Site icon A2Z ADDA

Guppedantha Manasu : మహేంద్ర నాటకాలు తెలియక ఉడికిపోయాడు.. పాపం రిషి పరిస్థితి దారుణం

Guppedantha Manasu 27th october 2021 Episode 279

Guppedantha Manasu 27th october 2021 Episode 279

Guppedantha Manasu మనసులో ప్రేమ ఉన్నా కూడా బయటకు చెప్పేందుకు ఈగో అడ్డు రావడం, ప్రేమించిన అమ్మాయి ఎదురుగా ఉండీ కూడా చెప్పలేక ఆగిపోవడం, తెలియని ఫీలింగ్ అడ్డు రావడం ఒకెత్తు అయితే.. మనకు నచ్చిన అమ్మాయి వేరే అబ్బాయితో ఇంకాస్త చనువుగా ఉండటం తట్టుకోలేని బాధను ఇస్తుంటుంది. సరిగ్గా ఇదే పాయింట్లతో ఇప్పుడు గుప్పెడంత మనసు సీరియల్ దూసుకుపోతోంది.

ఇక బుధవారం నాడు అంటే నేడు (అక్టోబర్ 27) ఈ సీరియల్ సారాంశం ఏంటో ఓ సారి చూద్దాం. తండ్రి మహేంద్ర వేసిన పాచికలకు కొడుకు రిషి బలయ్యాడు. అసలే ఒళ్లంతా ఇగోతో రక్తం ఉడికిపోతోంది. ఓవైపు వసు అంటే ప్రేమ ఉన్నా కూడా బయటపెట్టలేడు. ఇంతలో ఫ్రెండ్ అంటూ ఎస్సై శిరీష్ రావడం, వసుతో మరింత చనువుగా ఉండటంతో రిషి తట్టుకోలేకపోతాడు.

కొడుకు బాధను, ప్రేమను అర్థం చేసుకున్న మహేంద్ర ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తున్నాడు. కొడుకు మనసులోపల ఉన్న ప్రేమను బయటపెట్టేందుకు నానా రకాలుగా ట్రే చేస్తున్నాడు. ఈ క్రమంలో నేటి ఎపిసోడ్‌లో మహేంద్ర మంచిప్లాన్ వేస్తాడు. తనను చూడటానికి ఇంటికి వచ్చిన వసుతో మహేంద్ర కావాలనే ఓ టాపిక్ తీస్తాడు. తన కొడుకు వచ్చాడు.. వింటున్నాడు అని తెలిసే నిశ్చితార్థం టాపిక్ తీస్తాడు.

నిశ్చితార్థం విషయం ఎవ్వరికీ చెప్పకు అని వసుతో మహేంద్ర చెబుతాడు రిషికి వినపడేలా. అది విన్న రిషి.. వెంటనే శిరీష్‌కు ఫోన్ చేస్తాడు. ఏంటి నిశ్చితార్థం అంట కదా? అని సెటైర్ వేసినట్టుగా రిషి అడుగుతాడు. అంతా అయ్యాక చెబుదామని అనుకున్నాను సర్.. ఈలోపు మా వసు చెప్పేసిందా? చిన్నప్పటి నుంచి అంతే సర్ అంటూ పురాణం మొదలుపెట్టడంతో రిషికి మండుతుంది. వెంటనే ఫోన్ పెట్టేస్తాడు

ఇక కట్ చేస్తే కాలేజ్‌లో సీన్. వసు తన ఫ్రెండ్ కలిసి అలా వెళ్తుంటే.. రిషి కారును ఆపుతాడు. పక్క నుంచి నడవొచ్చు కదా? అని చిరాగ్గా చెప్పి వెళ్తాడు. అదేంటో మనం పక్క నుంచే వెళ్తుంటే అలా అంటారేంటి? అని రిషి గురించి తన ఫ్రెండ్ వసుతో అంటుంది. ఎక్కడి కోపాన్నో ఇక్కడ చూపిస్తున్నాడు లేవో అని సర్దిచెప్పేస్తుంది.

ఏం మాట్లాడుకుంటున్నారు? అని కోపంగా చిరగ్గా అడుగుతాడు రిషి. పెళ్లి, ప్రేమల గురించేనా? అని అంటాడు. ఆ సమయంలో జగతి మేడం రావడంతో ఈ కోపాన్ని ఆమె కూడా తీస్తాడు. మీ స్టూడెంట్లకు చెప్పండి.. మీ బాధ్యత కదా.. ప్రేమ, పెళ్లిళ్లు అని మాట్లాడుకుంటున్నారు అని జగతి మీద రిషి కోపాన్ని ప్రదర్శించాడు. మొత్తానికి రిషి మాత్రం తనలోని ప్రేమను దాచుకుని ఇలా పైకి మాత్రం కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇక రేపు ఏం జరుగుతుందో చూడాలి.

Exit mobile version