Site icon A2Z ADDA

Anasuya-Hyper Aadi: అనసూయతో హైపర్ ఆది లిప్ లాక్.. రోజా దారుణమైన కామెంట్లు

Anasuya-Hyper Aadi జబర్దస్త్ స్టేజ్ మీద అనసూయతో ఆది చేసే రొమాన్స్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఆ రొమాన్స్ అనేది మాటల వరకే ఉంటుంది. చేతల వరకు వెళ్లలేదు. అప్పుడప్పుడు హగ్గులు అని అడుగుతాడు. కలిసి డ్యాన్సులు కూడా చేసేవారు. కానీ ఇప్పుడు అవన్నీ ఏమీ ఉండటం లేదు. ఆ ఇద్దరూ వాటికి దూరంగా ఉంటున్నారు. కానీ మాటలు మాత్రం ఇంకాస్త హద్దులు దాటుతున్నాయి.

తాజాగా అనసూయను తన స్కిట్లో వాడేశాడు ఆది. అనసూయ ఇన్వాల్వ్ అవ్వని ఆది స్కిట్ దాదాపుగా ఉండదు. ప్రతీ సారి ఏదోలా అనసూయ తన స్కిట్లో ఇన్వాల్వ్ చేస్తుంటాడు. ఈ సారి అనసూయను పక్కన పెట్టుకున్న ఆది.. పుష్ప రాజ్ లెవెల్‌లో ఫీలయ్యాడు. మాటే బంగారామాయేనా? శ్రీవల్లి అంటూ బన్నీ స్టైల్లో ఆది స్టెప్పులు వేసేశాడు.

ఆయన చేస్తే వెల్డన్ అనేలా ఉంది..నేను చేస్తే వెల్డింగ్ చేసే వాడిలా ఉంది అంటూ తన మీద తానే సెటైర్ వేసుకున్నాడు. స్కిట్లో భాగంగా అనసూయ ఓ డైలాగ్ వేస్తుంది. నా చెల్లెళ్లు టచ్ చేయాలంటే ముందు నన్ను చేయాలి అంటూ అనసూయ వీరావేశంలో డైలాగ్ చెబుతుంది. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నా అంటూ ఆది తనలోని కోరికను బయటపెట్టేస్తాడు.

Jabardasth Latest Promo - 2nd December 2021 - Anasuya, Hyper Aadi - Mallemalatv

ఇక అనసూయ తన లాక్ పోయిందంటూ కంగారు పడుతుంది. ఒక లాక్ ఇవ్వవా? అని ఆదిని అనసూయ అడుగుతుంది. అరె నువ్ అడగాలే గానీ అంటూ ఆది పూర్తి చేసే లోపు.. రోజా మధ్యలోకి దూరుతుంది. నువ్ అడగాలే గానీ లిప్ లాక్ కూడా ఇచ్చేస్తాడు అని రోజా కౌంటర్లు వేస్తుంది. దీంతో ఆది తెగ సిగ్గుపడిపోతాడు. మొత్తానికి ఈ ఇద్దరి చేష్టలు మాత్రం బుల్లితెరపై మంచిగానే వర్కవుట్ అవుతున్నాయి.

Exit mobile version