Site icon A2Z ADDA

Navya Swamy-RaviKrishna: నవ్యస్వామి పోస్ట్‌పై రవికృష్ణ రియాక్షన్.. ప్రేమలో ఉన్నారా? సాక్ష్యం ఇదే

Navya Swamy-RaviKrishna బుల్లితెరపై సీరియల్స్‌లో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కుదిరితే ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేయోచ్చు. సినిమాల్లో హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ మహా అంటే ఓ గంట సేపు ఉంటుందేమో. కానీ సీరియల్స్‌లో మాత్రం కొన్నినెలల తరబడి ఆ కెమిస్ట్రీ కంటిన్యూ అవుతుంది. అందుకే ఆ జోడిల మీద ప్రేక్షకులు ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. అలానే నవ్యస్వామి, రవికృష్ణ జోడిపై అందరూ కాన్సన్‌ట్రేట్ చేశారు. వారిద్దరూ కూడా ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ రెచ్చిపోయేవారు.

ఇతర షోలకు వచ్చినప్పుడు కూడా హగ్గులు ఇచ్చుకోవడం, ఎత్తుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటివి చేసి అనుమానాలు క్రియేట్ అయ్యేలాచేశారు. ఇద్దరి మధ్య ఏదో ఉందని అనిపించేలా ప్రవర్తించే వారు. అలా వచ్చిన క్రేజ్‌ను నవ్యస్వామి, రవికృష్ణలు బాగానే ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది. ఆమె కథ సీరియల్‌తో ఈ జోడికి మంచి క్రేజ్ వచ్చింది. ఆ షూటింగ్ సమయంలోనే ఇద్దరూ ఒకే సారి కరోనా బారినపడ్డారు.

ఆ కరోనా సమయంలో ఇద్దరూ పడ్డ కష్టాలు, బాధలు వర్ణనాతీతం. అయితే ఈ ఇద్దరూ ఆ సమయంలో మరింత క్లోజ్ అయినట్టు కనిపిస్తోంది. మొత్తానికి బయట ఇన్ని రూమర్లు వస్తున్నా కూడా తామిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి తప్పించుకుంటున్నారు. కానీ సోషల్ మీడియాలో పోస్ట్‌లు, వాటి కామెంట్లు చూస్తే మాత్రం వేరేలా అనిపిస్తుంది. తాజాగా నవ్యస్వామి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. వాటిపై రవికృష్ణ స్పందించాడు.

లవ్ ఎమోజీలను వరుసగా షేర్ చేశాడు. రెండు సార్లు రిప్లై ఇచ్చాడు. రెండు సార్లు కూడా లవ్ సింబల్స్‌ను షేర్ చేశారు. దీంతో నెటిజన్లకు లేని పోని అనుమానాలు వచ్చాయి. ఇద్దరూ ప్రేమలో ఉన్నారా? శుభవార్త చెప్పబోతోన్నారా? త్వరగా చెప్పేయండి మేం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నామని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Exit mobile version