Site icon A2Z ADDA

Guppedantha Manasu : గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్.. శిరీష్ అవుట్ గౌతమ్ ఎంట్రీ.. రిషి-వసు మధ్య మళ్లీ దూరం!

గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు అంటే సోమవారం నాడు అంటే డిసెంబర్ 13న ప్రసారం కానున్న Guppedantha Manasu Episode 319 ధారవాహికలో రిషి అగ్ని పర్వతంలా బద్దలవుతాడు. దేవయాణి వేసిన ప్లాన్‌లో రిషి పావుగా మారిపోయాడు. వసు మీదకు అరిచేశాడు. జగతి అంటే ఇంకా కోపం పెరిగేలా చేసింది. చివరకు తండ్రిని కూడా దూరం పెట్టేందుకు సిద్దమయ్యాడు రిషి. మొత్తానికి రిషి వసు మధ్య మరోసారి దూరం పెరిగేట్టుంది. మొత్తానికి సోమవారం నాటి ఎపిసోడ్ ఎలా గడిచిందంటే..

రెస్టారెంట్‌కు వచ్చిన దేవయాణి మాస్టర్ ప్లాన్ వేసింది. మూడు కాఫీలు ఆర్డర్ చేయమంది. రిషి వచ్చే వరకు టైం పాస్ చేసింది దేవయాణి. నాకు బాగా కావాల్సిన వాళ్లు.. శ్రేయోభిలాషులు వచ్చారు.. స్ట్రాంగ్ కాఫీ తీసుకుని రా అని వసు ఆర్డర్ ఇస్తుంది. అవకావం వచ్చినా కూడా నువ్ విదేశాలకు ఎందుకు వెళ్లలేదు? అని వసుని దేవయాణి అడుగుతుంది. మరి మీరు కాలేజ్‌కి వెళ్లి పని చేయోచ్చు కదా? అని నేను అనడం లేదు కదా? ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వకండని వసు కౌంటర్ వేసింది.

పని పాట లేకుండా ఇలా కబుర్లు చెబుతున్నారేంటి? అని దేవయాణిని జగతి అడుగుతుంది. తప్పు గురించి చెబుతున్నాను అని దేవయాణి అంటే.. నువ్ తప్పొప్పుల గురించి మాట్లాడటం కంటే పెద్ద తప్పేమీ లేదు.. అని జగతి సెటైర్ వేస్తుంది. రిషి వచ్చే లోపు గేర్ పెంచాలి.. రెచ్చగొట్టాలి.. అని అనుకుంటుంది. ఇంతలో కాఫీ వస్తుంది. తాగండి.. ఇక్కడ కాఫీ బాగుంటుందని వసు చెబుతుంది.

కాఫీ బాగుంది.. వసుధార నిజం చెప్పింది.. నీక్కూడా కొన్ని నిజాలు చెప్పాలి.. నువ్, నీ శిష్యురాలు పద్దతులు మార్చుకోవాలి అని దేవయాణి అంటుంది.. మీరు మాకు జ్ఞాన బోధ చేయాలని వస్తే మాత్రం.. ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చు అని వసు మొహం మీదే చెబుతుంది.. మాటకి మాట చెబుతున్నావే.. నీ కన్నా జగతే నయం. తను ఇంకా నాకు భయపడుతుంది.. అని దేవయాణి అంటుంది.

అక్కయ్య మీరు ఏదో మనసులో పెట్టుకుని వచ్చారు జగతి అంటే.. చాలా దాచుకుని వచ్చాను.. నువ్, నీ శిష్యురాలు..రిషిని మీ వైపుకు తిప్పుకోవాలని చాలా చేస్తున్నారు.. అని దేవయాణి ఆరోపిస్తుంటుంది. రిషి సర్ కాలేజ్‌కి ఎండీ.. చిన్న పిల్లాడేం కాదు.. ఆయన్ను ఎవ్వరూ తిప్పుకోవాలని చూడటం లేదు.. అని వసు అంటుంది. రిషిది చిన్న పిల్లాడి మనస్తత్వం.. అని దేవయాణి అంటుంది.

అవును.. అదే నిజం అనుకోండి.. రిషి మేడం కొడుకే కదా? తిప్పుకుంటే తిప్పుకుంటారు.. దాంట్లో తప్పేముంది.. అని వసు ఫైర్ అవుతుంది. జగతి.. ఇది రెస్టారెంట్ కాబట్టి నోర్మూసుకున్నాను.. చిన్న మాట అన్నందుకు నీకు, నీ శిష్యురాలికి ఇంత కోపం వస్తుంటే.. వీటిని చూస్తే నాకు ఎంత కోపం రావాలి.. అని అర్దరాత్రి దిగిన సెల్ఫీ ఫోటోలను చూపించింది దేవయాణి.

