గుప్పెడంత సీరియల్ ఇప్పుడు సాఫీగా సాగుతోంది. రిషి కాస్త ప్రశాంతంగా ఉంటున్నాడు. వసు కూడా ఏ బాధ లేకుండా హాయిగానే ఉంది. ప్రస్తుతం ఎగ్జామ్స్ వాతావరణం సీరియల్‌లో కనిపిస్తుంది. ఎగ్జామ్‌కు వెళ్తున్న వసుకు రిషి పెన్ గిఫ్ట్‌గా ఇచ్చేందుకు ప్రయత్నిస్తాడు. అలా మొత్తానికి బుధవారం నాటి ఎపిసోడ్‌లో పరీక్షల సీన్, వసు రిషిల ముచ్చట్లు హైలెట్ అయ్యేట్టు కనిపిస్తోంది. బుధవారం నాడు అంటే ఎపిసోడ్ నంబర్ 303లో ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.
మంగళ వారం ధరణి, మహేంద్రలు మాట్లాడుకునే చోట ఎపిసోడ్ పూర్తవుతుంది. దేవయాణి చేస్తున్న కుట్రలను ఓపిక పడుతున్నాను అని మహేంద్ర అంటాడు. వదిన ఏదైతే జరుగుతుందని భయపడుతుందో.. అది కచ్చితంగా జరుగుతుందని ఆశిస్తున్నాను అని మహేంద్ర అంటాడు.. ధరణి నీకో గుడ్ న్యూస్ చెప్పాలా? అని మహేంద్ర అంటాడు. చెప్పండి మావయ్య గారు అని ధరణి అడుగుతుంది. రిషి వాళ్ల అమ్మ ఇంట్లో భోజనం చేశాడట.. అని మహేంద్ర అంటాడు. నిజమా? మావయ్య గారు.. అని ధరణి తెగ సంతోష పడుతుంది. ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు అని మహేంద్ర వెళ్లిపోతాడు..
రిషి రూంలోకి వెళ్లిన మహేంద్ర.. కొడుకు పడుకోవడం చూసి దుప్పటి కప్పేస్తాడు. ఒరేయ్ నాన్న.. నీ మనసు చెప్పినట్టు వినరా.. ఆ మాటలు బయటకు చెప్పరా? ఇంకెన్నాళ్లు.. లవ్యూ రిషి.. అని వెళ్లిపోతుండగా.. మహేంద్ర చేయిని రిషి పట్టుకుంటాడు. మిస్టర్ రిషి.. నిద్రపోలేదా?.. అని మహేంద్ర అడుగుతాడు. వచ్చారు.. నిద్రచెడగొట్టారు.. మళ్లీ నిద్ర పోలేదా?.. అని అంటున్నారు అంటూ రిషి సెటైర్ వేస్తాడు.. నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను.. అంటూ మహేంద్ర చెబుతాడు.
కబుర్లు చెప్పడానికా? కంప్లైంట్స్ చెప్పడానికా? అని రిషి అంటే.. మాట్లాడటానికి వచ్చాను అని మహేంద్ర సెటైర్ వేస్తాడు.. కుశల ప్రశ్నలు వేస్తారు.. ఆ తరువాత సలహాలు, సూచనలు ఎలాగూ చెబుతారు కదా? ముందు అవే చెప్పేయండి.. అని రిషి కౌంటర్ వేస్తాడు. అంటే నేరుగా పాయింట్‌కు వచ్చేయమంటావ్ అని చెబుతున్నావ్ అంతేగా? అని మహేంద్ర అంటాడు.. నువ్ ఎక్కడికి వెళ్లావో నాకు తెలుసు.. జగతి ఇంట్లో భోజనం బాగుందా? అని మహేంద్ర అడగడంతో.. పప్పు చాలా బాగుంది వసు అని ఆమెతో చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటాడు రిషి..
