Site icon A2Z ADDA

Karthika Deepam Episode 1195 : వంటలక్క ధైర్యం ఏంటి? మోనితకు షాకిచ్చిన దీప

కార్తీకదీపంలో మొత్తానికి దోష నివారణ పూజ ముగిసింది. ఇన్ని రోజులు దాని చుట్టూ తిప్పారు. మొత్తానికి అది దీప కంట్లో పడింది. అందరూ కలిసి మోసం చేశారంటూ దీప తల్లడిల్లిపోయింది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా? అని అందరూ ఎదురుచూశారు. ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటుందని ఆశించిన మోనితకు వంటలక్క షాక్ ఇచ్చింది. సరాసరి ఇంటికి వెళ్లి సవాల్ విసిరింది. మోనితలో కొత్త భయాన్ని నింపేసింది. శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

దీప కథ ముగిసింది.. దీప బయటకు.. నేను కార్తీక్ ఇంట్లోకి అంటూ మోనిత తెగ సంబరపడుతుంది. ప్రియమణితో తన విజయగాథను చెప్పుకుంటూ గాల్లో తేలిపోతోంది. అక్కడకు దీప రావడంతో మోనిత షాక్ అవుతుంది. ఏంటి దీపక్క ఇలా వచ్చావ్? ఇది కలా? నిజమా? అంటూ వెక్కిరిస్తుంది. గిల్లుకుని చూస్తుంది మోనిత. అవును ఇదంతా నిజమే? అని అంటుంది. ఇక దీపను వెక్కిరిస్తూ నానా రకాల మాటలు అనేస్తుంది.

రణమా.. రాయబారమా? కాళ్లబేరానికి వచ్చావా? అంటూ మోనిత కాస్త శ్రుతి మించిపోతోంది. నోరు అదుపులో పెట్టుకో అంటూ దీప వార్నింగ్ ఇస్తుంది. కాళ్ల బేరానికి వచ్చావా?.. మొహమాట పడుతున్నావా? అహం అడ్డు పడుతుందా? ప్రియమణి ఉందని భయపడుతున్నావా? ఉభయ కుశలోపరి అంటూ ఏదైనా ప్యాకేజ్ ఆలోచనలతో వచ్చావా? అంటూ నానా రకాలుగా కామెంట్లు చేసింది.

నేను ఎంతగా కార్తీక్‌ను ప్రేమించాను.. ఎన్ని తిట్లు తిన్నాను.. నువ్ ఎంత విర్రవీగావ్..కనుబొమ్మ పైకెత్తి.. వెరైటీ తిట్లు తిట్టావ్.. కాకి మెడ అన్నావ్.. ఇప్పుడు ఆ కాకి కోయిలైంది.. ఈ కోయిలమ్మ ఏకాకి అయింది.. అంతే కదా? దీపక్క.. అబ్బబ్బా ఏం తిట్టావ్.. ఎంత హింస పెట్టావ్.. ఎందుకు.. నాకు మొగుడున్నాడు.. నీకు లేడు అని కదా.. ఇప్పుడేమైంది.. సీన్ సితారైంది.. అంతా తారుమారైపోలే.. కార్తీక్‌తో బిడ్డను కన్నాను.. దోష నివారణ పూజ చేయించాను.. నా దోషాలు కూడా పోయాయి.. నా కార్తీక్‌తో అత్తగారి సమక్షంలో ఆ పూజ జరిగింది.. ఇంకేముంది దీపక్క.. అంతా క్లోజ్.. జైలుకెళ్లే ముందు.. ఏం చెప్పానో గుర్తుందా? అంటూ మోనిత రెచ్చిపోయింది.

నా కథ ముగిసిపోలేదు.. ఇది జస్ట్ ఇంటర్వెల్.. క్లైమాక్స్ ఊహించని విధంగా ఉంటుంది అని జైలుకెళ్లే ముందు తాను సవాల్ చేసిన విషయాన్ని గుర్తుకు చేస్తుంది మోనిత. నా సినిమాకు శుభం కార్డు పడబోతోంది.. నీ సినిమా ఫ్లాప్ దీపక్క.. మోనిత్ కార్తీక్ ప్రేమాయణం సూపర్ హిట్ అయింది.. ఇప్పుడేం చేస్తావ్ దీపక్క.. ఏ నుయ్యో గొయ్యో అంటూ మోనిత అనబోతే.. మోనిత అంటూ దీప అరిచేసింది… అవును మోనితనే.. నీకు దేవుడిచ్చిన చెల్లిని.. నీకు మాట్లాడటానికి నీకేం ఉంది.. నీ బలాన్ని, బలగాన్ని నేను లాగేసుకుంటున్నాను. ఏముంది నీ దగ్గర అంటూ కౌంటర్లు వేసింది..

ప్రియమణి.. దీపక్క వచ్చి ఇంత సేపు అయింది.. ఏం కావాలో అడగవా? కాకరకాయ జ్యూస్ తీసుకురా.. సిట్యువేషన్‌కు తగ్గట్టుంది. ఇప్పుడేం చేస్తావ్..మళ్లీ వంటలక్కగా మారుతావా? మిక్సర్ గ్రైండర్‌కు సాయం చేస్తాను.. పూజకు సంబంధించిన ఫోటోలు చూస్తావా? తెలియకుండా ఫోటోలు తీశావ్ కదా? అవి చూపించి ప్రియమణి.. నేను వాగుతున్నాను.. నువ్వేం మాట్లాడలేదు.. బ్లాంక్ అయ్యావా?.. నువ్ కంచికి.. నేను కార్తీక్ ఇంటికి.. శుభం కార్డు పడింది దీపక్క అంటూ మోనిత చెలరేగిపోయింది.

