Site icon A2Z ADDA

Guppedantha Manasu : గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్.. అర్దరాత్రి వసుతో రిషి.. దేవయాణి గుండెళ్లో రైళ్లు

Guppedantha Manasu serial today Episode గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్.. అంటే బుధవారం జరిగే ధారావాహిక.. అంటే ఈ రోజు ఎపిసోడ్ Guppedantha Manasu Episode 315 లో మనసులోని మాటను రిషి చెప్పేందుకు ప్రయత్నించడం.. అటు దేవయాణి ఓసారి ఇటు పుష్ప మరోసారి బ్రేక్ చేయడంతో మ్యాటర్ ఆగిపోతోంది. రిషి ఏం చెబుతాడా? అని వసు ఆత్రుతగా ఎదురుచూసినట్టు అనిపిస్తోంది. వసుతో రిషి ఏకాంతంగా గడుపుతున్నాడని దేవయాణి కాళ్లు కాలిన పిల్లిలా తిరుగుతూ ఉంటుంది. మొత్తానికి గుప్పెడంత మనసు సీరియల్ నేడు ఎలా సాగిందో ఓ సారి చూద్దాం.

అర్దరాత్రి ఒంటరిగా ఊయల ఊగుతున్న వసు దగ్గరకు రిషి నడుచుకుంటూ వస్తాడు. ఎవరో వస్తున్నారని వసు కాస్త భయపడుతుంది. కానీ రిషిని చూసే సరికి ఊపిరి పీల్చుకుంటుంది. ఏంటి సర్ మీరు వెళ్లలేదా? అని అడుగుతుంది. నువ్ వెళ్లావేమో అని నేను కూడా వెళ్లిపోయాను..నువ్ వెళ్లలేదని తెలిసి మళ్లీ వచ్చాను అంటూ రిషి అనేస్తాడు. అంటే నేను చెప్పకుండా వెళ్తాను అని అనుకున్నారా? సర్ అని వసు ప్రశ్నించింది.

నువ్ బాల్యంలోని సంతోషాలను వెతుక్కుంటావ్ కదా? అని రిషి అంటే.. బాల్యం అందరికీ బాగుంటుంది కదా? అని వసు బదులిస్తుంది. బాల్యం అందరికీ బాగుండాలనే రూల్ ఉండదు కదా? అని రిషి అంటాడు. భయం వేయలేదా? వసు అని రిషి అడిగితే.. వేసింది సర్.. కొంచెం భయం.. కానీ ఎక్కువ సంతోషం వేసిందని అంటుంది. ఇక రిషిని ఊయలపై కూర్చోబెట్టేస్తోంది వసు.

అలా వసు ఊయల ఊపుతూ ఉంటే.. రిషి ఒకటి చెప్పాలనిపిస్తోంది అని తన మనసులోని మాట బయట పెట్టేందుకు ట్రై చేస్తున్నట్టు కనిపించింది. అయితే ఇంతలో దేవయాణి ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావ్ రిషి అని దేవయాణి అంటే.. వస్తున్నాను పెద్దమ్మా అని ఊయల దిగే సమయంలో ఫోన్ కింద పడుతుంది. అయ్యో సర్.. ఏం కాలేదులేండి అని ఫోన్ రిషికి ఇస్తుంది. దీంతో వసుధార గొంతు వినిపించడంతో దేవయాణి కంగారు పడుతుంది.

వస్తున్నాను పెద్దమ్మ అని ఫోన్ పెట్టేస్తాడు రిషి. ఏదో చెప్పాలని అంటున్నారు.. ఏంటి సర్ అని రిషిని వసు మళ్లీ అడుగుతుంది. అయితే చెప్పేందుకు మళ్లీ రిషి రెడీ అవుతాడు. కానీ పుష్ప వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. కారు వచ్చింది.. వెళ్దాం పదా అని పుష్ప ఎంట్రీ ఇస్తుంది. గుడ్ పుష్ప.. వసుకు తోడుగా ఉన్నావ్ అని అంటాడు. ఇంతలో మంత్రి పని మనిషి వస్తాడు. మీరు ఇంకా ఉన్నారా? సర్.. కారులో ఒక్కరికే చోటు ఉంది సర్ అని అంటాడు. దీంతో పుష్ప ఆ కారులో వెళ్తానని అంటుంది. వసు, రిషి తన కారులో వెళ్తారు.

అక్కడ సీన్ ఓపెన్ చేస్తే.. జగతి ఇంట్లో మహేంద్ర మీద సీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడికి ఎందుకు వచ్చావ్ అంటూ మహేంద్రను ప్రశ్నిస్తుంది జగతి. అదేంటి రాకపోతే ఎందుకు రాలేదని అడగాలి కానీ.. వస్తే ఎందుకు అని అడగడం ఏంటని మహేంద్ర అంటాడు. వన భోజనాలకు వెళ్లాం.. అందరూ ఇంటికి వెళ్లారు.. మీరు మళ్లీ ఇక్కడకు వచ్చారు.. రిషి ఇంటికి అలిసిపోయి వస్తాడు.. అప్పుడు మీరు ఇంట్లోనే ఉండాలి కదా? అందుకే మనల్ని దేవయాణి అక్క తిడుతుంది.. ఆ అవకాశం ఎందుకు ఇవ్వడం.. రిషి వెళ్లి డాడ్ ఎక్కడికి వెళ్లాడని అడుగుతాడు.. ధరణి అయితే మామూలుగా చెబుతుంది.. అదే దేవయాణి అక్క అయితే ఇంకో రెండు మాటలు ఎక్కువ చెబుతుంది.. అంటూ వెళ్లమని చెబుతుంది జగతి. గుడ్ నైట్ జగతి.. నిజంగానే వెళ్లమంటున్నావా? అని మహేంద్ర మరోసారి అడుగుతాడు. గుడ్ నైట్ అని జగతి చెప్పడంతో మహేంద్ర వెళ్తాడు.

