Site icon A2Z ADDA

Karthika Deepam Episode E1197 : దీప విచిత్ర ప్రవర్తన.. డాక్టర్ బాబులో మొదలైన అనుమానం

కార్తీకదీపం సోమవారం నాడు అంటే నవంబర్ 15 వింత ఘటనలు జరిగాయి. వంటలక్క వింత ప్రవర్తనతో అందరూ ఆశ్చర్యపోయారు. దోష నివారణ పూజ చేయడం చూసినా కూడా రియాక్ట్ కాకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. సోమవారం నాటి ఎపిసోడ్‌లో వంటలక్కగా దీప మళ్లీ మారేందుకు ప్రయత్నిస్తోన్నట్టు కనిపించింది. ఆ అనుమానం డాక్టర్ బాబుకు కలిగింది. పూర్తి ఎపిసోడ్ ఎలా జరిగిందో ఓ సారి చూద్దాం.

ఆటోలోంచి కూరగాయాలు పట్టుకుని దిగిన దీపను చూసి పిల్లలు అడిగిన ప్రశ్నలను గతవారంలోనే చూశాం. బస్తీ షాపింగ్ ఇప్పుడు ఎందుకమ్మా అని శౌర్య అంటుంది.. భూమి గుండ్రంగా ఉందంటారు..ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు కదా?.. అందుకే చేశాను అని దీప అంటుంది. కన్ఫ్యూజన్‌లో ఉందా? క్లారిటీ ఉందా? నా కాలర్ పట్టుకుని అడుగుతుందని అనుకున్నాను.. చూసిందాని కన్నా..తన మౌనమే ఎక్కువ భయంగా ఉంది.. అని కార్తీక్ తనలో తాను అనుకుంటాడు.

ఆ తరువాత సీన్ మోనిత మీద ఓపెన్ అవుతుంది. ఇంటికి కావాల్సిన లెక్కలన్నీ వేస్తుంది. బాబుకు కావాల్సినవన్నీ కొనుక్కుని రా అని ప్రియమణికి డబ్బులిస్తుంది. ప్రియమణి ఇంకా అక్కడే ఉండటంతో.. ఏంటని మోనిత అడుగుతుంది.. జీతం పెంచమని అడుగుతావ్ అంతే కదా? అని మోనిత అంటుంది. మీరు దేవతమ్మ నా మనసులోని మాటను అర్థం చేసుకున్నారు అని ప్రియమణి మురిసిపోతుంది. నా మనసే కార్తీక్ అర్థం చేసుకోవడం లేదు అని మోనిత అంటుంది.

ఇంటికి సంబంధించిన లెక్కలు అయిపోయాయ్.. ఇప్పుడు జీవితానికి సంబంధించిన లెక్కలు మిగిలాయ్.. అంటూ మోనిత ఆలోచిస్తుండగా భారతి వస్తుంది. నీ మెడలో ఏంటది అని మోనితను భారతి అడుగుతుంది.. మంగళ సూత్రం అని మోనిత చెబుతుంది. కార్తక్ కట్టాడా? అని భారతి అంటుంది. ఆనందంతో అడిగావా? ఆశ్చర్యంతో అడిగావా? అని మోనిత అంటుంది.. అర్థం కాక అడిగాను అని భారతి అంటుంది.. అంత దాక కార్తీక్ రాలేదు.. అందుకే నేను కట్టుకున్నా అని మోనిత అంటుంది

నువ్ కట్టుకున్నావా? అలా చేయడం తప్పు కదా? పద్దతులు, సంప్రదాయలుంటాయ్ కదా?. అని భారతి అంటుంది. అది నీలాంటి వాళ్లకుంటాయ్ నాలాంటి వాళ్లకు కాదు.. నాకు కార్తీక్ మాత్రం కావాలి మిగతావేం వద్దు.. అని మోనిత అంటుంది. నువ్ చేసింది నాకు నచ్చలేదు అని భారతి అంటుంది. మనం నిద్రలేచినప్పటి నుంచి పడుకునే వరకు మనకు అన్నీ నచ్చినవే జరుగుతున్నాయా? ఇది కూడా అంటే.. ఆస్పత్రిలో సంతకం పెట్టాడు కదా? అదే చాలు.. నా మనసుకి ఇదే ఆనందం అని మోనిత అంటుంది

