గుప్పెడంత మనసు ఈరోజు సీరియల్ ఎపిసోడ్ అంటే ఫిబ్రవరి 4న శుక్రవారం నాడు ప్రసారం కానున్న Guppedantha Manasu Episode 365 ధారావాహికలో రిషి తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. దేవయాణి అయితే మళ్లీ మంట ఎలా పెట్టాలని ఆలోచించింది. గౌతమ్ ఓవర్ యాక్షన్, జగతి మహేంద్రల ముచ్చట్లు, జగతి దేవయాణిలు వాగ్వాదంతో గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ ముందుకు సాగింది.
అందరూ డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్నారు. వసు వడ్డిస్తుంటుంది. నువ్ కూడా కూర్చోమ్మా.. ధరణి వడ్డిస్తుంది..అని ఫణీంద్ర అంటాడు. ధరణి గారు వంటగదిలో ఉన్నారు. నేనే వడ్డిస్తాను.. అని వసు అంటుంది. సర్ వడ్డించమంటావా? అని రిషిని వసు అడుగుతుంది. నన్ను అడగవా? అని గౌతమ్ అంటాడు. మీరు అడగకముందే పిలుస్తారు కదా? అని వసు సెటైర్ వేస్తుంది.
ఇలా కలుపుగోలుతనంగా ఉండటం మామూలు విషయం కాదు.. అని మహేంద్ర అంట.. అవునవును చూస్తున్నా కలుపుగోలుతనం అని దేవయాణి కౌంటర్ వేస్తుంది… వసు నువ్ కూర్చో.. అని జగతి అంటే.. పర్లేదు మేడం అని వసు అంటుంది.. వసు కూర్చో.. అని రిషి ఉంటాడు. కూర్చో అని రెండో సారి అనడంతో వసు కూర్చుంటుంది. చూశావా? జగతి.. నువ్ చెబితే వినలేదు.. రిషి చెబితే కూర్చుంది. అని మహేంద్ర అంటాడు.
ఎండీ కదా?. అని జగతి అంటుంది. పెదనాన్న..నాకు భలే గమ్మత్తుగా ఉంది తెలుసా? అని గౌతమ్ మొదలుపెడతాడు. ఏంట్రా నీ గోల.. అని రిషి ఏంటి గౌతమ్ అని ఫణీంద్ర అడుగుతాడు.. ఇలా అందరం కూర్చున్నాం కదా? జగతి మేడం వసు మన కాలేజ్ స్టాఫ్, స్టూడెంట్‌లా అస్సలు అనిపించడం లేదు.. జగతి మేడం ఇంటి మెంబర్‌లా ఏదో దగ్గరి చుట్టం అనిపిస్తున్నారు.. పైగా ధరణి వదిన ప్రేమగా.. చిన్నత్తయ్య అని పిలుస్తున్నారు.. అని గౌతమ్ మొదలుపెడతాడు
నువ్వే అన్నావ్ కదా? గౌతమ్.. ప్రేమగా పిలుస్తుందని.. అని జగతి కవర్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. మరి వసుధార గురించి చెప్పవేంటి.. అని దేవయాణి అడుగుతుంది. వసుధార గురించి చెప్పాలంటే.. కొన్ని రోజులు కావాలండి.. అని గౌతమ్ మెలికల్ తిరుగుతాడు. రేయ్ తినరాఅని రిషి అంటే.. నువ్ ఉండరా.. చూడు పెదనాన్న.. వీడు ప్రతీసారి నా నోరు మూయిస్తాడు. అని గౌతమ్ అంటాడు.
చెప్పినా నువ్ ఆగవు కదా? అని మహేంద్ర సెటైర్ వేస్తాడు. ఎవరేం చెప్పినా మనం చేసేది చేయాలి.. అని గౌతమ్ అంటాడు. పండుగ రోజు ఇలా కొత్తబట్టలతో కనిపిస్తుంటే చూడటానికి చాలా బాగుంది.. అని ఫణీంద్ర అంటాడు. అవును పెదనాన్న నాక్కూడా.. ఒరేయ్ రిషి.. అందరిలోకెల్లా ఎవరిది డ్రెస్ బాగుందో చెప్పు.. అని గౌతమ్ అడుగుతాడు. ఏంట్రా నువ్ ఇదేం ప్రశ్న.. అందరవి బాగుంటాయ్ కదా? అని రిషి అంటాడు.
