Site icon A2Z ADDA

Sekhar Master: శేఖర్ మాస్టర్ కూతురు నిక్ నేమ్ ఇదేనట.. ఆన్ లైన్‌లో సాహితి ఆటలు

Sekhar Master daughter Sahithi Nickname

Sekhar Master శేఖర్ మాస్టర్ బుల్లితెరపై ఎంతటి ఆదరణను దక్కించుకున్నాడో అందరికీ తెలిసిందే. శేఖర్ మాస్టర్ మాత్రమే కాకుండా తన పిల్లలను కూడా బుల్లితెరపైకి తీసుకొచ్చాడు. ఎన్నెన్నో ఈవెంట్లో తన కొడుకు విన్ని, కూతురు సాహితీని తీసుకొచ్చాడు. శేఖర్ మాస్టర్ వారసత్వాన్ని నిలబెట్టేలా డ్యాన్సుల్లో ఇరగ్గొట్టేస్తుంటారు. విన్ని, సాహితీ డ్యాన్సులకు అందరూ ఫిదా అవుతుంటారు. మరీ ముఖ్యంగా సాహితీ వేసే స్టెప్పులు మామూలుగా ఉండవు..

ఆ మధ్య సారంగ దరియా అంటూ సాహితి వేసిన స్టెప్పులు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.తన తండ్రి కంపోజ్ చేసిన ఆ పాటలో అచ్చం సాయి పల్లవిలా స్టెప్పులు వేసింది సాహితి. జీ తెలుగు ఈవెంట్‌లో సాహితీ సారంగదరియా స్టెప్పులు వేసింది. మొన్నా మధ్య ఆహా కంటెస్టెంట్ కోసం సారంగ దరియా స్టెప్పులను సాహితీ వేసింది. శేఖర్ స్టూడియో అనే యూట్యూబ్ చానెల్‌లో సాహితి, విన్ని రచ్చ రచ్చ చేస్తుంటారు.

 

తాజాగా సాహితి ఆన్ లైన్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఆట ఆడింది. నా గురించి ఎవరికి ఎక్కువగా తెలుసు? అనే ఆటను ఆడింది. ఈ ఆటలో భాగంగా తన ఫ్రెండ్స్, తన తమ్ముడిని జూమ్ కాల్‌లో కలిపింది. అందరినీ తనకు సంబంధించిన ప్రశ్నలను అడిగింది. అందులో ఎవరు ఎక్కువ ప్రశ్నలకు సరైన సమాధానం చెబుతారో చూద్దామని చెప్పింది.

ఇక తనకు ఇష్టమైన ఫుడ్, భవిష్యత్తులో తన ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఇలాంటి ప్రశ్నలను సంధించింది. ఇందులో భాగంగా తన నిక్ నేమ్ ఏంటి? అని అందరినీ ప్రశ్నించింది. అమ్ము అని విని చెప్పాడు.సాహులు అని కూడా చెప్పాడు. ఇంకొంత మంది సాహులు అని అన్నారు. అవి రెండూ రైటే.. ఇంట్లో వాళ్లు ఎక్కువగా అమ్ము అని అంటారు. సాహులు కూడా నా నిక్ నేమ్ అని చెప్పేసింది.

Exit mobile version