అయినా నీకు సంప్రదాయాలేంటి? అని మోనిత అంటుంది. నాకు అంతా శుభమే జరుగుతోంది.. ఒక్కో ప్లాన్లు వేసుకుంటూ.. ఇక్కడి వరకు తెచ్చాను.. పేగు మెళ్లో వేసుకుని పుట్టాడని అబద్దం.. ఇక్కడి వరకు తీసుకొచ్చాను.. ఒక్క అబద్దం.. కార్తీక్‌తో సంతకం.. గుడికి రప్పించింది.. కార్తీక్ పక్కన పీటల పక్కన కూర్చోబెట్టింది.. ఇష్టం లేకపోయినా నన్ను పిలిచారు.. అని అసలు గుట్టు విప్పేసింది. నీ జీవితం పెద్ద కథలా మలుపులు తిరుగుతోంది అని భారతి అంది. ఇది నిజం చెప్పావ్.. నా జీవితం ఒక పెద్ద ప్రయోగం.. అందరికీ ఒక సిలబస్‌లా ఉపయోగపడుతుంది అని మోనిత అంటే..పోయి పోయి నీ జీవితాన్నే ఆదర్శంగా తీసుకోవాలా? అని భారత అంటుంది. నా గురించి, నా శక్తి ఏంటి? నా కష్టమేంటి తెలియక అలా మాట్లాడుతున్నావ్.. ఓ వైపు కార్తీక్‌ని ప్రేమించాలి.. అత్తగారిని మ్యానేజ్ చేయాలి. దీపను డ్యామేజ్ చేయాలి అంటూ చెప్పుకొచ్చింది. ఇక దీప ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చిన విషయాలన్నీ భారతికి మోనిత చెప్పింది.

ఆ తరువాత సీన్‌లో సౌందర్య, కార్తీక్, ఆనంద్ రావుల మీద ఓపెన్ అయింది. అసలేం జరిగిందంటావ్రా అని సౌందర్య.. నాకేం అర్థం కావడం లేదు మమ్మీ.. ఎటు వెల్లావ్ అని అడిగాను చెప్పలేదు.. కోపంగా ఉన్నట్టు కనిపించడం లేదు.. మోనిత విషయం తెలిసిందా? అంటే.. ఏమో ఏమీ తెలియడం లేదు అని కార్తీక్ జవాబిస్తాడు.. దీప కావాలని నటిస్తుందేమోనని భయం వేస్తుందిరా అని సౌందర్య అంటుంది.. మనకు కనిపించే దీప కాదేమోనని పిస్తోంది.. అవసరానికి మించిన ఆనందం నటిస్తోంది.. అని ఆనంద్ రావు అంటాడు.

దీపను చూడాలంటేనే భయం వేస్తోంది.. లోపల ఏదో ఒక మూలన తప్పు చేశాను అనే భావన కలుగుతోందిరా అని సౌందర్య అంటుంది. అరిచి తిడితే బాగుండు.. కళ్లలోకి చూసి మాట్లాడలేకపోతోన్నాను అని డాక్టర్ బాబు అంటాడు. నివురుగప్పిన నిప్పులా గుంభనంగా ఉంది.. భయం వేస్తోంది.. ఏంటో ఈ విచిత్రమైన పరిస్థితి అని సౌందర్య బాధపడుతోంది.. తనకు తెలియకుండానే దీప మనల్ని విచిత్రంగా శిక్షిస్తోంది అని సౌందర్య అంటుందది..

అలా ఆ ముగ్గురు బాధలో ఉంటే.. దీప మాత్రం తన పిల్లలకు కథలు చెప్పుకుంటూ మెట్ల మీద నుంచి నవ్వుకుంటూ దిగుతుంది. కథ భలే జోక్‌గా ఉంది.. ఇవన్నీ నీకు ఎలా తెలుసమ్మా అని అంటే.. నా జీవితంలో పెద్ద పెద్ద జోకులు జరిగాయ్.. వాటి ముందే ఇదెంత అని దీప కౌంటర్లు వేస్తుంది.. ఏంటి ముగ్గురూ అలా చూస్తున్నారు.. ఈ రోజు వంటకాలు మామూలుగా ఉండవు.. అత్తయ్యకు ఇష్టమైన కొత్తిమీర.. మామయ్య గారికి ఇష్టమైన ఉల్లిగడ్డ సాంబారు.. డాక్టర్ బాబుకు ఇష్టమైన దోసకాయకూర గుత్తివంకాయ వండాను అని దీప అంటుంది. అన్నీ వాళ్లకు ఇష్టమైనవేనా? అని పిల్లలు అంటే.. ఇక్కడంతా వాళ్లిష్టమే నడుస్తుంది కదా?.. మామయ్య ఇంటిపెద్ద.. అత్తయ్య నాకు పెద్ద.. డాక్టర్ బాబు చాలా గొప్పవారు.. వాళ్లిష్టమే నడుస్తుంది.. కదా? అని దీప కౌంటర్లు వేస్తుంది. మరి నీకంటూ ఇష్టాలు లేవా? అని హిమ అడుగుతుంది.. నాకు ఏది ఇష్టమని నేను ఎప్పుడూ ఆలోచించలేదు.. అని దీప చెబుతుంది.

