Site icon A2Z ADDA

Guppedantha Manasu : గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్.. అర్దరాత్రి వసుతో చాటింగ్.. నిద్రలేచిన రిషిలోని ఇగో

Guppedantha Manasu serial today Episode గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ అంటే.. Guppedantha Manasu Episode 316 నాటి ధారవాహికలో మంచి రొమాంటిక్ సీన్‌లు జరిగాయి. రోడ్డు మీద కారు ఆగడం, రిపేర్ కోసం సర్వీస్ సెంటర్‌కు ఫోన్ చేస్తాడు. వాళ్లు వచ్చే లోపు రిషి, వసు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. పాటలు వచ్చా? సర్.. అని వసు మొదలుపెడుతుంది. ఇక మరో వైపు దేవయాణి రిషి రాక కోసం ఎదురుచూస్తుటుంది. అలా గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ఎలా కొనసాగిందో చూద్దాం.

ఇలాంటి టైంలో పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు కదా? సర్ అని వసు అంటే.. ఇంకా నయం డ్యాన్స్ చేయమనలేదు అని రిషి కౌంటర్ వేస్తాడు. ఇంతలో ఎక్కడో డప్పుల మోత వినిపిస్తుంది.. సర్ అక్కడ సౌండ్స్ వినిపిస్తున్నాయ్ వెళ్దాం సర్ అని వసు అంటుంది. అక్కడ ఎవరున్నారో ఏంటో.. ఈ చీకట్లో వెళ్లడం అవసరమా? అని రిషి అంటాడు.

ఎందుకు సర్ అలా నెగెటివ్‌గా ఆలోచించడం.. వెళ్దాం పదండి అని రిషిని తీసుకెళ్తుంది వసు.. చలిమంట వేశారు సర్.. అని వసు అంటే.. అక్కడికి వెళ్లడం అవసరమా? అని రిషి అంటాడు. ఎటూ లేటు అవుతుంది.. చలిపెడుతుంది కదా?. వెళ్దాం సర్ అని వసు బతిమిలాడుతుంది.. ప్రతీదానికి సంతోషపడుతుంది, సంబరపడుతుంది.. ప్రతీ చిన్న మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తుంది.. అందుకే ఇలా హ్యాపీగా ఉంటుందని వసు గురించి లోలోపల అనుకుంటాడు రిషి.

బాబాయ్.. మా కారు చెడిపోయింది.. కాసేపు ఇక్కడ చలిమంట దగ్గర కూర్చొంటామని అక్కడి వాళ్లను వసు అడుగుతుంది.. గాలి, నీరు, అగ్గి ఇవి అందరివీ కూర్చోండి అని అంటాడు.. మీకు కూర్చోవడానికి ఇబ్బంది అవుతుంది.. నేను రాయి తీసుకొస్తాను అని వసు వెళ్లుంది. కానీ వాటిని వసు ఎత్తలేకపోతోంది. దీంతో రిషి వెళ్లి తనకు ఒకటి, వసుకి ఒక రాయిని తీసుకొస్తాడు.

చలిమంట బాగుంది కదా? సర్.. చిన్నప్పుడు మా ఊళ్లో అని వసు చెప్పడం మొదలుపెట్టేస్తుంది.. ఊరి సంగతులు ఆపు కాసేపు అని వసుపై రిషి కౌంటర్లు వేస్తాడు.. బాబాయ్ ఓ పాట పాడు వసు అని అంటుంది.. ఈ పాట ఎప్పుడూ మరిచిపోలేను బాబాయ్ అని వసు తెగ సంబరపడిపోతంది.. మా కారు రిపేర్ చేసేవారు వచ్చారట.. మేం వెళ్తామని వసు అంటుంది. ఇంతలో రిషి తన జేబులోంచి డబ్బులు తీసి వసుకి ఇస్తాడు. వాళ్లుక ఇమ్మని అంటాడు. వీళ్లకు మనం చేతులెత్తి దండం పెట్టగలం కానీ ఏమీ ఇవ్వలేం కదా?. అందుకే ఈ డబ్బులు.. అని రిషి అంటాడు. మీరు నిజంగా జెంటిల్మన్ సర్..అని వసు లోలోపల అనుకుంటుంది.

అలా అక్కడ సీన్ కట్ చేస్తే.. ఇంట్లో సోఫాలో దేవయాణి నిద్రపోతుంది. లేపాలా? వద్దా? అని మహేంద్ర ఆలోచించి వెళ్లిపోతాడు. మహేంద్ర వెళ్లే సమయంలోనే దేవయాణి నిద్ర లేస్తుంది. ఏంటి మహేంద్ర.. బయటకు వెళ్లావా? నువ్ ఎక్కడికి వెళ్లావ్ అని అడగను కానీ రిషి ఎక్కడున్నాడో తెలుసుకున్నావా? రిషి గురించి పట్టించుకున్నావా? అని దేవయాణి అంటుంది.

వస్తుంటాడు లే అని మహేంద్ర అంటాడు.. అది నాకు తెలుసు.. ఎవరితో వస్తుంటాడని అని దేవయాణి సెటైర్లు వేస్తుంది. మీ పెంపకం మీద మీకు నమ్మకం లేదేమో.. నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది.. ఎదురుచూస్తేనే ప్రేమ ఉన్నట్టు కాదు.. మీరు డిస్టర్బ్ అయినట్టున్నారు.. రిషిని మాత్రం డిస్టర్బ్ చేయకు.. అని చెప్పి వెళ్లిపోతాడు. నేను డిస్టర్బ్ అయితే ఎలా ఉంటుందో జగతికి ఆల్రెడీ తెలుసు.. జగతి, ఆ శిష్య పరమాణువును వదిలిపెట్టను.. నాక్కూడా నిద్ర పట్టేట్టు ఉంది.. అని దేవయాణి వెళ్లి నిద్రపోతుంది.

