Site icon A2Z ADDA

Karthika Deepam : చిన్న విషయాలకే విడిపోతోన్నారు!.. విడాకులపై డాక్టర్ బాబు భార్య కామెంట్స్

కార్తీకదీపం సీరియల్‌లో నిరుపమ్ పరిటాల ఫుల్ ఫేమస్ అయ్యాడు. తెరపై డాక్టర్ బాబుగా నిరుపమ్, తెర వెనుక నిరుపమ్ భార్యగా మంజుల పరిటాల ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. నెట్టింట్లో నిరుపమ్‌ను డాక్టర్ బాబు అని పిలిస్తే.. మంజులను డాక్టర్ బాబు భార్య అంటూ పిలుస్తారు. అలా నిరుపమ్, మంజుల నెట్టింట్లో చేసే సందడి మామూలుగా ఉండదు. ఈ ఇద్దరూ కలిసి ఇప్పుడు యూట్యూబ్‌లో దుమ్ములేపుతోన్నారు. బుల్లితెర సెలెబ్రిటీలంతా కూడా ఈ మధ్య యూట్యూబ్ చానెళ్లతో బిజీగా మారిపోతోన్నారు.

ఈ క్రమంలోనే మంజుల, నిరుపమ్ కలిసి ఓ చానెల్‌ను ప్రారంభించారు. రెండు నెలల్లోనే ఈ చానెల్ ఫుల్ హిట్ అయింది. పెట్టిన ప్రతీ వీడియో వైరల్ అవుతూ వచ్చింది. మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోన్నాయి. ఇప్పటికే రెండు లక్షలకు పైగా సబ్ స్క్రైబర్లు వచ్చేశారు. తాజాగా మంజుల ఓ వీడియోను షేర్ చేసింది. ప్రపోజల్ డేను సెలెబ్రేట్ చేస్తున్నాను.. ఈ రోజు మా ఆయన నాకు ప్రపోజ్ చేసిన రోజంటూ మంజుల ఓ వీడియోను షేర్ చేసింది.

ఇందులో మంజుల ప్రేమ గురించి చెప్పింది. ఈరోజు మా ఆయన్ను రెస్టారెంట్‌కు రమ్మన్నాను. అక్కడ ఓ టేబుల్ బుక్ చేశాను. ఈ మధ్య అందరూ చిన్న చిన్న విషయాలకే గొడవపడుతున్నారు.. దూరమవుతున్నారు.. విడిపోతోన్నారు., కానీ ఇలాంటి చిన్న చిన్న అకేషన్స్‌ను సెలెబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది.. కలిసి కూర్చుని మాట్లాడుకుంటే ఎంత పెద్ద సమస్యైనా కూడా తీరిపోతుందనేది నా అభిప్రాయమని మంజుల చెప్పింది. పెళ్ళి కాక ముందు ప్రతీ నెలా సెలెబ్రేట్ చేశామని, కానీ ఇప్పుడు మాత్రం ఏడాది ఒకసారే సెలెబ్రేట్ చేసుకుంటున్నామని చెప్పుకొచ్చింది.

Exit mobile version