గుప్పెడంత మనసు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ అంటే బుధవారం ఫిబ్రవరి 9న ప్రసారం కానున్న Guppedantha Manasu Episode 369 ధారావాహికలో ఎమోషనల్ సీన్స్ పడ్డాయి. జగతిని ఇంటి నుంచి తీసుకొచ్చినందుకు మహేంద్ర కాస్త ఫీలైనా కూడా తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. జగతి మాత్రం కాస్త నిరాశలోనే ఉన్నట్టుంది. కానీ దేవయాణి మాత్రం ఫుల్ ఖుషీగా కనిపించింది. అలా గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ ముందుకు సాగింది.
నాకు ఈ రోజే పండుగ.. జగతి వెళ్లింది కాబట్టి నాకు ఈ రోజే పండుగ.. నాకు ఇష్టం లేనిది నా కళ్ల ముందుండ కూడదు.. అది వస్తువైనా మనిషైనా.. స్వీట్ టేస్టీగా ఉండాలి.. అంటూ ధరణికి చెప్పి మరీ దేవయాణి వెళ్తుంది. అసలు మీద మనసే కాదు..అని ధరణి లోలోపల తిట్టుకుంటుంది. సర్ ఏమీ అనుకోకపోతే ఒక మాట అడగాలా? అని వసు అంటుంది.
జగతిని నేనే ఇంటి నుంచి తీసుకురావడం కరెక్ట్ కాదని నీ అభిప్రాయం అదే నీ ప్రశ్న కదా? అని మహేంద్ర అంటాడు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసింది అందుకే కదా? సర్.. ఆ ఆనందాన్ని ఆస్వాధించే లోపే తీసుకొచ్చారు.. అని వసు అంటుంది. జగతి నీకు గురువు.. నా జీవితం.. నా ఆనందం కోసం ఇంటికి తీసుకొచ్చాడేమో రిషి.. ఫంక్షన్ కోసం టెంట్ నుంచి సామాన్లు తీసుకొస్తాం.. అవసరం తీరితే పంపించేస్తారు.. అలాంటి అవసరం రాకముందే నేనే జగతిని తీసుకొచ్చాను.. జగతిని రిషి పొమ్మనలేదు.. అలా అని ఎప్పటికీ ఉండమనలేదు.. అవకాశం కోసం దేవయాణి చూస్తోంది.. ఎప్పుడు జగతిని అవమానిద్దామా? అని.. జగతికి అవమానం జరిగితే నాక్కూడా జరిగినట్టే కదా? జగతిని ఒక మాట అంటే మా బంధాన్ని అన్నట్టే కదా? జగతి ఆ ఇంటికి కోడలిగా, నా భార్యగా, రిషికి తల్లిగా రాలేదు.. అని మహేంద్ర అంటాడు.
అవకాశాం వచ్చింది కదా? సర్ అని వసు అంటుంది. అవకాశాలతో బంధాన్ని నిలపలేం.. బంధాలు కలవాలి.. అతిథిగా వచ్చింది.. అమ్మగా కాదు.. అతిథులు ఎప్పటికైనా వెళ్లాల్సిందే.. జగతి ఆ ఇంట్లోకి సగర్వంగా అడుగు పెట్టాలి.. మంగళ హారతిచ్చి.. లోపలకి ఆహ్వానించాలి.. రిషి అమ్మగా పిలవాలి.. ఆ ఇంట్లో కూడా మేడం అని పిలిస్తే ఎంత బాధపడ్డానో నీకు తెలుసా? చెప్పు వసుధార నేను తప్పు చేశానా?.. అని అడుగుతాడు.
