గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే ఫిబ్రవరి 5న శనివారం నాడు ప్రసారం కానున్న Guppedantha Manasu Episode 366 ధారావాహికలో గాలి పటాలు ఎగిరేశారు. గౌతమ్ రిషిల ఆటలు, దేవయాణి జగతిల విమర్శలు, ప్రతివిమర్శలతో ముందుకు సాగింది. అందరూ సంతోషంగా సరదాగా గడిపేశారు. మొత్తానికి గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ సాఫీగా సాగిపోయింది.
రిషి ముందు దేవయాణిని ఇరికించకుండా జగతి కవర్ చేస్తుంది. ఇక్కడ సౌకర్యాలు బాగున్నాయా? లేవా? అని అడుగుతున్నారు సర్.. గుడ్ నైట్ సర్.. అని జగతి వెళ్లిపోతుంది. ఇక వసు ఎగరేస్తున్న ఆకాశ దీపంలో రిషి సాయం చేస్తాడు.. ఆకాశంలోకి వదిలేసి అందరూ బాగుండాలని కోరుకోవాలి అని వసు చెబుతుంది.. ఓ ఇదొకటి ఉందా?.. నువ్వేం కోరుకున్నావ్.. అని రిషి అడిగుతాడు. అందరూ బాగుండాలని కోరుకున్నావ్ అంతే కదా?.. ఇది గాల్లోకి ఎగురుతుందా?. అని అడుగుతాడు.
ఇందులో నైట్రోజన్ ఉంటుంది..అలా పైకి ఎగురుతుంది అని వసు అంటుంది. నీకు చాలా బాగా తెలుసు.. అని వసు అంటే.. ఏదో అలా అని అంటుంది.. అందరి గురించి ఆలోచించడంలో ఆనందం ఉంటుంది కదా? సర్..అని వసు అంటుంది. కాదని ఎవరన్నారు.. నువ్ అందరి గురించి ఆలోచిస్తావ్.. ఈ డ్రెస్ గురించి నా దగ్గర ఎందుకు అబద్దం చెప్పావ్.. అని రిషి అడుగుతాడు.
కోపం తెచ్చుకోనని మాటిచ్చారు.. కదా? అని వసు అంటే.. అందుకే కదా? ఏమీ అనలేకపోతోన్నాను.. అని రిషి అంటారు. హలో మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు.. నన్ను దూరం పెడుతున్నావ్.. నన్ను పిలిస్తే నేను కూడా వచ్చే వాడిని.. అని గౌతమ్ మధ్యలోకి దూరతాడు. నాకో హెల్ప్ చేయ్ రా.. ఆకాశంలో ఎన్ని చుక్కలున్నాయో లెక్క పెట్టుకుని వచ్చేయ్.. రా వసుధార.. అని రిషి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వసు కూడా రిషి వెనకే వెళ్లిపోతుంది.
గాలిపటాలు, దానికి సూత్రం (కన్నాలు) కడుతూ వసు, రిషి ముచ్చట్లు పెట్టుకున్నారు. చిన్నప్పుడు గాలిపటాలు ఎగిరేసేదానివా? అని వసుని రిషి అడుగుతాడు. మామూలుగా కాదు విపరీతంగా.. అబ్బాయిలతో పోటీ పడి మరీ ఆడేదాన్ని.. సూత్రం ఇలా కట్టాలి.. అని వసు చెబితే ఎవరి లెక్క వాళ్లకు ఉంటుంది కదా? అని రిషి అంటాడు. అదీ నిజమేనని వసు అనేస్తుంది..
గాలి పటాలు ఎగిరేయడం లేదు.. .జస్ట్ చూస్తున్నావ్ అంతే.. కాలి నొప్పితో ఎగిరేయడం కష్టం.. నీకు నొప్పి ఎక్కువ అవుతుంది..అని వసుని వద్దంటాడు రిషి. అయితే దారం చుడతాను సర్.. అని వసు, రిషి కలిసి ఆడేందుకు రెడీ అవుతాడు. ఇంతలో హార్ట్ బొమ్మ గాలి పటం వేసుకుని గౌతమ్ కూడా జాయిన్ అవుతాడు. వసుని తనతో కలిసి ఆడమని అంటాడు. నా జట్టులో చేరిపోయింది అని వసు అంటాడు. వీడేంటి కావాలని చేస్తున్నాడా? అలా కలిసి వచ్చిందా? అని గౌతమ్ లోలోపల అనుకుంటాడు.
