Site icon A2Z ADDA

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. గాల్లో తేలిపోయిన రిషి.. ఒక్కసారి చూడాలంటూ మనసువిప్పిన వసు

గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే బుధవారం నాటి Guppedantha Manasu Episode 345 ధారావాహికలో రిషి ఫుల్ ఖుషీ అయ్యాడు. వసు మనసు తెలుసుకుని సంతోషించాడు. తాను రాసిన లవ్ లెటర్ వసు మీద ఎంతటి ప్రభావాన్ని చూపించిందో రిషికి అర్థమైంది. మొత్తానికి గౌతమ్ చేసిన పనికి రిషికి ఇలా ప్లస్ అయింది. అలా గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ సాఫీగా సాగిపోయింది.

వసుకి రాసిన లవ్ లెటర్ గురించి జగతి మహేంద్రలు మాట్లాడుకుంటారు. వసుకి ఎవరో లవ్ లెటర్ రాశారు.. అని అసలు విషయాన్ని మహేంద్రకు జగతి చెబుతుంది. గ్రౌండ్‌లో జరిగింది అదేనా? అని మహేంద్ర అంటాడు. అది రిషిని బాధించి ఉంటుంది..అని జగతి అంటుంది. ఏమో మరి రిషి అయితే కాస్త కోపంగానే కనిపించాడు అని మహేంద్ర అంటాడు. వసుకి లవ్ లెటర్ రాసే అంత ధైర్యం ఎవరికి ఉంది.. అని మహేంద్ర అంటాడు. నేను ఇంత సీరియస్‌గా చెబుతుంది.. ధైర్యం ఎవరికి ఉంటుందని మాట్లాడతావేంటి అని జగతి అంటుంది. రిషి బాధపడి ఉంటాడేమో అని జగతి అంటే.. రిషికి ఎందుకు బాధపడతాడు.. అది తెలిస్తే రాసిని వాడకి ఉంటుంది బాధ అని మహేంద్ర అంటాడు..

రిషికి తెలియకుండా రిషి వెనకాల రిషికి నచ్చని పని జరుగుతుందనిపిస్తోంది. రిషి బాధపడకూడదు అని జగతి అంటుంది. రిషి మనసేంటో మనకు తెలుసు కదా? అని జగతి అంటుంది. మనకు తెలుసు. వాడికే తెలీదు అని మహేంద్ర కౌంటర్ వేస్తాడు.. ఈ రాసే లెటర్ ఏదో వాడే రాస్తే బాగుండేది.. అని మహేంద్ర అంటాడు. అది జరిగే పనా? అని జగతి అంటే.. జరిగితే బాగుండు అంటున్నా జగతి అని మహేంద్ర అంటాడు.. కానీ ఆ చేతిరాత ఎక్కడో చూసినట్టు అనిపించింది మహేంద్ర అని జగతికి అనుమానం వస్తుంది.. అంత మంది స్టూడెంట్స్‌వి చూసి ఉంటావ్ కదా?. అనిపించి ఉంటుందిలే.. ఈజీగా తీసుకో జగతి అని మహేంద్ర అంటాడు.. నేను రిషి గురించి ఆలోచిస్తున్నాను.. ఎలా ఫీల్ అయి ఉంటాడో..అని జగతి ఆలోచిస్తూ ఉంటుంది.

