని రెచ్చిపోతే కుదరదు. పెద్ద కోడలు అంటే నా భార్య అంకిత దగ్గరు నీ చిన్న కోడలు శ్రుతీ తగ్గి ఉండాలని అది నేర్పించు అని అభి అంటాడు.

ఆ మాటలన్నీ విన్న శ్రుతీ తెగ ఫీలవుతుంది. తులిసీ ఇద్దరు కోడళ్ల మధ్య నలిగిపోతోంది. ప్రేమ్‌కు జరిగిన విషయాలను శ్రుతీ చెబుతుంది. ముందు చెప్పేందుకు నిరాకరించినా కూడా ఆ తరువాత ప్రేమ్‌కు అంతా చెప్పేస్తుంది. వీరావేశంతో అన్న అభి దగ్గరకు వెళ్తుంటే శ్రుతీ ఆపేస్తుంది. ఇప్పుడు ఇలా గొడవ పడితే అంకిత అనుకున్నట్టుగానే వేరు పడాల్సి వస్తుందని.. వద్దు అని వారిస్తుంది. కొన్ని రోజులు ఓపిక పడదామని ప్రేమ్‌కు శ్రుతీ నచ్చజెపుతుంది. అలా ఎపిసోడ్ అయితే ముగుస్తుంది కానీ వారి సమస్య ఎలా ఎప్పుడు తీరుతుందో చూడాలి.

Exit mobile version