Site icon A2Z ADDA

Karthika Deepam Episode 1194 : కుప్పకూలిన కార్తీక్.. ఒంటరైన వంటలక్క

కార్తీక దీపం సీరియల్‌లో గత కొన్ని వారాలుగా నాన్చుతూ, తప్పించుకుంటూ వస్తున్న దోష నివారణ పూజకు సంబంధించిన విషయం వంటలక్కకు తెలిసింది. బుధవారం నాటి ఎపిసోడ్‌ల్ వంటలక్క ఆ విషయాన్ని తెలుసుకుని గుండె బద్దలయ్యేలా విలపించింది. గురువారం అంటే 1194వ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో ఓ సారి చూద్దాం.

గుళ్లో మోనిత ఓవర్ యాక్షన్, ఆమె మాట్లాడే మాటలను కార్తీక్ బరించలేక వెళ్లిపోయాడు. నాని తిట్లు తిట్టేసి మోనితను వదిలేసి వెళ్లిపోయాడు. అన్ని తిట్లు తిట్టే సరికి మోనితను ప్రియమణి జాలి పడిచూసింది. ఏంటే జాలి పడిచూస్తున్నావ్.. నేను గెలిచాను.. దీప ఓడింది.. పాపం.. జాలి పడాల్సింది దీపక్క మీదే.. వెళ్దాం ప్రియమణి.. ఐ లవ్యూ దీపక్క..అంటూ మోనిత పిచ్చి పిచ్చిగా వాగేసింది.

ఇక దీప గుడికి వచ్చిందని, తాను చూశానని డాక్టర్ బాబు తన అమ్మ సౌందర్యకు చెబుతాడు. దీప ఎందుకు వస్తుంది.. వస్తే అలా చూసి ఎందుకు వెళ్తుంది.. గొడవ పెడుతుంది కదా? అంతా నీ భ్రమేరా? అని డాక్టర్ బాబు సర్దిచెబుతుంది సౌందర్య. కానీ వారణాసి అసలు విషయం చెప్పేస్తాడు. గుడి వద్ద దీపక్క దిగింది.. మీ కారులో వస్తాను అని అంది.. రాలేదా? అని అంటాడు. దీంతో దీప చూసేసిందన్న నిజం తెలిసిపోయింది.

దీప ఆ పూజను చూసిందన్న నిజం తెలియడంతో డాక్టర్ బాబు కుప్పకూలిపోయాడు. దీప ఏమైపోయి ఉంటుందిరా? అని సౌందర్య తల్లడిల్లిపోయింది. ఏం చేద్దాం మమ్మీ. దీప ఎక్కడికి వెళ్లి ఉంటుంది.. వస్తుందా? అసలు… నా మొహం ఎలా చూపించాలి మమ్మీ.. వద్దూ వద్దూ అంటూ ఉన్న తీసుకెళ్లావ్.. ఇప్పుడేం చెబుతావ్.. దీప నమ్ముతుందా? ఎలా నమ్మించాలి.. ఏ తప్పూ చేయలేదని ఎలా చెప్పాలి.. అంటూ కార్తీక్ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ బాధపడుతున్నాడు.

నా కోడలు ఎక్కడున్నా సరే నేను వెతుక్కుని తీసుకొస్తాను..ఇదంతా కూడా దీప మంచి కోసమే చేశాను అని ఎలా చెప్పను.. ఈశ్వరా ఏంటి ఈ పరీక్ష అని సౌందర్య బాధపడింది. ఇక అక్కడ సీన్ కట్ చేస్తే మోనిత మీద ఓపెన్ అవుతుంది. కార్తీక్ పక్కన కూర్చుని పూజ చేయడాన్ని గుర్తు చేసుకుని సంబరపడిపోయింది. నువ్ సూపరో సూపర్ అంటూ మురిసిపోయింది మోనిత. కానీ కార్తీక్ తిట్టాడు కదా? అని మళ్లీ బాధపడుతుంది. నా కార్తీకే కదా? కార్తీక్ కాకపోతే ఇంకెవ్వరు తిడతారు.