ఫోటోలు మీ దగ్గరకు ఎలా వచ్చాయ్ అని వసు అంటే.. ఎలా వచ్చాయ్ అని కాదు.. ఎందుకు దిగారని అడుగుతున్నాను అని దేవయాణి ప్రశ్నిస్తుంది.. వయసు వచ్చిన కొడుకు మీదకు వసుని ఉసి గొల్పుతున్నావా?. చీ చీ.. అని దేవయాణి అసహ్యించుకుంటుంది. ఈ ఫోటోలు నాకే వచ్చాయని అనుకుంటున్నావా?.. ఎంత మందికి వెళ్లి ఉంటాయో.. ఏమనుకుంటారో చెప్పు.. ఏం జగతి.. మాట్లాడవేంటి.. ఈ ఫోటోలేనా? ఇంకేమైనా ఉన్నాయా? అని దేవయాణి రెచ్చిపోయింది.

ఈ ఫోటోల్లో ఏమున్నాయ్ అని.. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు అని వసు ప్రశ్నిస్తుంది. ఏం చేస్తావేంటి.. మా కుటుంబ పరువు బజారు కీడ్చుతున్నావా? ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేద్దామని అనుకుంటున్నావా? ఒక్కడే కొడుకు కదా? అని ఆస్తి కోసం వల విసురుతున్నారా? అని దేవయాణి రెచ్చిపోతుంది… మేడం మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు.. మర్యాదగా మాట్లాడండి.. అసలేం అనుకుంటున్నారు మీరు.. ఏం మాట్లాడుతున్నారు.. నా సంగతి మీకు తెలియదు మేడం.. నేను జగతి మేడంలా కాదు.. నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు.. అని వసు అంత ఎత్తుకు లేస్తుంది.

ఇవన్నీ కూడా రిషి చూస్తాడు. రిషి చూస్తున్నాడు కదా? అని దేవయాణి ఇంకా ఎక్స్ ట్రాలు చేసింది. బెదిరిస్తున్నావా? నన్ను.. అని దేవయాణి ప్లేటు ఫిరాయిస్తుంది. ఆగు వసు అని జగతి అంటుంటే.. మీరు ఉండండి మేడం.. ఏం మాట్లాడుతుంది.. బ్లాక్ మెయిల్ అంట.. ఆస్తులంట.. ఎలా కనిపిస్తున్నాం మనం అని వసు నిలదీస్తుంది. ఇంతలో వసు తనను తోసేసినట్టుగా నటించి దేవయాణి కింద పడుతుంది

పెద్దమ్మ కింద పడటంతో.. రిషి అగ్ని పర్వతంలా బద్దలవుతాడు. వసుధార.. అని అరిచేస్తాడు. లేవండి పెద్దమ్మ.. అని రిషి.. ఇక మొసలి కన్నీరు కారుస్తూ.. రిషి వీళ్లు అని అంటూ దేవయాణి నటించేస్తుంది.. వసుధార బుద్ది ఉందా నీకు. పెద్దమ్మ మీదకు వేలు చూపిస్తావా? కుర్చీ విసురుతావా? ఛీ ఛీ.. అని రిషి అసహ్యించుకుంటాడు. నన్ను చంపేస్తున్నారు రిషి.. కాలు విరిగిందేమో రిషి.. కుర్చీని మీదకు విసిరింది రిషి.. అని దేవయాణి మరింత నటించేస్తుంది.

నేను కుర్చీని విసరడం ఏంటి.. అని వసుధార అంటే.. షటప్ వసుధార.. మాట్లాడొద్దు అని అన్నానా? నా కళ్లతో నేను చూశాను.. నా చెవులతో నేను విన్నాను.. పెద్దమ్మ వయసుకన్నా గౌరవం ఇవ్వాలని తెలియదా? మీకు.. ఛీ ఛీ ఏం మనుషులో మీరు.. నీతులు చెబుతారు.. కొటేషన్స్ చెబుతారు.. ఇలాంటిదేదో జరుగుతుందనే ఇక్కడకు వచ్చాను.. అంటూ దేవయాణిని లేపేందుకు రిషి ప్రయత్నిస్తాడు. జగతి హెల్ప్ చేసేందుకు వస్తుంటే.. పెద్దమ్మని టచ్ చేయోద్దు.. దగ్గరుండి చేయించారు కదా? ఇదంతా అని రిషి ఫైర్ అవుతాడు..

