Site icon A2Z ADDA

Intinti Gruhalakshmi Episode 467 : వలలో చిక్కిన నందు.. తులసి దెబ్బకు లాస్య విల విల

Intinti Gruhalakshmi Episode 467 ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్‌ బుధవారం నాడు మంచి సీన్లతో ముందుకు సాగేలా ఉంది. తులసితో కలిసి నందు ఆఫీస్‌కు వెళ్లనని మొండికేసుకుని కూర్చున్నాడు. ఎలాగోలా ఆ పెనాల్టీ డబ్బులు కట్టాలని నందు నానా తంటాలు పడుతున్నాడు. ఆ విషయం సాయం కోసం జీకే వద్దకు వెళ్లాడు నందు. కానీ చీ కొట్టి అవమానించి పంపేశాడు జీకే. ఆ విషయాన్ని తులసికి ఫోన్ చేసి మరీ జీకే చెప్పాడు. నేడు ప్రసారం కాబోయే 467వ ఎపిసోడ్‌లో జరిగేది ఇదే..

నందు తన దగ్గరికి వచ్చాడని, సాయం కోరాడని తులసికి ఫోన్ చేసి చెబుతాడు జీకే. అలా సాయం చేయంకండని తులసి చెబుతుంది. నీకేదైనా సాయం కావాలంటే అడుగమ్మా చేస్తాను అని జీకే అంటాడు. నాకు ఎలాంటి సాయం వద్దన్నయ్య అని చెబుతుంది. నా వల్లే కదా? మీకు సమస్యలు వచ్చాయి.. సాయం చేస్తానమ్మా అని అంటాడు జీకే. మీరేం చేశారు అన్నయ్య.. పరిస్థితులు అలా వచ్చాయని తులసి చెబుతుంది.

ఇక జీకే వద్దకు వెళ్లి డబ్బులు అడిగిన విషయాన్ని తన మామకు చెబుతుంది తులసి. కొడుకు చేసిన నిర్వాకాన్ని మామగారికి వివరిస్తుంది. వాడికి సిగ్గుందా? అంటూ విరుచుకుపడతాడు. అయితే ఈ విషయాలన్నీ అంకిత వింటుంది. అభి వద్దకు చేర వేస్తుంది. అంకుల్ వెళ్లి జీకే దగ్గర డబ్బు అడిగారట అని అంకిత అనడంతో.. అలా ఎలా వెళ్తాడు అని తండ్రిపై కోపడ్డాడు అభి. వెళ్తే తప్పేంటి? అని అంకిత రివర్స్ అయింది.

ఆంటీకి జీకే అంకుల్ ఫోన్ చేసి సాయం చేస్తాను అని చెబితే.. వద్దని అందంటా అని అంకిత చెప్పింది. అమ్మకు ఆత్మాభిమానం ఎక్కువ.. అలాంటి పని ఎప్పుడూ చేయదు.. ఎవ్వరినీ సాయం అడగదు అంటూ అభి చెప్పేస్తాడు. అందుకే నువ్ వెళ్లి కాస్త సర్దిచెప్పు.. సాయం తీసుకోమ్మను.. అప్పుడే మనం ఈ కష్టాల్లోంచి బయటపడతాం కదా? అని అంకిత అంది. నువ్ ఎక్కువగా ఆలోచించకు అని అభి తన భార్య నోర్మూయిస్తాడు.

ఇక ఆఫీస్‌కు రానని మొండికేసిన నందును రెచ్చగొట్టింది తులసి. ఆలోచించే శక్తి పోయింది.. ఒక ఆడది గెలుస్తుంటే ఓర్వలేకపోతోన్నారు.. మన పెళ్లైన కొత్తలో మీరెంత చురుకుగా ఉండేవారు.. ఎంత బాగా ఆలోచించే వారు.. ఇప్పుడు అవన్నీ ఏమయ్యాయి.. మీరు మారిపోయారు.. మీకు చేతకావడం లేదా? అంటూ ఇలా రకరకాలు రెచ్చగొట్టేసింది.

తులసి అనుకున్నట్టుగా ఆశించినట్టుగా నందు రెచ్చిపోయాడు. నేను మారలేదు.. మారలేదు.. అని అంటాడు.. మారలేదు అని చెప్పడం కాదు.. చేసి చూపించండి అని తులసి అనడంతో ఆవేశంతో నేను ఏం చేయాలో చెప్పు.. అని అంటాడు నందు. ఓ పక్కన లాస్య నందు.. నిన్ను కావాలనే రెచ్చగొడుతుంది రెచ్చిపోకు.. అంటే.. నువ్ ఆగు లాస్య అని తులసితో సవాల్ చేస్తాడు నందు.

మీకు చేతనైతే నీ ఆఫీస్ వర్కర్స్‌ని మీ వైపు తిప్పుకోండి.. మీ మాట వినేట్టుగా చేసుకోండి అని సవాల్ విసురుతుంది తులసి.. మూడు నెలల్లో వర్క్ ఫినిష్ చేస్తాను.. అని అంటాడు నందు.. మీకు దమ్ముంటే చేసి చూపించండి.. అని అంటుంది తులసి. ఇంతలో లాస్య కల్పించుకున్ని నందు నిన్ను కావాలనే ట్రాప్ చేస్తుందని అనడంతో.. లాస్య మిమ్మల్ని మొదటి నుంచి తప్పుడు దారిలోనే తీసుకుని వెళ్తుంది.. ఆమె మాట వినొద్దని చెప్పి నందుని తులసి మరింత రెచ్చగొట్టేస్తుంది.

తులసి కావాలనే తెలివిగా మాట్లాడుతుంది.. నువ్ ఆమె మాటల్ని వినొద్దని లాస్య మొత్తుకుంటుంది. మీలాస్య మీరు ఓడిపోతారని భయపడుతుంది.. వెనక్కి తగ్గిపోతారా? అని తులసి నందుని అడగడంతో వెనక్కితగ్గే ప్రసక్తే లేదు.. నేను గెలిస్తే నువ్ నేను చెప్పినట్టు చేయాలి.. స్టాఫ్‌కి ఇస్తానని ఒకనెల జీతం రెడీ చేసుకో.. వాళ్లతో పనిచేయాలో నేను చేయిస్తాను అని ఆవేశంగా అక్కడ నుంచి వెళ్లిపోతాడు నందు.

దీంతో తులసి.. ట్రాప్‌లోకి నందు వచ్చేయడంతో.. మీ అబ్బాయి చెప్పుడు మాటలకు లొంగిపోతారు తప్పితే తప్పుడు పనులు చేయరు.. అని తన మామయ్యతో అంటుంది తులసి. మరోవైపు తల్లిదండ్రుల్ని ఒకటిగా కలిసి పనిచేయడం పట్ల తెగ సంతోషపడిపోతుంటాడు ప్రేమ్. అలా ఇద్దరూ ఒకే కారులో ఆఫీస్‌కు వెళ్లడం చూసి తెగ మురిసిపోతాడు ప్రేమ్. ఇక శ్రుతీ సైతం తులసి గొప్పలు చెబుతుంది. శశికళ అప్పు తీర్చాలని ప్రేమ్, శ్రుతిలు అనుకుంటారు. ఇక ఈఇద్దరి మధ్య కాస్త రొమాన్స్ పెట్టడంతో సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Exit mobile version