Site icon A2Z ADDA

Karthika Deepam : ఇలాంటోళ్లు ఎలా ఉంటారు అసలు!.. భార్య పరువుదీసిన కార్తీకదీపం డాక్టర్ బాబు

Manjula Paritala-Nirupam Paritala కార్తీక దీపం సీరియల్‌లో డాక్టర్ బాబు,కార్తీక్ పాత్రలు ఎంతగా ఫేమస్ అయ్యాయో అందరికీ తెలిసిందే. డాక్టర్ బాబు పాత్రలో నిరుపమ్ పరిటాల జీవించేస్తున్నాడు. డాక్టర్ బాబు పేరుతో లెక్కలేనన్ని మీమ్స్, ట్రోల్స్ వస్తుంటాయి. డాక్టర్ బాబు అంటాడు కానీ ఏరోజు కూడా హాస్పిటల్‌కు వెళ్లింది లేదంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తుంటారు. అలా నెట్టింట్లో తమ మీద వచ్చే ట్రోల్స్, మీమ్స్ చూసి నిరుపమ్ నవ్వుకుంటూ ఉంటాడు.

పైగా డాక్టర్ బాబు మీద జోకులను నిరుపమ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తుంటాడు. ఇక నిరుపమ్ ఆఫ్ స్క్రీన్ ఎంతో సరదాగా ఉంటాడు. ఆన్ స్క్రీన్ అయితే ఎంతో గంభీరంగా కనిపిస్తాడు. కానీ నిరుపమ్ నిజ జీవితంలో మాత్రం ఎంత ఫన్నీగా ఉంటాడు. అందరినీ నవ్విస్తుంటాడు. ఇక తన భార్య మంజులను అయితే ప్రతీ సారి ఏడిపిస్తూనే ఉంటాడు.

ప్రస్తుతం నిరుపమ్ భార్య మంజుల ఓ యూట్యూబ్ చానెల్‌ను పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ కలిసి చేసే వీడియోలు, అందులో ఈ ఇద్దరి ముచ్చట్లు, భార్య మీద నిరుపమ్ వేసే కౌంటర్లు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా తమ కొడుకు రిక్కితో కలిసి మంజుల, నిరుపమ్ వీడియోతో అభిమానుల ముందుకు వచ్చారు. ఇందులో ఫోన్‌కు సంబంధించిన సీక్రెట్లను రిక్కీ అడగడం, వాటికి మంజుల, నిరుపమ్ సమాధానం చెప్పడం జరిగింది.

ఇందులో భాగంగా మంజుల ఫోన్‌లో స్క్రీన్ లాక్ గురించి రిక్కీ అడుగుతాడు. కానీ మంజుల మాత్రం హోమ్ లాక్ పిక్ చూపిస్తుంది. అది హోం లాక్ పిక్.. ఇది స్క్రీన్ లాక్ పిక్ అని రిక్కీ చెబుతాడు. దీంతో ఇది కూడా తెలీదా? ఇలాంటి వాళ్లు ఉంటారు అసలు.. ఇంకా యూట్యూబ్ కూడా మెయింటైన్ చేస్తారట.. అసలు.. ఇలా ఫోన్ జీకే లేని వాళ్లు ఎలా అంటూ మంజులను నిరుపమ్ ఏడిపిస్తుంటాడు.

Exit mobile version