ఆ తరువాత కారులో వసు, రిషి వెళ్తుంటారు. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది అని రిషి అంటే.. చూస్తుండగానే గడిచిపోయింది సర్ అని వసు అంటుంది. వన భోజనాలు అంటే ఏంముంటుందిలే అనుకున్నాను అని రిషి మొదలుపెడితే.. మా ఊర్లో అందరం ప్రతీ ఏటా వెళ్లేవాళ్లం.. స్కూల్‌కు వెళ్తేనే సాయంత్రం వరకు అమ్మను చూడలేదేంటి? అనుకునేదాన్ని.. కానీ ఇలా వదిలేయాల్సి వచ్చింది.. లక్ష్యం కోసం ఇలా రావాల్సి వచచ్చింది.. కొండంత ప్రేమ ఉన్నా బాధను లోపలే ఉంచుకుంటున్నాను.. భూమిని చీల్చందే.. పంట పండదు.. జీవితం కూడా అంతే.. గెలవాలంటే ఎన్ని సార్లు చచ్చి పుట్టాలో.. ఏంటో నేను ఏదేదో మాట్లాడేస్తున్నాను.. అని వసు అంటుంది. చెప్పు వసుధార.. ఏం పర్లేదు.. చెప్పు.. మీ ఊరి గురించి బాగానే చెబుతుంటావ్ కదా? అని రిషి అంటాడు.

నీ పట్టుదల, తెలివి, మొండితనం, పట్టుదల కూడా అప్పుడప్పుడు నచ్చుతుంది అని రిషి తనలో తాను అనుకుంటాడు.. ఇంతలో కారు రిపేర్‌కు వస్తుంది. ఆగిపోతుంది. సమస్య ఏంటా? అని కారు బానెట్ ఓపెన్ చేస్తాడు.. పెట్రోల్ అయిపోయిందా? అని వసు అమాయకంగా అడిగేస్తుంది.. పెట్రోల్ కోసం ఇండికేటర్ ఉంటుంది కదా? అని రిషి బదులిస్తాడు. కారు ఇంజన్‌లో రిషి చేయి పెట్టడంతో చేయి కాలుతుంది. ఇది మన వల్ల అయ్యేలా లేదు.. సర్వీస్ సెంటర్‌కు కాల్ చేయాల్సిందేనని ఫోన్ చేస్తాడు.. బ్రేక్ డౌన్ అయింది.. మెకానిక్‌ను పంపించమని రిషి ఫోన్ చేసి చెబుతాడు. ఇంతలో వసు ఫోన్‌ను చూస్తుంటే.. ఏంటి సెల్ఫీనా? అని అడుగుతాడు.. కాదు సర్ అని వసు అంటూ.. మీరు అన్నాక తప్పదు అని ఓ సెల్ఫీని తీస్తుంది..

అలా సీన్ అక్కడ కట్ చేస్తే.. ఇంట్లో దేవయాణి గుండెళ్లో రైలు పరిగెడుతుంటున్నట్టు అటూ ఇటూ తిరుగుతుంది. రిషి ఏంటి ఇంకా రాలేదు.. ఫోన్ చేస్తే వసుధార గొంతు వినిపించింది.. ఇంకా కలిసి ఉన్నారా? అని లోలోపల తెగ కంగారు పడుతుంది. అత్తయ్యగారు పడుకోవచ్చు కదా? అని ధరిణ అంటే.. ఎప్పుడు పడుకోవాలో నువ్వే చెబుతావా? అంటూ కసురుకోవడంతో ధరణి అక్కడి నుంచి వెళ్తుంది.. రిషి రాలేదని ఎవ్వరైనా పట్టించుకుంటున్నారా? గుర్రు పెట్టి నిద్రపోతోన్నారు.. వాళ్లు ఎక్కడున్నారు.. ఏం చేస్తున్నారు.. వచ్చే వరకు నాకు మనశ్శాంతి లేదు..అంటూ దేవయాణి తెగ ఆందోళన చెందుతుంది.

వసుధార టెన్షన్ పడకు.. సర్వీస్ వాళ్లు వస్తారు.. కారు రిపేర్ చేస్తారు. ఈ వాతావరణం.. ఈ చీకటిని చూస్తే భయం వేయడం లేదా? అని రిషి అడుగుతాడు.. భయం ఎందుకు సర్.. మీరున్నారు కదా?. మీరు లేకపోయినా నాకు భయంగా ఉండదు అని వసు అంటుంది. ఏంటి నీ ధైర్యం. మనం భయపడుతూ ఉంటే జరగేవి జరగకుండా ఆగవు..జరగాల్సినవి జరుగుతూనే ఉంటాయి.. వాటి గురించి బాధపడి, భయపడి టెన్షన్ పడి టైం వేస్ట్ చేసుకోవడమే అవుతుంది… వాటికి బదులు ఈ వాతావరణాన్ని చూసి ఎంజాయ్ చేయాలి అని వసు చెప్పిన ఫిలాసఫికి రిషి ఫిదా అవుతాడు. అలా ఎపిసోడ్ కూడా ముగుస్తుంది.

Exit mobile version