Site icon A2Z ADDA

Karthika Deepam: ఫోన్‌లో ఎక్కువగా అదే పని.. గుట్టు విప్పిన కార్తీక దీపం డాక్టర్ బాబు

Karthika Deepam బుల్లితెర ప్రసారమయ్యే సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ ఎంతో ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఇక ఈ సీరియల్ లో డాక్టర్ బాబు పాత్రలో నటించిన పరిటాల నిరుపమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డాక్టర్ బాబుగా ఎంతో ఫేమస్ అయిన నిరుపమ్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే ఈ సీరియల్ గురించి ఎంతోమంది నెటిజెన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు.

ఇకపోతే నిరుపమ్ సీరియల్ ఆర్టిస్ట్ మంజులను వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక వీరిద్దరూ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎన్నో వీడియోలను వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానుల కోసం షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు. అయితే ఈ వీడియోలో మంజుల,నిరుపమ్ కొడుకు రిక్కీ సరికొత్త ఆలోచనతో ఈ వీడియో చేశారు.

మీ ఫోన్ లో ఎక్కువగా ఉపయోగించే యాప్ ఏది…

ఈ వీడియోలో రిక్కీ వారి తల్లిదండ్రుల ఫోన్ గురించి ఎన్నో వివరాలను తెలుపుతూ.. వీడియో చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో భాగంగా రిక్కీ తన తండ్రి నిరుపమ్ ను ప్రశ్న అడుగుతూ ఎక్కువగా ఫోన్ లో ఉపయోగించే యాప్ ఏది అంటూ ప్రశ్నించారు. అందుకు కార్తీక్ బాబు అలియాస్ నిరుపమ్ సమాధానం చెబుతూ ఫోన్ లో ఎప్పుడు వాట్సాప్ తో బిజీగా ఉంటానని అసలు విషయం బయట పెట్టారు. ప్రస్తుతం ఏదైనా మెసేజ్ కానీ, ఫొటోస్ కానీ అన్ని వాట్సాప్ లోనే కదా కనుక ఎక్కువగా వాట్సాప్ లోనే గడుపుతానని తెలిపారు.

Exit mobile version