రిషి బాల్యాన్ని పూర్తిగా చూడకుండానే దూరమయ్యాను.. ఇన్నాళ్లకు ఈ ఇంట్లో అడుగుపెట్టాను.. తరువాత ఏం జరగనుంది.. అని జగతి లోలోపల అనుకుంటుంది. అలా అనుకుంటూ ఉండగానే దేవయాణి రావడాన్ని చూసి జగతి లేచి నిల్చుంటుంది. లేచి నిల్చున్నావ్. భయమా? భక్తి.. అని దేవయాణి అంటుంది. ప్రేమగా అక్కయ్య అంటాను కదా? అదే గౌరవం.. అని జగతి కౌంటర్ వేస్తుంది. ఏడాదికి ఒక్కసారి ఎడారిలో వర్షం కురుస్తుంది.. ఎడారిలా మారిన నీ జీవితానికి ఈ సంక్రాంతికి వర్షం పడింది.. ఇది శాశ్వతం అని సంబరపడిపోకు..అని దేవయాణి అంటుంది. ప్రాణమే శాశ్వతం కానప్పుడు ఇవన్నీ ఏంటి.. అని జగతి కౌంటర్ వేస్తుంది.
వసుతో బట్టలు పంపడం, మహేంద్రతో మాటలు అవన్నీ అవసరమా? అని అని దేవయాణి అంటుంది.. మీరు భయపడుతున్నారు.. నేను సంతోషిస్తున్నాను.. అని జగతి అంటుంది. నీ సంతోషం నాకు నచ్చదు.. అని దేవయాణి అంటుంది. ఇంత చేసి ఏం సాధించావ్.. అని జగతి అంటుంది. నాకు పాఠాలు చెప్పకు.. చూడలేకపోతోన్నాను.. అని దేవయాణి అంటుంది.
చూడలేకపోతోన్నాను కాదు.. ఓర్వలేకపోతోన్నాను అంటే బాగుంటుంది.. భార్యగా దగ్గరకు వచ్చాను. మీ అనుమతి నాకు అవసరం లేదు.. కొడుకు పిలిచాడు వచ్చాను. చూడలేకపోతోనే కళ్లు మూసుకోండి.. అని జగతి అంటుంది. కళ్లు మూసుకుంటానో.. ఏం చేస్తానో చూస్తావ్. అని దేవయాణి వార్నింగ్ ఇస్తుంది. 20 ఏళ్లు దూరం చేశావ్.. ఇంతకన్నా ఏం చేయగలరులే.. అందరూ సంక్రాంతి సంబరాల్లో ఉన్నారు.. వారి ఆనందాన్ని పాడు చేయకండి.. నా మీద ద్వేషాన్ని వాళ్ల మీద చూపించకండి.. అని జగతి అంటుంది. దేవయాణిని తక్కువ అంచనా వేస్తున్నావ్ జగతి అని తనలో తానే అనుకుంటుంది.
చూశావా? రిషి ఎంత చిన్న పిల్లాడు అయిపోయాడు అని గాలిపటాలు ఎగిరేయడం గురించి మహేంద్ర, ఫణీంద్రలు మాట్లాడుకుంటారు..పండుగ పరమార్థం ఇదే అన్నయ్య అని మహేంద్ర అంటాడు.. ఈ పండుగ మరింత స్పెషల్ అయింది.. జగతి ఇంటికి రావడం అది కూడా రిషి తీసుకురావడం.. అని ఫణీంద్ర సంబరపడతాడు. మరో వైపు గౌతమ్ గాలిపట్టాన్ని రిషి కట్ చేసేస్తాడు.
దీంతో గౌతమ్ హర్ట్ అయి వెళ్లిపోతాడు. ఆ తరవాత అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు. ఇప్పుడు ఇంత శాంతంగా ఉన్నాడు కానీ.. చిన్నప్పుడు చాలా కోపంగా ఉండేవాడు.. అంటూ మహేంద్ర చిన్ననాటి విషయాలను ఫణీంద్ర చెప్పుకొచ్చాడు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో దేవయాణి కొత్త నాటకం మొదలెట్టేసింది. రిషి దగ్గర మొసలి కన్నీరు కార్చేసింది. మరో వైపు జగతిని ఇంటి నుంచి పంపించేందుకు మహేంద్ర రెడీ అవుతాడు. అయితే అసలేం జరిగిందో తెలియాలంటే వచ్చే వారం వరకు ఆగాల్సిందే.