అందరూ తినడానికి రండి అని పిలిచి వెళ్లిపోతుంది. ఈ రోజు ఈ వంటలక్క మనస్ఫూర్తిగా చేసింది.. కడుపు నిండా తినండి.. మీరు తింటేనే నాకు ఆనందం.. అని దీప అంటుంది. నువ్ కూడా మాతో పాటు తినే అని సౌందర్య అంటుంది. నేనూ మీతో సమానంగా కూర్చుంటే ఎలా అని కౌంటర్ వేసింది దీప. అంతలోపే మళ్లీ.. కూర్చుంటే వడ్డించడం ఎలా అని కవర్ చేస్తుంది.. మీరు తింటే నేను తిన్నట్టే.. మీ ఆనందమే నా ఆనందం.. అని అంటుంది

మీకోసం ఈరోజు స్వీట్ కూడా చేశాను మామయ్య గారు.. అది తప్పకుండా తినాలి అని దీప అంటుంది.. ఏంటమ్మ ఈరోజు ప్రత్యేకత అని ఆనంద్ రావు అంటాడు. వంటలు చేయక చాలా రోజులు అయింది కదా.. వంటలు పరీక్షించుకుంటున్నాను అని అంటుంది. ఆ మాటలతో కార్తీక్ ఆలోచనలో పడతాడు. మళ్లీ వంటలక్కగా మారాలని అనుకుంటుందా? ఏంటి అని ఆలోచిస్తుంటాడు. వదిన నువ్ రాలేదని పిల్లలు టెన్షన్ పడుతున్నారు అని ఆదిత్య అంటాడు.. ఎందుకు భయపడ్డారు.. నేను ఎటు వెళ్తాన్రా.. ఏమైనా జరిగినా కూడా మీకు వీళ్లంతా ఉన్నారు కదా?. అని దీప అంటుంది.

నీకు ఏమైనా జరగడం ఏంటి? అవడం ఏంటి? అని సౌందర్య అంటుంది. జ్వరం వచ్చి మంచాన పడితే.. ధైర్యంగా ఉండాలని చెబుతున్నా.. మీకు వేరేలా అర్థమైందా? మీరుండగా నాకు భయం ఏంటి? నా కష్టాలకు మీరు అడ్డు వస్తారు కదా? నన్ను కాపాడతారు కదా?. అని సౌందర్య గురించి దీప చెబుతుంది. డాక్టర్ బాబు గుత్తి వంకాయ.. దోసకాయ కూర మీకోసం చేశాను.. మళ్లీ ఎప్పుడు తింటారో ఏమో.. వచ్చే సీజన్ దాకా మళ్లీ తినలేవు కదా?. ఉల్లిగడ్డ సాంబార్ రుచిచూడాల్సిందేని విచిత్రంగా అంటుంది.

వదిన ఏంటి ఈ రోజు కొత్తగా మాట్లాడుతున్నావ్ అని దీపను ఆదిత్య అడుగుతాడు.. ఏంటి ఇంకా ఎవ్వరూ అడగలేదని అనుకుంటున్నావ్.. నాకు చదువు లేదు కదా?. నన్ను నేను సంతోషంగా, కొత్తగా ఉండాలని అనుకుంటున్నా.. ఏడుపు మొహం పెట్టుకుని కనిపిస్తే ఇంకా ఏడిపిస్తున్నారు..అని దీప అంటుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో సౌందర్యకు పంచ్ ఇస్తుంది దీప. మీకు కోడలిగా బోర్ కొట్టానా? అత్తయ్య అని అడుగుతుంది దీప. నాకు శ్రావ్య, నువ్వు ఇద్దరూ రెండు కళ్ళు అని అంటుంది సౌందర్య. మీకు మూడో కోడలు వస్తే.. మూడో కన్ను రావాల్సి ఉంటుందేమో అని సైటైర్లు వేసింది. దానికి సౌందర్య ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Exit mobile version