Site icon A2Z ADDA

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. కాలేజ్‌లో ఏకాంతంగా వసు, రిషి.. గౌతమ్‌కు అసలు విషయం అర్థమవుతుందా?

గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే సోమవారం నాడు జనవరి 17న ప్రసారం కానున్న Guppedantha Manasu Episode 349 ధారావాహికలో రిషి టాలెంట్ మరోసారి వసుకి తెలుస్తుంది. వేరే లోకంలోకి వెళ్లి రిషి పాటను ఆలపిస్తుంటాడు. అది మహేంద్ర, గౌతమ్,వసు వింటారు. ఇక మహేంద్ర, దేవయాణి మధ్య మరోమారు మాటల యుద్దం నడుస్తుంది. కాలేజ్‌లో ఏకాంతంగా వసు, రిషి మాట్లాడుకుంటూ ఉంటారు. అది గౌతమ్ చూసేట్టు కనిపిస్తోంది.

ప్రేమలేఖను చించిపాడేసి, జగతి అన్న మాటలును గుర్తు చేసుకుంటాడు గౌతమ్.. ప్రేమ లేఖ ఇచ్చి ఉంటే.. వేరే లెవెల్‌లో ఉండేది.. నన్ను నో అనడానికి పెద్ద కారణాలేం ఉంటాయి.. అని గౌతమ్ తన గురించి తాను కాస్త ఎక్స్ ట్రాగా ఊహించుకుంటాడు. ఈ రిషి గాడేం చేస్తున్నాడు.. ఎక్కడున్నాడు..అని గౌతమ్ అనుకుంటాడు. ప్రేమలేఖ రాసిన వాడిని చూడాలంటూ వసు అన్న మాటలను తలుచుకున్న రిషి.. మౌత్ ఆర్గాన్ ప్లే చేయాలని అనుకుంటాడు.. ఇది ఎందుకు డైరెక్ట్‌గా పాడలేనా? అంటూ ఒకప్పుడు వసు అన్న మాటలను గుర్తు చేసుకుంటాడు. మీరు పాటలు బాగా పాడతారు సర్ అని వసు ఇచ్చిన కాంప్లిమెంట్‌ను గుర్తు చేసుకుంటాడు. ఇక రిషి వేరే లోకంలోకి వెళ్లి పాట పాడేస్తాడు.

మరో వైపు వసు.. షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ మెయిల్ చేశాను.. సర్‌కి ఫోన్ చేయాలా వద్దా?.. చేస్తే మెయిల్ చేశావ్ కదా? ఎందుకు ఫోన్ చేశావ్ అని అంటాడు.. చెప్పకపోతే.. మెయిల్ చేశావ్.. ఫోన్ చేసి చెప్పే బాధ్యత లేదా? అని అంటాడు.. సరే ఏదైతే అది అవుతుంది.. ఫోన్ చేద్దామని వసు ఫోన్ చేస్తుంది. వసు ఫోన్‌ని చూసి కూడా రిషి లిఫ్ట్ చేయడు. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయలేదు.. అని మహేంద్ర సర్‌కు చేద్దాం.. అని వసు ఫోన్ చేస్తుంది. రిషి సర్‌తో మాట్లాడాలి.. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు సర్ అని అంటుంది. సరే నేను వెళ్ళి చూస్తాను.. అని అక్కడు వెళ్లే సరికి రిషి పాటలో లీనవుతాడు. జాను సినిమాలోని లైఫ్ ఆఫ్ రామ్ పాట పాడుతూ ఉంటాడు. కళ్లు మూసుకుని పాట పాడుతుండటంతో అక్కడికి గౌతమ్, మహేంద్ర వచ్చిన విషయాన్ని తెలుసుకోలేకపోతాడు. ఇక రిషి పాట పాడుతున్నాను అని వసు రికార్డ్ చేస్తుంటుంది.

సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు.. వాటిల్లోంచి మొదటి అక్షరాలను తీసుకుని.. సూచన.. అని పెట్టాను అంటూ మిషన్ ఎడ్యుకేషన్ షార్ట్ ఫిల్మ్ గురించి వసుకి జగతి చెబుతూ ఉంటుంది. అలా అందులో వసు నిమగ్నమవుతంది. అద్భుతంగా ఉందంటూ ప్రశంసిస్తుంటుంది. అలా బిజీగా ఉన్న వసు.. రిషి ఫోన్ చేసినా కూడా చూడదు. దీంతో రిషి మూడ్ మారుతుంది. ఎందుకు ఇలా లిఫ్ట్ చేయదు.. ఏమంత బిజీగా ఉందని అనుకుంటాడు. ఇంతలో గౌతమ్ కూడా వస్తాడు. వసు బొమ్మకు గుడ్ మార్నింగ్ చెబుతాడు. రిషి వెరైటీగా చూస్తాడు.

కాలేజ్‌లో నోటీస్ బోర్డ్ చూసి షార్ట్ ఫిల్మ్ గురించి పుష్ప, వసు మాట్లాడుకుంటారు. షార్ట్ ఫిల్మ్ సక్సెస్ అవుతుందని అనుకుంటున్నావా? అని పుష్ప అంటుంది. కచ్చితంగా సక్సెస్ అవుతుంది.. అని వసు అంటుంది. ఎందుకు రిషి సర్ ఉన్నాడనా? అని పుష్ప అంటే.. అలా అనేం కాదు. జగతి మేడం ఆలోచన ఉంది కదా?. తప్పకుండా సక్సెస్ అవుతుంది.. అని వసు అంటుంది. అంటే రిషి సర్‌ది ఏం లేదా అని పుష్ప అంటుంది. ఇదంతా కూడా రిషి వింటాడు. నా భాగస్వామ్యం లేదా?.. అని రిషి ప్రశ్నిస్తాడు. అది చెప్పబోతోంటేనే మీరు వచ్చారు.. అని వసు అంటుంది.

గుడ్ వర్క్.. మెయిల్ బాగుంది.. అని రిషి వెళ్తాడు. ఏంటి పుష్ప.. నేను అన్నప్పుడే వింటారు.. ఆలోచన జగతి మేడంది.. ఆచరణ రిషి సర్‌ది.. అని చెప్పేలోపే వెళ్లిపోయాడు అని వసు అనే మాటలను రిషి వింటాడు. ఇక ఇంట్లో గౌతమ్ కాఫీ తాగుతూ.. దేవయాణితో మాట్లాడుతుంటాడు. వీడేంటి ఇంత పొద్దున వెళ్లాడు పెద్దమ్మ అని అడుగుతాడు. ఇక దొరికిందే చాన్స్ అని దేవయాణి తెగ నటించేస్తుంది.

ఏం చేస్తున్నాడు.. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు.. బుద్దిగా ఉన్న రిషిని చాలా మంది చెడగొడుతున్నారు.. వేళాపాల లేకుండా కష్టపడుతున్నాడు.. అని దేవయాణి అంటుంది. అదే టైంకు మహేంద్ర ఎంట్రీ ఇస్తాడు. అలా కష్టపడుతున్నాడు కాబట్టే కాలేజ్‌కు అంత పేరు వచ్చింది వదిన..అని కౌంటర్ వేస్తుంది. అంతేలే.. వాడు ఒక్కడు కష్టపడుతుంటే.. అందరికీ పేరు వస్తుంది అని దేవయాణి సెటైర్ వేస్తుంది..

యుద్దం సైనికులు చేస్తారు.. కానీ పేరు రాజుకు వస్తుంది.. అలా అని రాజు కష్టపడడని కాదు.. రాజు కూడా కష్టపడతాడు.. అని మహేంద్ర చెబుతాడు. సూపర్ చెప్పారు అంకుల్.. థ్యాంక్యూ గౌతమ్.. అని మహేంద్ర అంటాడు. కరెక్టే కదా? పెద్దమ్మ.. సైనికులు కష్టపడతారు.. చచ్చిపోతారు. .కానీ గెలిచింది రాజు అని అంటారు అని గౌతమ్.. యా అని మహేంద్ర అంటాడు..