ఇంతలో జగతి జ్యూస్ తీసుకొస్తుంది. జగతి కాఫీ ఇవ్వొచ్చు కదా? అని మహేంద్ర అంటాడు. ఏం ఇవ్వాలో నాకు తెలుసు.. అని అంటుంది. జగతి నీ విషయంలో నేను ఏదైనా తప్పు చేశానా? అని మహేంద్ర అడుగుతాడు. కాలమే తప్పు చేసింది మహేంద్ర.. రిషి రమ్మన్నాడు..కాదు రిషి సర్ రమ్మన్నాడు వచ్చాను. మా వారు వెనక్కి తీసుకొచ్చారు.. వచ్చాను.. ఈ టాపిక్ ఇంతటితో వదిలేద్దామా? వసు నీ కాలినొప్పి పూర్తిగా తగ్గలేదు.. అనవసరంగా తిరగకు.. కాఫీ తీసుకొస్తాను.. అని జగతి లోపలకు వెళ్తుంది. పాపం బాధలన్నీ మనసులోనే దాచుకుంది అని మహేంద్ర అనుకుంటాడు. మనసులోఎంత బాధున్నా ఏ మాత్రం బయటపడరు.. అని వసు అనుకుంటుంది.
మహేంద్ర మాటలను తలుచుకుంటూ రిషి ఆలోచనల్లో పడతాడు. ఇంతలో ఐస్ క్రీం అంటూ గౌతమ్ వస్తాడు. పద వసుధార, జగతి మేడం అందరినీ పిలుద్దామని అంటాడు గౌతమ్. వాళ్లు వెళ్లిపోయారు అని రిషి చెబుతాడు. దీంతో గౌతమ్ షాక్ అవుతాడు. ఐస్ క్రీం తింటావో పాడేస్తావో నీ ఇష్టం అని రిషి అనేస్తాడు.. ఏంటి వసుధార కొన్నాళ్లు ఉంటుందని అనుకున్నా.. దగ్గరవుదామని అనుకున్నా.. వెళ్లిపోయిందేంటి.. వీడిని అడిగితే కోప్పాడతాడు.. ఏం చేస్తాం ప్రిడ్జ్‌లో పెట్టేస్తా అని గౌతమ్ లోలోపల అనుకుంటాడు.
రిషి భోజనం చేద్దువరా అని ధరణి పిలుస్తుంది.. వదిన డల్లుగా ఉన్నావేంటి.. అని అడుగుతాడు రిషి. ఏం లేదు అని ధరణి అంటుంది. జగతి అత్తయ్య వెళ్లిపోయాక ఇంకెలా ఉంటాను.. అని లోలోపల అనుకుంటుంది. ఏం కాలేదులే.. అని ధరణి అంటే.. ఏం అయింది వదిన అని మళ్లీ అడుగుతాడు రిషి.. అనుకోకుండా ఒక సంతోషం ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది రిషి.. అని ధరణి చెబుతుంది. ఏంటి వదిన ఇలా అంటున్నారు.. అని రిషి అనుకుంటాడు.
మహేంద్ర మాటలను వసు తలుచుకుంటూ ఆలోచనల్లో పడుతుంది. ఇక్కడెందుకు నిల్చున్నావ్ వసు.. అని జగతి అడుగుతుంది. ఏం లేదు మేడం.. అని వసు అంటుంది. కొన్ని విషయాలు ఎక్కువగా ఆలోచించకపోతేనే మంచిది.. అని జగతి సలహా ఇస్తుంది. ఇంట్లోనే ఉండమని అంటే మీ సొమ్మేంపోయేది.. ఈసారి కనిపిస్తే గట్టిగా నిలదీస్తాను. అని రిషి గురించి వసు అనుకుంటుంది.