ఆకలి వేస్తే ఏదైనా రుచిగానే ఉంటుందిని మీకు తెలుసు.. కదా? అని రిషి బదులిస్తాడు. అవునవును ఆకలికి రుచి ఉండదట.. అని మహేంద్ర కౌంటర్ వేస్తాడు. వసుకు ఎలా ఉందో చూద్దామని వెళ్లాను. ఆకలి వేసింది తిన్నాను.. అందులో ఏముంది.. అని రిషి అంటాడు. నువ్ ఇంత గట్టిగా అడిగితే ఏముంది.. ఏమీ లేదు అని మహేంద్ర అంటాడు. ఈ వసుకు ఏం పని లేదు.. అన్నీ చెప్పేయడమేనా? వ్యక్తిగతం అనుకోదా? అని రిషి అనుకున్నాడు.
ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?.. అని మహేంద్రను రిషి అడుగుతాడు. వసుధార వర్షంలో తడిస్తే తీసుకొచ్చావ్.. కదా? ఇలా ఎంత మంది స్టూడెంట్స్‌ను రక్షించి తీసుకెళ్తావ్ రిషి అని అసలు విషయాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తాడు.. అవసరమైతే ఎవరినైనా, ఎంత మందినైనా తీసుకెళ్తాను.. అని రిషి అంటాడు. ఇలా రెండు చేతులతో తీసుకెళ్తావ్ అన్నమాట.. అని మహేంద్ర అంటాడు. దీన్నీ మీరేందుకు పెద్ద టాపిక్ చేస్తున్నారు.. మొండిగా తడిసింది.. నేను తీసుకొచ్చాను.. అని రిషి అంటాడు.
నేను రిషి గ్రేట్ అంటున్నాను అని మహేంద్ర బదులిస్తాడు.. మనసులో ప్రేమను ఎప్పుడు బయటపెడతావ్ రా అని లోలోపల అనుకుంటాడు మహేంద్ర..ఈ పొగరు అని రిషి ఫోన్ లాక్కొని ఏదో చెప్ప బోతాడు మహేంద్ర. పొగరు ఏంటి? అని రిషి అంటాడు..నగర పౌరుల్లో పొగరు శాతం పెరిగిందట అని టాపిక్ డైవర్ట్ చేస్తాడు మహేంద్ర.. పొగరు అన్న పేరు తెలిసి ఉంటుందా?.. తెలిసి ఉండదులే అని లోలోపల రిషి అనుకుని.. గుడ్ నైట్..అని చెప్పేస్తాడు. అదేంటి సడెన్‌గా అని మహేంద్ర అంటే.. సడెన్‌గా నిద్ర వస్తుందన్న మాట అని రిషి సెటైర్ వేస్తాడు.
ఆ తరువాత ఒంటరిగా రిషి తన ఊహల్లోకి వెళ్తాడు. ఈ పొగరుకు ఎన్ని సార్లు చెప్పినా అర్థం కావడం లేదు అని అనుకుంటాడు. భోజనం చేస్తే చెప్పేయడమేనా? అని కసురుకుంటాడు.. నీ పరిచయమే జ్ఞాపకాల సునామీ.. ఎన్ని జ్ఞాపకాలు.. అని వసుతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటాడు. ఈ పొగరు ఏం చేస్తుంటుంది ఇప్పుడు అని వసుకు మెసెజ్ పెడతాడు. ఏం చేస్తున్నావ్ అని రిషి అంటే.. చదువుకుంటున్నాను సర్ అని వసు అంటుంది. గుడ్ బాగా చదవుకో గుడ్ నైట్ అని రిషి రిప్లై ఇస్తాడు. అది చూసి.. ఈ మాత్రం చెప్పడానికి మెసెజ్ ఎందుకో అని వసు అనుకుంటుంది.
ఇక సీన్ ఓపెన్ చేస్తే కాలేజ్‌లో పరీక్షల హడావిడి కనిపిస్తోంది. ఎగ్జామ్‌కు టైం అవుతోంది.. ఆల్ ది బెస్ట్ టు డీబీఎస్‌టీ..అంటూ ప్రశ్నా పత్రాలను జగతి మేడం చేతుల మీదుగా ఓపెన్ చేయిస్తారు. వసు కూడా చదువుకుంటూ అలా ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్లబోయింది. చూసుకోకుండా గోడను గుద్దేయబోతోంటే.. రిషి ఆపేస్తాడు. ఏంటి ఏంటి ఎగ్జామ్స్ మొదలవ్వక ముందే.. టెన్షన్ మొదలైందా?. రాత్రంగా మెల్కున్నట్టున్నావ్.. రాత్రంతా చదివితే సరిపోతోందా? అని రిషి అంటాడు.