జరిగిందేంటో తెలుసుకోకుండా అని వసు అనేలోపు.. షటప్ వసుధార అని మరింత రెచ్చిపోతాడు రిషి.. జస్ట్ షటప్.. ఇంకొంక మాట మాట్లాడినా.. అమ్మాయివని కూడా చూడను.. మా పెద్దమ్మని అలా చేస్తావా?.. పెద్దమ్మ మీద దాడి చేస్తున్నారు.. అని రిషి అంటాడు. దాడి ఏంటి సర్.. ఆవిడే వచ్చి మమ్మల్ని తిడుతుంటే.. అని జగతి అంటే.. మేడం మీ ఇద్దరిలో ఏ ఒక్కరు మాట్లాడినా మర్యాదగా ఉండదు.. అని రిషి హద్దులు దాటుతాడు.

ఇంతలో మహేంద్ర వస్తాడు. ఏం జరిగిందో తెలుసుకున్నావా? వాళ్లు ఎందుకు దాడి చేస్తారు? అని మహేంద్ర అనడంతో.. రిషి ఇంకా రెచ్చిపోతాడు. ఇంకొక్క మాట వాళ్లకు సపోర్ట్‌గా మాట్లాడినా కూడా? జీవితంలో మీతో ఇక నేను కూడా మాట్లాడను..అని రిషి అనడంతో మహేంద్ర షాక్ అవుతాడు. తమరు వాళ్ల పార్టీనే కదా? జరిగిందేంటో.. నా కళ్లారా చూశాను.. థ్యాంక్స్ వసుధార.. చాలా చాలా థ్యాంక్స్.. మా పెద్దమ్మ మీదకే వేలు చూపించావ్.. గాయపరిచావ్.. నాకు మంచి గిఫ్ట్ ఇచ్చావ్.. నువ్ కాకుల గుంపులో ఉన్న కోయిలమ్మ అనుకున్నాను.. నా అంచనా తప్పని నిరూపించావ్.. నువ్ ఒక ప్రత్యేకమైన దానివని అనుకున్నాను.. నువ్ కూడా మామూలు మనిషిలా బిహేవ్ చేశావ్.. అందరితో ఉంటూ అందరిలా మారిపోయావ్.. నీ అస్థిత్వాన్ని కోల్పోయావ్.. ఐ హేట్ యూ.. పదండి పెద్దమ్మ.. అని రిషి చెప్పి వెళ్లిపోతాడు

ఏంటి జగతి ఏంటిది.. ఏం జరిగింది.. అని మహేంద్ర అడుగుతాడు. ఇంతలో దేవయాణి కన్ను కొట్టేసి వెళ్లిపోతుంది. రిషి.. దెబ్బ బాగా తగిలినట్టుంది.. నొప్పి ఎక్కువగా ఉంది.. అని తెగ నటించేస్తుంది. పెద్దమ్మ కాసేపు ఓర్చుకోండి.. వాళ్ల దగ్గరికి ఎందుకు వెళ్లారు.. ఏదైనా ఉంటే నాకు చెప్పొచ్చు కదా?.. అని ప్రశ్నించాడు రిషి. ఇప్పుడేం చెప్పలేను.. అంటూ దాటేసింది దేవయాణి. నొప్పి బాగా ఉంది అని దేవయాణి నాటకాలు ఆడుతుంటుంది. కాసేపు ఓపిక పట్టండి.. పెద్దమ్మ అని రిషి బక్రా అవుతుంటాడు.

ఈ మాత్రం డోస్ ఇస్తేనే కానీ నుమ్ మారవు.. ఈ మధ్య నువ్ వాళ్ల వైపు మొగ్గుతున్నావ్.. అని దేవయాణి తన మనసులో తాను రిషి గురించి అనుకుంటుంది. ఏ తప్పు చేసినా క్షమిస్తానేమో గానీ.. పెద్దమ్మను బాధపెడితే క్షమించేది లేదు.. అని వసు గురించి లోలోపల అనుకుంటాడు రిషి. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో కొత్త కారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. గౌతమ్ అనే వ్యక్తి వసుకు పరిచయమవుతాడు. రోడ్డు మీద ఎవరికో యాక్సిడెంట్ అయితే.. వసు కాపాడే ప్రయత్నం చేస్తుంది. దానికి గౌతమ్ సాయపడుతాడు. వసు మీద ఇష్టం పెంచుకుంటాడు. అలా మొత్తానికి ఇప్పుడు శిరీష్ స్థానంలో గౌతమ్ వచ్చి.. మళ్లీ వసు, రిషిల మధ్య గ్యాప్ పెంచేస్తాడేమో. ఇక రిషికి పోటీగా గౌతమ్ వసుకి దగ్గరవుతాడేమో చూడాలి.

Exit mobile version