ఇక గౌతమ్ మీద సీన్ ఓపెన్ అవుతుంది. నేను ఒక ఫూల్‌ని.. ప్లాన్ వేస్ట్ అయింది అని తనలో తాను అనుకుంటూ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు గౌతమ్. ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావ్ అని దేవయాణి అడుగుతుంది. అది పెద్దమ్మ ఆత్మ విమర్శలాంటిది అని అంటాడు. రిషి ఎక్కడ? అని దేవయాణి అడుగుతుంది. ఏమో నాకు తెలీదు.. నన్ను మాత్రం పంపించాడు.. అనిచెబుతాడు. గౌతమ్.. నిన్ను ఒక మాట అడగాలి.. అని దేవయాణి ఆగిపోతుంది. చెప్పండి పెద్దమ్మ అని గౌతమ్ అంటాడు. ఇప్పుడు కాదులే.. సమయం వచ్చినప్పుడు అడుగుతాను అని అంటుంది. ఈ గౌతమ్‌ని వాడుకుని రిషి వసు మధ్య ఏం జరగుతుందో తెలుసుకోవచ్చా? కానీ ఈ విషయాలు రిషి వద్ద చెప్పడని ఎంత వరకు నమ్మొచ్చో అని దేవయాణి అనుకుంటూ ఉంటుంది. లవ్ లెటర్ ప్లాన్ వేస్ట్ అయింది.. కానీ వసుధారకు కోపం రాలేదని అర్థమైంది.. ఇది చాలు.. వసుధారకి ఫోన్ చేద్దామా? ఏం మాట్లాడాలో ముందే ఫిక్స్ అయి ఫోన్ చేయాలి..అని గౌతమ్ అనుకుంటాడు.

ఇక రిషి, వసులు ఒంటరిగా ఉంటారు. ఎందుకు రమ్మన్నావ్.. అని రిషి అడుగుతాడు. ఆ లవ్ లెటర్.. అని వసు అంటుంది. ఓరేయ్ గౌతమ్‌గా నన్ను ఇరికించేందుకే వచ్రావ్ రా అని రిషి లోలోపల అనుకుంటాడు.. లవ్ లెటర్ బాగా రాశారు కదా? సర్.. అని వసు అనడంతో ఏంటి అని రిషి ఆశ్చర్యపోతాడు.. ఒక్క పదం కూడా చెడుగా లేదు.. ఎంతో పద్దతిగా రాశారు..అని వసు అంటుంది. అంటే రాసినవాడు.. అదే ఆ లెటర్ ఇద్దామని అనుకున్నవాడి మీద కోపం రాలేదా?.. అని రిషి అడుగుతాడు. ఎందుకు సర్ ..ప్రతీది ఎందుకు నెగెటివ్‌గా చూడటం.. ఆ అక్షరాలు, మాటలు అవన్నీ ఏంటో.. నా జీవితాన్ని బాగా చూసిన వ్యక్తే రాసినట్టు అనిపించాయ్ సర్.. రాసింది ఎవరో తెలుసుకోవాలి సర్..అని వసు అంటుంది.

ఆ వ్యక్తి చూస్తే ఏం చేస్తావ్ ఏంటి.. అని రిషి అడుగుతాడు. చూడాలని ఉంది సర్.. అని వసు అంటుంది. ఎందుకో గానీ నాకు కోపం రావడం లేదు సర్.. ఏంటో నాకే అర్థం కావడం లేదు.. అని వసు అంటుంది. డైరెక్ట్‌గా ఇచ్చి ఉంటే ఒప్పుకునేదానివా? అని రిషి అడిగేస్తాడు. ఆ భాష, భావం నచ్చాయ్ సర్.. అంతే కానీ లెటర్ ఇవ్వగానే ఒప్పుకోవడం ఏంటి సర్.. అదేంటో గానీ నాకు బాగా నచ్చింది.. అందుకే రాసినవాళ్లెవరో ఒక్కసారి చూడాలని ఉంది సర్.. అని అంటుంది.

సరే సరే చూద్దాం.. దొరుకుతాడేమో అన్న నమ్మకం నాకైతే లేదు.. నీలో చాలా గొప్ప లక్షణాలున్నాయ్.. ఒకరు ఎవరో రాశారని కోప్పడకుండా.. రాసిన విధానం బాగుందని మెచ్చుకుంటున్నావ్.. అని వసుని ప్రశంసిస్తాడు రిషి. అన్నింటికి గొడవ పడాల్సిన అసరం ఏముంది. చిరు నవ్వుతో దాటేయొచ్చు కదా? అని వసు అంటుంది. ఆ తరువాత చాక్లెట్‌ను రిషి కాకి ఎంగిలి చేసి ఇస్తాడు. ఏంటి సార్ మీరు కాకి ఎంగిలి.. అని వసు అంటే.. తప్పదు కదా?. కలిసి తిరుగుతున్నాం కదా? ఆ మాత్రం అలవాట్లు రాకుండా ఉంటాయా? అని రిషి అనుకుంటాడు. ఇప్పుడు గౌతమ్ గాడిని తిట్టాలా. మెచ్చుకోవాల.. మొత్తానికి వసుకి నచ్చింది అది చాలు..అని రిషి సంబరపడిపోతాడు.