కాలేజ్ గోడలను బద్దలు కొట్టే ప్రయత్నంలో ఉన్నావ్ కదా? అని రిషి అంటాడు. కళ్లు కాస్త మూసుకుపోతోన్నట్టున్నా.. చదువుకునే హడావిడిలో అలా అంటూ వసు ఏదో చెప్పబోయింది.. కాలేజ్ టాపర్‌వి అంచనాలకు మించి లక్ష్యాలను అందుకోవాలి.. టెన్షన్ పడకు.. ఒక్క ప్రశ్నకు సమాధానం రాకపోయినా.. టెన్షన్ పడతారు.. నువ్ బాగా రాయాలి.. అని రిషి అంటాడు. థ్యాంక్యూ సర్ అంటూ వెళ్లబోయింది. నేను చెప్పడం ఇంకా పూర్తి కాలేదు.. అంటూ జేబులోంచి పెన్ తీసి ఇస్తాడు. నేను ఇంటి నుంచి పెన్నులు తెచ్చుకున్నాను సర్ అని వసు అంటుంది. నువ్ పెన్ను తెచ్చుకోలేదనో.. కొనుక్కోలేదనో తేలేదు.. అయినా నీకు బరువు అవుతుందనుకుంటే వద్దుల్లే అని చేతిలో పట్టుకుంటాడు. వెంటనే వసు లాక్కుంటుంది. థ్యాంక్యూ సర్ అని వసు వెళ్లిపోతోంది. వసు ఆల్ ది బెస్ట్ అని రిషి అంటే.. థ్యాంక్యూ సర్ అని వసు అంటుంది.
ఎగ్జామ్ ఏర్పాట్లు గురించి ధర్మేంద్ర.. జగతి, మహేంద్రలను అడుగుతాడు. అంతా ఓకేనా? అని ధర్మేంద్ర అడుగుతాడు. అన్నీ అరేంజ్ చేశామని అంటారు.. పెదనాన్న అన్నీ సక్రమంగా ఉన్నట్టే కదా? అని రిషి అడుగుతాడు.. అంతా ఓకే మేం చూసుకుంటున్నామని చెప్పడంతో రిషి వెళ్లిపోతాడు. మీరు రూం విజిట్స్ చేయండి.. మీరు ఆ పనులో ఉండండి.. అని మహేంద్ర, జగతిలకు ధర్మేంద్ర చెబుతాడు. ఇక ఎగ్జామ్ హాల్‌లో వసును చూసేందుకు రిషి వెళ్తాడు. ఎగ్జామ్ పూర్తవుతుంది. బయటకు వచ్చిన వసుని రిషి చూస్తాడు. మొహం చూస్తే ఎగ్జామ్ బాగా రాసినట్టుంది.. అని అనుకుంటాడు. పుష్పతో వసు నవ్వుతూ మాట్లాడుకుంటూ బయటకు వస్తుంది. అంతలోనే రిషి హారన్ కొట్టేస్తాడు.. నన్ను రిషి సర్ పిలుస్తున్నారు. నువ్ వెళ్లు పుష్ప అని అంటుంది. ఇద్దరం పక్కనే ఉన్నాం.. నిన్ను ఎప్పుడు పిలిచారు.. అని పుష్ప అడుగుతుంది.. అవన్నీ నీకు తరువాత చెబుతాను.. వెళ్లు పుష్ప అని అంటుంది. ఆ తరువాత రిషి కారు వద్దకు వసు వెళ్తుంది. లోపలకు ఎక్కి కూర్చుంటుంది.. ఎగ్జామ్ ఎలా రాశావ్ అని రిషి అడిగితే.. బాగానే రాశాను సర్ అని వసు సమాధానం చెబుతుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో ఈ ఇద్దరూ కలిసి జాలీగా తిరిగేట్టు కనిపిస్తోంది. అలా రిషి సిగ్నల్స్‌ను అర్థం చేసుకునే వసు.. మనసు భాషను ఎప్పుడు అర్థం చేసుకుంటుందో చూడాలి.