ఇంతలో రిషియే వచ్చేస్తాడు. ఏంటో ఇలా అనుకోగానే అలా వచ్చేశారు.. అని లోలోపల వసు అనుకుంటుంది. కాఫీ తీసుకోండి సర్.. అని వసు అంటుంది. వద్దన్నాను కదా?.. త్యాగాలేం వద్దు అని అంటాడు.. కాఫీ కూడా త్యాగం అవుతుందా? అని వసు ప్రశ్నిస్తుంది. ఏదో మాట వరసకు అన్నాను.. ఇప్పుడు త్యాగాల్లోని రకాలు చెబుతావా? అని రిషి కోపంగా అనేస్తాడు. మిమ్మల్ని అర్థం చేసుకోవడం కష్టం సర్ అని వసు అంటే.. కష్టమైతే అస్సలు ప్రయత్నించకు. అవసరం లేని వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావేమో అని రిషి అంటాడు.. మేడం అని వసు ఏదో చెప్పబోతోంటే.. అదే ఆలోచించొద్దని అంటున్నా.. కొన్నింటికి గురించి విశ్లేషణలు, వివరణలు కూడా అవసరం లేదు.. అని రిషి అంటాడు. ఏంటో మేడం గురించి అడుగుదామనే లోపు నోరు మూయించేశారు.. అని వసు అనుకుంటుంది. లోపలి నుంచి ఓ స్ట్రా తెప్పించమంటావా? కోల్డ్ కాఫీలా తాగుతావా? కాఫీ తాగి అప్పుడు లోపలకు రా.. కాలి నొప్పి తగ్గే వరకు నడవడం కాస్త తగ్గించు.. అని చెప్పి లోపలకు వెళ్లిపోతాడు రిషి.
నీళ్లు తీసుకురండి అని జగతికి రిషి చెబుతాడు.. టాబెట్లు వేసుకునే టైం వచ్చింది అని రిషి చెబుతాడు. ఇందు కోసం వచ్చావా? అని మహేంద్ర అంటే.. మీరు ఇంటికి ఎలా వస్తారు అని రిషి అడుగుతాడు. క్యాబ్‌లో అని మహేంద్ర సమాధానం చెబుతాడు. అది నచ్చకే ఇలా వచ్చాను.. అని రిషి చెబుతాడు. థ్యాంక్స్ రిషి.. అని మహేంద్ర అంటే.. ఇది నా బాధ్యత.. థ్యాంక్స్ చెప్పొద్దు.. ఈ మధ్య మిమ్మల్ని మీరు పట్టించుకోవడం లేదు.. చెప్పకుండా బయటకు వస్తున్నారు.. అందుకే నేను పట్టించుకోవాల్సి వస్తుంది.. కొడుకుగా ఇది నా బాధ్యత.. అని రిషి అంటాడు.
కొడుకుగా ఇది నీ బాధ్యత అయితే నేను పట్టించుకోవాల్సిన వాళ్లున్నారు కదా?. నాకూ బాధ్యతలుంటాయి కదా? అని మహేంద్ర అంటాడు. సరే వెళ్దామా? అని రిషి అంటే.. ఇప్పుడేనా? అని మహేంద్ర అంటాడు. సరే నేను కారులో వెయిట్ చేస్తుంటాను.. మిస్డ్ కాల్ ఇవ్వండి.. అయిపోయాక అని అంటాడు. ఎందుకంత కోపం.. అని మహేంద్ర అడుగుతాడు. కోపమని నేను చెప్పానా?.. మీరు అనుకుంటున్నారు.. అని బయటకు వెళ్తాడు రిషి. వెళ్లు మహేంద్ర అని జగతి చెప్పడంతో వెళ్లొస్తాను.. అని మహేంద్ర చెబుతాడు.
ఇక ఇంట్లో కవిత్వం చెప్పుకుంటూ సంబరపడిపోతాడు గౌతమ్..వసు ఆలోచనల్లో మునిగిపోతాడు గౌతమ్. మీ రూంలోకి రావాలా? డాడ్ అని రిషి అడుగుతాడు. నాకు ఒంటరితనం అలవాటైంది రిషి.. అని మహేంద్ర చెబుతాడు. మీరు కోరుకున్నవన్నీ ఇవ్వలేకపోవచ్చు.. మీ ఆలోచనలు, ఒంటరితనాన్ని గౌరవిస్తాను..అని రిషి అంటాడు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లోకాలేజ్‌లో వసు, రిషి మరింత దగ్గరవుతారు.