ఇక అప్పటి వరకు మోనిత మాట్లాడుతూ ఉంటే.. దీప చూస్తుండిపోయింది. ఇక దీప అందుకుంది. ఇంత వరకు మాట్లాడి బాగా అలిసిపోయి ఉంటుంది. నీళ్లు తెచ్చివ్వు ప్రియమణి.. ఆరోగ్యం బాగుందా? బాగానే కనిపిస్తున్నావ్.. ఏంటి అలా చూస్తున్నావ్.. నేనే నీ దీపక్కను.. నవ్వే అన్నావ్ కదా? దేవుడిచ్చిన అక్కను.. నాకు గౌరవం ఇవ్వాల్సిన పని లేదు.. వచ్చి కూర్చో.. కథ కంచికి అని ఏదో అంటున్నావ్.. కదా.. దాని సంగతి తరువాత చూద్దాం.. నీకో చిన్న పిట్ట కథ చెబుతా విను.. ప్రియమణి నువ్ కూడా విను.. అంటూ దీప ఆ కథను మొదలుపెట్టింది.

అనగనగా ఓ రోజు రాజు వేటకు బయల్దేరాడు. వర్షం వస్తుంది వెళ్లొద్దు రాజా అని ఓ వ్యక్తి చెబుతాడు.. వేసవి కాలం వర్షాలేంటి? అని ఆ రాజు వేటకు వెళ్లాడట. జోరున వర్షం.. ఒకటే వర్షం.. రాజు గారు రెండ్రోజులు అడవిలోనే ఉండి చివరకు రాజ్యానికి వచ్చాడు.. వర్షం కురుస్తుందని చెప్పిన వ్యక్తిని పిలిపించాడు. నీకు వర్షం పడుతుందని ఎలా తెలిసిందని ఆ వ్యక్తిని అడిగాడు. నా దగ్గర ఓ గాడిద ఉంది.. అది చెవులు రిక్కాడించినప్పుడల్లా వర్షం పడుతుంది .అందుకే అలా చెప్పగలిగాను అని అంటాడు.

దీంతో ఆ రాజు ఆ గాడిదను తీసుకొచ్చి తన మంత్రిగా పెట్టుకుంటాడు. దీంతో ఊర్లో ఉన్న అడ్డ గాడిదలన్నీ కూడా మంత్రి అయిపోవాలని అనుకున్నాయట. అని దీప కథ చెప్పడంతో మోనితకు చిర్రెత్తుకొచ్చింది. అంటే కథ నీకు బాగానే అర్థమైందన్న మాట అని దీప అంటుంది. కథ కంచికి అని నువ్ అనుకుంటే సరిపోదు.. నేను అనాలి.. శుభం కార్డు పడలేదు.. పడదు కూడా.. దిక్కు లేదని, దారలున్నీ మూసుకపోయాయ్.. అన్నావ్.. పైన ఒకడుంటాడు.. అన్నీ చూస్తాడు. నాకు దిక్కులు, దారులు మూసుకుపోలేదు.. నీ కళ్లు మూసుకుపోయాయ్.. అవును నేను వంటలక్కనే.. ఏ వంటలో ఎంత ఉప్పు, మసాలా వేయాలో నాకు తెలుసు.. జీవితంలో కూడా ఎవరికి ఎప్పుడు ఎలా గుణపాఠాలు చెప్పాలో కూడా తెలుసు.. ఇప్పుడే అసలు సినిమా మొదలైంది.. నీ క్రిమినల్ బుర్రకు అందని విధంగా ఉంటుంది.. నా వైపు ఎవరున్నారని అడిగావ్.. గుండె ధైర్యం ఉంది.. ఆ ధైర్యం ఏంటో.. దమ్మేంటో నీకు అతి త్వరలో తెలుస్తుంది మోనిత..అని వార్నింగ్ ఇచ్చేసింది. అలా ఎపిసోడ్ ముగిసింది.

ఇక ఇంట్లోకి వెళ్లబోతోన్న దీప.. బస్తీలోని వంటలక్క మాదిరిగా వచ్చింది. చేతినిండా కూరగాయల సంచితో వచ్చింది. దీంతో శౌర్యకు అనుమానం వచ్చింది. కారులో డాడీతో పాటు రావొచ్చు కదా? అని శౌర్య అంటుంది. మా దారులు వేరు అని దీప కౌంటర్ వేస్తుంది. బస్తీలో ఉన్నట్టుగా ఇలా పట్టుకొచ్చావ్ ఎందుకమ్మా అని అడుగుతుంది. భూమి గుండ్రంగా ఉంటుంది.. కదా.. మళ్లీ అలవాటు తప్పకూడదు అని ఇలా తీసుకొచ్చాను అని మరో కౌంటర్ వేస్తుంది. దీంతో కార్తీక్‌కు ఏం అంతు పట్టదు.

Exit mobile version