ఎవరిది ఎక్కువ బాగుందో చెప్పు.. నా మనసులో ఒకటి ఉంది.. నీది నాది జడ్జ్మెంట్ ఒకటో కాదో చూద్దాం. చెప్పు..అని గౌతమ్ అంటాడు. చెప్పు రిషి.. సరదాగా అడుగుతున్నాడు కదా? ఒక రకంగా సంక్రాంతి ఫ్యాషన్ కాంపిటేషన్ అనుకో అని మహేంద్ర అడుగుతాడు.. నా పేరు అయితే చెప్పడు అని జగతి.. నా పేరు చెబుతాడా? అని వసు లోలోపల అనుకుంటారు.
పెద్దమ్మే బాగుంది.. అని రిషి అంటాడు. థ్యాంక్యూ నాన్న.. ఎంత ప్రేమ ఉందో చూపించావ్.. థ్యాంక్యూ.. అని అంటుంది. ఈ అందరిలో ఒకరిది బాగా నచ్చింది.. ఎవరిదో చెబుతాను.. రిషి..నీ డ్రెస్సు మాత్రం బాగా నచ్చిందిరా.. సూపర్‌గా ఉందనుకో.. నిజానికి వసుది బాగుంది.. చెబితే తిడతావ్ అని చెప్పలేదు.. ఈ డ్రెసె సెలక్షన్ ఎవరిదిరా.. అని గౌతమ్ అనేస్తాడు.
అది జగతి సెలెక్షన్.. అని దేవయాణి చెప్పడంతో రిషికి కోపం వస్తుంది. కానీ వసుకి ఇచ్చిన మాట.. మీరు ఏ విషయంలోనూ కోపగించుకోవద్దు సర్.. ఎవరేం అన్నా. ఏం జరిగినా కోపం తెచ్చుకోవద్దు అని వసు చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటాడు. మేడం మీ సెలెక్షన్ సూపర్.. రిషికేనా? మాకు ఇవ్వరా?. అని గౌతమ్ అంటాడు. రేయ్ తిన్నాక ఈ డ్రెస్ నీకే ఇస్తాను.. అని రిషి అంటాడు. అదేం వద్దు ఇలాంటిది ఒకటి కొనివ్వు చాలు.. అని గౌతమ్ అంటాడు. రిషి సర్ ఏమీ అనలేదు.. కోప్పడతారేమో అనుకున్నా.. అని వసు రిషి ఏంటో ఈ రోజు కూల్‌గా కనిపిస్తున్నాడు..అని జగతి లోలోపల అనుకుంటారు.
హాల్‌లో ఫణీంద్ర, దేవయాణిలు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. కోపం పెంచుకుంటే పెరుగుతుంది.. తగ్గించుకుంటే తగ్గిపోతుంది.. అని ఫణీంద్ర అంటాడు. ఎంత చెప్పినా మారను. అని దేవయాణి రివర్స్‌లో అంటుంది. పైన జగతి మేడం, మహేంద్ర సర్ ఉన్నారంట..వీళ్ల ముందు నుంచి ఎందుకు వెనుక నుంచి వెళ్తాను.. అని వసు అనుకుంటుంది.
జగతి.. ఇలాంటి అందమైన సాయంత్రాలు వచ్చాయి వెళ్లాయి. కానీ ఇప్పుడు మనం కలిసి ఉన్నాం.. ఎంత బాగుందో తెలుసా? అని మహేంద్ర అంటాడు. ఇదొక అందమైన జ్ఞాపకంలా మిగిలిపోతుంది. నేను హాస్పిటల్‌కి వెళ్తేనే నువ్ వస్తావని తెలిస్తే.. ఎప్పుడో వెళ్లేవాడిని.. అని మహేంద్ర అంటాడు. నువ్ అలా అనకు..నేను రాకిపోయినా పర్లేదు నువ్ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అని జగతి అంటుంది.
