Nirupam Paritala-Hitler Gari Pellam బుల్లితెరపై నిరుపమ్ పరిటాలకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. కార్తీక దీపం సీరియల్‌తో నిరుపమ్ క్రేజ్ అమాంతం పెరిగింది. డాక్టర్ బాబు, కార్తీక్ పాత్రలతో నిరుపమ్ ఎనలేని అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. సొంత పేరు నిరుపమ్ అయినా కూడా డాక్టర్ బాబు అని ప్రేమగా పిలుస్తుంటారు అభిమానులు. ఇంకొందరు డాక్టర్ బాబు మీద మీమ్స్, ట్రోల్స్ వేస్తూ ఎంటర్టైన్ చేస్తుంటారు.
అలా స్టార్ మాలో కార్తీక దీపం సీరియల్‌తో నిరుపమ్ బాగా ఫేమస్ అయ్యాడు. అదే సమయంలో జీ తెలుగు చానెల్‌లో హిట్లర్ గారి పెళ్లాం అంటూ కొత్త పాత్రతో ఆకట్టుకున్నాడు. అయితే ఆ సీరియల్ ఇప్పుడు ముగిసేందుకు వచ్చినట్టు కనిపిస్తోంది. ఏజే అభినవ్ జాగర్లమూడి అంటూ నిరుపమ్ అందరినీ మెప్పించాడు. హిట్లర్ గారి పెళ్లాం కారెక్టర్ భాను కూడా అందరికీ దగ్గరైంది.
ఇక ఈ సీరియల్‌లో తన రియల్ వైఫ్ మంజుల కూడా నటించింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో హిట్లర్ భార్యగా కనిపించింది. అయితే ఈ సీరియల్ మీద నెటిజన్లు ఇప్పుడు కామెంట్లు చేస్తున్నారు. ఈ సీరియల్‌ను ఇప్పుడే ఎండ్ చేయొద్దని కోరుతున్నారు. ఇంత త్వరగా ఎందుకు ఎండ్ చేస్తున్నారు.. దయచేసి సీరియల్‌ను ఎండ్ చేయొద్దు అని వేడుకుంటున్నారు.
మంజుల నిరుపమ్ ఇద్దరూ కలిసి సంక్రాంతి వీడియో చేశారు. యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోన్న ఈ వీడియో కింద అంతా కూడా హిట్లర్ గారి పెళ్లాం (HGP) గురించే కామెంట్లు ఉన్నాయి. ఆ సీరియల్‌కు పెద్ద ఫ్యాన్స్.. దయచేసి ఇలా సీరియల్‌ను ఎండ్ చేయకండి అంటూ నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. మరి అభిమానుల రిక్వెస్ట్‌ను నిరుపమ్ గానీ, జీ తెలుగు గానీ పట్టించుకుంటుందో లేదో చూడాలి.