ఈ మధ్య నువ్ రిషిని పట్టించుకోవడం లేదు.. గాలికొదిలేశావ్.. అడిగితే తోచిన సమాధానాలు చెబుతావ్.. అని దేవయాణి అంటుంది. వదిన మీకు చాలా సార్లు చెప్పాను.. నా అంత ఎత్తు ఎదిగాడు.. సలహాలు ఇవ్వాలని అనుకుంటే.. మీరు ఇవ్వండి నేను కాదని అనడం లేదు కదా? నా మాటగా చెప్పు మహేంద్ర.. పెద్దమ్మను బాధపెట్టకు.. అని చెప్పు.. అని దేవయాణి అంటుంది. నువ్ ఇదే మాట రిషికి చెప్పు అని మహేంద్ర అంటే.. అర్థం చేసుకోవేంటి మహేంద్ర అని అంటుంది దేవయాణి..

చెప్పి మీరు బ్యాడ్ అవ్వకూడదని అనుకుంటున్నారు.. నాకు తెలుసు.. అని దేవయాణి గురించి మహేంద్ర అనుకుంటూ ఉంటాడు. నేను కాలేజ్‌కు వెళ్తున్నాను వస్తావా? గౌతమ్ అని అంటే.. వస్తాను ఒక్క నిమిషం అని లోపలకు వెళ్తాడు గౌతమ్… కొత్త మనుషులు ఉన్నారు అని చూడకుండా.. కనీసం తన ముందు గౌరవించాలనే స్పృహ కూడా లేదా? అని దేవయాణి అంటుంది. టాపిక్ మీరు తీశారు కదా?.. సమాధానం నేను చెప్పాను.. అని మహేంద్ర అంటాడు. నీకు అన్నీ తెలుసు మహేంద్ర.. కావాలనే ఇలా చేస్తున్నావ్ అని దేవయాణి అంటే.. పెద్ద నాగలి ఎటువైపు పోతే.. చిన్న నాగలి అటు వైపే వెళ్తుంది. నేను మిమ్మల్నే ఫాలో అవుతున్నాను.. అని మహేంద్ర కౌంటర్ వేస్తాడు. ఏంటో ఇవ్వాల అత్తయ్యకు చాలా పంచ్‌లు పడుతున్నాయి.. అని ధరణి లోలోపల నవ్వుకుంటుంది.

రిషి సర్ ఏం చేస్తున్నాడు అని వసు అనుకుంటూ ఉంటుంది. ఇంతలో వసుని చూస్తే అంత దూరంలో రిషి నిల్చుంటాడు. వసుధారని తక్కువ అంచనా వేశాడు.. తను సంథింగ్ స్పెషల్.. అని గౌతమ్ చేసిన చేష్టల గురించి రిషి అనుకుంటూఉంటాడు. మరో వైపు రిషి గురించి గౌతమ్ వెతుకుతూ ఉంటాడు. ఇక కనిపించకపోవడంతో ఫోన్ చేస్తాడు. రిషి ఫోన్ రింగ్ వినిపించడంతో వసు కూడా వెనక్కి తిరిగి చూస్తుంది. నా గురించి ఎక్కడా వెతక్కుండా కేబిన్‌లోనే కూర్చో అని రిషి అంటాడు. కానీ గౌతమ్ మాత్రం బయటకు వస్తాడు.

మీరు ఇక్కడే ఉన్నారా?.. మీరు ఎప్పుడు వచ్చారు సర్.. అని వసు లేవబోతోంది. పర్లేదు కూర్చో.. ఏదో చెబుతున్నావ్.. నీ ఫ్రెండ్ పుష్పతో అని రిషి ఆ టాపిక్ తీస్తాడు.. అదా సర్.. షార్ట్ ఫిల్మ్.. సక్సెస్ సాధించడంలో అని వసు చెప్పబోతోంటే.. అంతా మీ మేడం ప్రమేయం ఉంది నాది లేదంటావ్ అంతే కదా? అని రిషి అంటాడు. అలా ఎందుక సర్ ఎవరి గొప్పదనం వారిది సర్.. మీరు పాట పాడారు.. ఎంత గొప్పగా పాడారో తెలుసా..అని రికార్డ్ చేసిన పాటను వినిపించి.. జరిగిన విషయాన్ని చెబుతుంది. అలా ఎపిసోడ్ ముగుస్తుంది.

Exit mobile version