Intinti Gruhalakshmi 466 ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్‌లో మంగళవారం నాడు రచ్చ రచ్చగా మారనుంది. జీకే చేతిలో నందు అవమానం, కూతురు దివ్యను నందు కోపగించుకోవడం, పని మనిషి రాములమ్మ చేతిలో అంకితకు ఘోర పరాభవం వంటివి స్తూలంగా జరిగాయి.మొత్తానికి ఎపిసోడ్ ఎలా ముందుకు వెళ్లిందంటే..
తన కంపెనీలో పెట్టుబడి పెట్టమని జీకేను కోరిని నందుకు భంగపాటు ఎదురైంది. నానా చీవాట్లు పెట్టి జీకే అవమానిస్తాడు. చేసిన తప్పులకు నీ భార్య కాళ్లపై పడి క్షమాపన కోరుకుంటావా? అంటూ నందు ఇజ్జత్ తీస్తాడు జీకే. అలా అక్కడ సీన్ కట్ చేస్తే.. తులసి మీద సీన్ ఓపెన్ అవుతుంది. నందు అన్న మాటలు తలుచుకుంటూ తెగ కుమిలిపోతుంది. అలా చీకటి గదిలో ఉన్న తులసి వద్దకు లాస్య వచ్చి రెచ్చగొడుతుంది.
నీ బతుకు ఇకపై అంతా చీకటే.. నందు రూ.2 కోట్ల అప్పుని తీర్చబోతున్నాడు. ఈ ఇంట్లో తన స్థాయిని పెంచుకుని నిన్ను ఇంట్లో నుంచి గెంటేయబోతున్నాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ నందు నీతో కలిసి ఆఫీస్‌కి రాడు అని అంటుంది. నువ్ చెప్పింది నిజమే లాస్యా.. ఈ ఇంట్లో నుంచి గెంటేస్తాడు కానీ నన్ను కాదు నిన్ను. నందుతో నేను పాతికేళ్లుగా ఉంటున్నా.. అతని గురించి నాకు తెలియదా అంటూ కౌంటర్ వేస్తుంది తులసి.
ఆ తరువాత అంకిత శ్రుతీల మధ్య సీన్ ఓపెన్ అవుతుంది. మధ్యలోకి రాములమ్మ దూరి అంకితను నానా రకాల మాటలు అంటుంది. అబార్షన్ చేయించుకున్నావ్.. వారసుడిని లేకుండా చేశావ్ అంటూ రాములమ్మ ఇష్టమొచ్చినట్టుగా అంటుంది. మీరన్ని మాటలు అంటున్నా కూడా శ్రుతమ్మ ఒక్క మాట కూడా అనడం లేదు అదీ సంస్కారం అంటే అని శ్రుతిని పొగుడుతుంది. అంకితకు చీవాట్లు పెడుతుంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన అంకిత.. పని మనిషివి పని మనిషిలా ఉండు.. లేకపోతే ఇంట్లోంచి వెళ్లిపోవాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇస్తుంది. ఈ శ్రుతి నీతో నన్ను తిట్టిస్తూ ఏమీ తెలియని నంగనాచిలా నిలబడి చూస్తుందని అని అంకిత రాములమ్మ, శ్రుతిలపై విరుచుకుపడుతుంది. రాములమ్మ కూడా తిరిగిగట్టిగానే సమాధానం చెప్పడంతో శ్రుతి కల్పించుకుని గొడవను పెద్దది చేయకు రాములమ్మా వదిలెయ్ అని అంటుంది.
ఇక తరువాత జీకే చేసిన అవమానం భారంతో ఇంటికి వస్తాడు నందు. అలా వచ్చీ రాగానే దివ్య తన ఎగ్జామ్ అప్లికేషన్‌తో ఎదురు పడుతుంది. కానీ చిరాకులో ఉన్న నందు దివ్య మీద అరస్తాడు.. ఆ వెంటనే నందు తండ్రి పరందామయ్య వచ్చి.. ‘భార్యకి విడాకులు ఇచ్చి పెళ్లి బంధాన్ని తెంచేసుకున్నావ్.. పిల్లల్ని కూడా దూరం చేసుకునే వీలు ఉంటే.. అది కూడా తెంచేసుకునేవాడివిరా? అని నిలదీస్తాడు కొడుకును. ఆ మాటతో నందు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. వెంటనే సారీ దివ్య.. ఇంకెప్పుడు అలా అననని చెప్పి సంతకం పెట్టేస్తాడు నందు.
చివరకు లాస్య, నందుల మీద ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. జీకే చేసిన అవమానం గురించి చెప్పడంతో లాస్య ఖంగుతింటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో శ్రుతీ తన నగలు అమ్మి డబ్బు తెచ్చి తులసికి సాయంగా నిలబడాలనుకుంటుంది. దీనిపైనా అంకిత గొడవ చేయబోతోన్నట్టు కనిపిస్తోంది.