ఏ దేవతలు దివించారో.. రిషి నిన్ను తీసుకొచ్చాడు అని మహేంద్ర.. నేను కూడా అదే అనుకున్నా.. ఇంత కన్నా ఎక్కువ కోరుకుంటే అత్యాశ అవుతుంది.. అక్కయ్య వచ్చినా వస్తుంది. పదా అని అక్కడి నుంచి వెళ్తుంటారు. ఇదే సమయంలో వసు వస్తుంది. ఆకాశ దీపం గురించి చెబుతుంది. మనసులో కోరిక కోరుకుని పైకి వదిలేస్తే చుక్కలు దీవిస్తాయట అని వసు అంటుంది.
కాలం ఏంటో స్పీడుగా వెళ్తోంది.. మెల్లిగా పోవచ్చు కదా?. అని మహేంద్ర జగతిలు చేతిలో చేయి వేసుకుని నడుచుకుంటూ వెళ్తారు. మన మనసుకి నచ్చినప్పుడు ఇలానే ఉంటుంది.. అని జగతి అంటుంది. మన ఇంట్లో ఓ కొత్తబ్బాయి గౌతమ్ ఉన్నట్టు మరిచిపోవద్దు.. ఇంటి పరువు తీసే పనులు చేయకు.. తగుదినమ్మా అన్నట్టు చిలకాగోరింకల్లా తిరగొద్దు.. చూడటానికేం బాగాలేదు.. అని దేవయాణి అంటుంది.
వదిన.. భయపడాల్సిన అవసరం లేదు.. రిషి మనసు బాధపడొద్దని మాత్రమే ఇలా ఉన్నాం.. అంతేకానీ ఎవరికో భయపడి కాదు.. గుడ్ నైట్ జగతి.. అని మహేంద్ర వెళ్లిపోతాడు. నువ్వైనా కాస్త అదుపులో ఉండాలి కదా? జగతి.. అని దేవయాణి అంటుంది. ఎవరి అదుపులో మీ అదుపులోనా? అని జగతి కౌంటర్ వేస్తుంది.. ఏదో గాలివాటున ఒక్క అవకాశం వచ్చింది.. అని దేవయాణి అంటుంది
అవకాశం, అదృష్టం కాదు.. ఇది నా హక్కు.. అని జగతి అంటుంది. హక్కుల దాకా వెళ్లావా? అని దేవయాణి అంటుంది. మహేంద్ర నా భర్త, తాళికట్టిన భర్త అని జగతి అంటుంది. ఆ మహేంద్ర సరిగ్గా లేకనే నీ ఆటలు సాగుతున్నాయ్.. నీ మాయలో పడ్డాడు..అని దేవయాణి చురకలు అంటిస్తుంది. మాయ కాదు బంధం.. అని జగతి, మాటలు బాగానే చెబుతావ్.. ఇదే అలుసుగా తీసుకుని మహేంద్ర గదిలోకి వెళ్లి..అంటూ దేవయాణి రెచ్చిపోతుంది.
అక్కయ్య.. అసభ్యంగా మాట్లాడకండి.. మీరు హద్దుల్లో ఉంటేనే మర్యాదగా ఉంటాను.. ఎదురించలేక కాదు.. ధైర్యం లేక కాదు.. రిషి మనసు బాధపడొద్దునే ఒకే ఒక్క కారణం.. అంతేకానీ చేతకాక కాదు.. అని జగతి వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో రిషి వస్తాడు. పెద్దమ్మ. అని పిలుస్తాడు. నా కొడుకు రమ్మంటేనే.. తీసుకొస్తేనే వచ్చాను.. మీ పెద్దమ్మకు నేను రావడం ఇష్టం లేదని చెప్పనా?.. అని భయపెడుతుంది జగతి. అలా మొత్తానికి ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో దేవయాణిని జగతి ఇరికిస్తుందేమో చూడాలి.