ఇక జగతి ఇంటి వద్ద వసుని డ్రాప్ చేస్తాడు రిషి. గుడ్ నైట్ సర్ అని వసు అంటే.. రిషి టైం చూస్తాడు. సారీ 12 దాటిపోయింది కదా?.. గుడ్ మార్నింగ్ సర్..అని వసు అంటుంది. ఇక వసు వెళ్తుంటే.. ఆగమని తాను కూడా వస్తానని అంటాడు. వసుధార ఆగు.. నేనూ వస్తాను.. అని కారు దిగుతాడు. ఇంటి డోర్‌ను కొడతారు. నీకు ఒక విషయం చెప్పాలి.. అది.. అని చెప్పే లోపే జగతి డోర్ తీస్తుంది. కొంచెం లేట్ అయింది మేడం.. ఈ విషయం చెప్పడానికే నేను ఆగాను అని చెప్పి రిషి వెళ్లిపోతాడు..

వసు.. బయట చలిగా ఉంది.. కాఫీ తాగమని చెప్పు అని జగతి అంటుంది..కాఫీ తాగే టైం, అడిగే టైం కాదని చెప్పు వసుధార అని రిషి వెళ్లిపోతాడు.. ఏదో చెప్పాలని అన్నారు.. చెప్పకుండానే వెళ్లిపోయారు అని వసు లోలోపల అనుకుంటుంది. లోపలకి వెళ్దామా? వసు అని జగతి సెటైర్ వేస్తుంది. వెళ్దాం మేడం అని లోపలకు వెళ్తుంది వసు. అలా అక్కడ సీన్ కట్ చేస్తే సోఫాలో మహేంద్ర పడుకుని ఉంటాడు.

అది చూసిన రిషి.. అయ్యో డాడ్ నాకోసం ఎదురుచూసి ఇక్కడే పడుకున్నారా? అని అనుకుంటాడు.. డాడ్ లేవండి.. నా కోసం హాల్‌లో వెయిట్ చేయాలా? నేను వస్తాను కదా?. బెడ్రూంలో పడుకునేవ్ లే.. డాడ్ రండి.. అని మహేంద్రను తీసుకెళ్తాడు రిషి. ఎందుకు లేటుగా వచ్చావ్ అని అడగను..ఎన్ని జ్ఞాపకాలు మూట కట్టుకుని వచ్చావా? అని ఆలోచిస్తున్నాను.. అంటూ మహేంద్ర తనలో తాను అనుకుంటాడు.

నీతో ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను అని రిషి అన్న మాటలను వసు గుర్తుకు చేసుకుంటుంది.. రోజంతా నాతోనే ఉన్నారు.. అప్పుడు చెప్పలేదు.. రిషి సర్‌కు ఫోన్ చేయాలా?.. ఏం చేస్తుంటారు ఇప్పుడు.. అని వసు అనుకుంటూ ఉంటుంది. అక్కడ మన రిషి కూడా వసు ఆలోచనల్లోనే ఉంటాడు. వసుతో ఉంటే ఎన్ని జ్ఞాపకాలు పోగవుతుంటాయో అని ఆలోచిస్తూ వసుకు మెసెజ్ పెడతాడు..

నువ్ నా అసిస్టెంట్, ప్రాజెక్ట్ లీడర్‌గా ప్రమోషన్ ఇచ్చాను అని రిషి మెసెజ్ పంపుతాడు.. అవును సర్ అయితే అని వసు నార్మల్‌గా పంపుతుంది. కానీ రిషి మాత్రం వేరేలా తీసుకుంటాడు. అయితే? ఇప్పుడేంటి? అంటోందా? అని రిషికి ఇగో లేస్తుంది. నీకు ఓ విషయం చెప్పాలని అన్నాను.. అడగవా? గుర్తు చేయవా? అని మరో మెసెజ్ పెట్టాడు రిషి. ఆ మెసెజ్ చూసిన వసు.. ఇది మరి బాగుందని ఆశ్చర్యపోతుంది.

ఇప్పుడు ఏం అంటే.. ఏం అంటారో..అయ్యో మరిచిపోయాను సర్.. ఏంటి సర్ అది.. అని ఇంకో మెసెజ్ పెడుతుంది. మరిచిపోయావా?. అలా ఎలా మరిచిపోయావ్.. అంటే నేనే గుర్తు చేయాలా? నేనే చెప్పాలా? నీకు అని అడుగుతాడు రిషి.. సర్ ఏం చెప్పాలనుకున్నారో ఇప్పుడు చెప్పండి అని వసు పాయింట్‌కు వస్తుంది.. అదేంటో వసుధార నేను కూడా మరిచిపోయాను. గుర్తుకు వచ్చినప్పుడు చెబుతాను.. అని రిషి కౌంటర్ వేస్తాడు. మరిచిపోయారా? ఏం లేదు.. ఇగో సర్.. మీ ఇంటి పేరు ఇగో అని వసు అనుకుంటుంది.. సర్ ఇంకేంటి విశేషాలు.. అంటూ ఇలా చాటింగ్ నడుస్తుంది. ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో దేవయాణి నేరుగా జగతి ఇంటికి వెళ్తుంది. రిషి ముందే వసును ప్రశ్నిస్తుంది. అర్దరాత్రి వరకు ఏం చేశారని అంటుంది. దీంతో రిషి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

Exit mobile version