ఇక మరో వైపు రిషి ఎక్కడున్నాడు అంటూ మహేంద్ర ఆలోచిస్తాడు. ఇక కారులో వెళ్తోన్న వసు ముసిముసి నవ్వులు నవ్వుతుంది. అదేంటో చెబితే మేం కూడా నవ్వుతాం కదా? అని రిషి అంటాడు. మీకు నవ్వడం కూడా వచ్చా? అదెప్పుడు నేర్చుకున్నారో..అని వసు తన మనసులో అనుకుంటుంది. చాక్లెట్‌ని తెలుగులో ఏమంటారు? అని వసు అడుగుతుంది. నాకు తెలియదు అని రిషి అంటాడు.. నాకు కూడా సరిగ్గా తెలీదు..కానీ మిఠాయి అనొచ్చు సర్.. అని వసు అంటుంది.

కరెక్టే కావొచ్చు.. నాక్కూడా అనిపిస్తోంది.. ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయ్.. అని రిషి అడుగుతాడు. ఊరికే సర్.. కారులో కూర్చుని దిక్కలు చూసే బధులు ఇలా ఆలోచిస్తాను.. మిఠాయి పదం బాగుంది కదా?సర్.. అని వసు అంటుంది. అదే సమయంలో రిషికి మహేంద్ర నుంచి ఫోన్ వస్తుంది. ఎక్కడున్నావ్ అని మహేంద్ర అడుగుతాడు. వస్తున్నాను.. డ్రైవింగ్ చేస్తున్నాను డాడ్ అని పెట్టేస్తాడు. అడిగే టైం కూడా ఇవ్వడు.. అని మహేంద్ర అనుకుంటాడు. మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ కోసం స్లమ్ ఏరియాకు వెళ్లాలి.. షార్ట్ ఫిల్మ్ వర్క్ స్టార్ట్ అయితే బిజీ అయిపోతాం కదా?.. అని రిషి అంటాడు. ఇక కారు దిగి వెళ్తోన్న వసు కొంచెం దూరం వెళ్లి బాయ్ సర్ అని అంటుంది. దీంతో రిషి కూడా వెళ్లిపోతాడు. డోర్ కొట్టేలోపు జగతి వచ్చి తీస్తుంది.. మేడం.. అని వసు ఆశ్చర్యపోతుంది. లోపలకి రా వసు.. అని జగతి అంటుంది. వసు చిరునవ్వు నవ్విందంటే ఈ రోజు గొడవలేం లేవన్నమాట..అని జగతి అనుకుంటుంది.

ఇక కారులో వెళ్తోన్న రిషి ఫుల్ హ్యాపీగా ఉంటాడు. వసు మాటలను తలుచుకుంటూ సంబరపడతాడు. కారు ఆపి దిగుతాడు రిషి. రాసింది నేనే.. ఐయామ్ హ్యాపీ.. అని అరిచేస్తాడు. గౌతమ్ థ్యాంక్స్ రా..నువ్ వెదవ పని చేసినా కూడా నాకు ఇలా పనికొచ్చింది..అని అనుకుంటాడు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో వసుని పరుగులు పెట్టిస్తాడు రిషి. పది లెక్క పెట్టేలోపు రావాలని అంటాడు. ఇంటికి వచ్చిన వసుని చూసి దేవయాణి షాక్అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.

Exit mobile version