నీ పరిస్థితిని నీ మానసిక స్థితిని నేను అర్థం చేసకుంటాను.. నువ్వే నన్ను అర్థం చేసుకోవడం లేదు.. ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయ్.. అదిరిపోయేలా అర్థమవుతాను..నేనూ దూరంగా ఉండలేను కార్తీక్. అయినా ఇందులో నీకు తప్పులేదు.. నాకు తప్పలేదు.. గుళ్లో పూజ.. ఒళ్లో బాబు.. మెళ్లో తాళి వాటే రైమింగ్.. మెళ్లో తాళి ఈ ప్రశ్నకు సమాధానం నువ్వే చెప్పాలి బంగారం.. చెప్పేలా చేస్తాను.. ఇంత వరకు తీసుకొచ్చిన దాన్ని.. అంత వరకు తీసుకు రాలేనా?. అని మోనిత అనుకుంది.

ఇక దీప బస్తీలోకి వచ్చినట్టు అక్కడి జనాలు నిలదీసినట్టు, తనకు అండగా ఉంటామని భరోసానిచ్చినట్టు కలగంటుంది. బస్తీకి వెళ్తే అంత కంటే ఏం జరుగుతుందిలే అని దీప అనుకుంటుంది. ఇక సీన్ ఆనంద్ రావు, సౌందర్య, కార్తీక్‌ల మీద ఓపెన్ అవుతుంది. ఆనంద్ రావు అంత ఎత్తున లేస్తాడు. ఏం జరుగుతుందని భయపడ్డానో అదే జరిగింది.. జరిగిందేంటో దీపకి చెప్పరా? అని మొదటి నుంచి చెబుతూ వచ్చాను.. తప్పు జరిగినా చేసినా ఒప్పుకునే ధైర్యం ఉండదాలి.. దీప మిమ్మల్ని చూసి ఏమనుకుంటుది. డాక్టర్ బాబు, అత్తయ్యగారు మోసం చేశారా? అని అనుకుంటుంది.. మోసం చేసిందని అనుకుంటుంది.. దీప ఇక ఈ ఇంటికి రాదు.. అని ఆనంద్ రావు వారి మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను అని సౌందర్య అంటే.. ఏమని చెబుతావ్.. అన్నీ మరిచిపోయి రా అని బతిమాలాడతావా?.. భర్త తాగుబోతు, వ్యసనపరుడు అయినా సహిస్తుంది. కానీ ఇలా తన స్థానంలో వేరే వాళ్లను తీసుకొస్తే ఎవ్వరూ సహించారు.. 11 ఏళ్లు దూరమైంది.. దీప దేవత కాబట్టి మళ్లీ ఈ ఇంట్లో అడుగడుపెట్టింది. కానీ ఇప్పుడు మాత్రం దీప రాదు..మరిచిపోండి అని ఆనంద్ రావు అంటాడు.

దీప కాళ్లు పట్టుకుని అయినా సరే తీసుకొస్తాను అని సౌందర్య అంటుంది.. మీరు చేసింది తప్పు, పొరబాటు.. కాదు.. ద్రోహం చేశారు.. ద్రోహం జరిగింది.. అని ఆనంద్ రావు అంటాడు. తప్పంతా నాదే.. తప్పులు మీద తప్పులు చేస్తూ వెళ్లాను.. దీప కాళ్లు పట్టుకున్నా.. క్షమించదు.. ఏం చేద్దాం మమ్మీ అని కార్తీక్ అంటే.. చేయడానికి ఇంకేం ఉందిరా.. పరిస్థితి మన చేతులు దాటి పోయింది.. ఈ కుటుంబం పరువు మళ్లీ బజారున పడింది.. ఇక రేపటి నుంచి బయటకు వెళ్లొద్దు..

నీ పెద్ద కోడలు ఏది అంటే సమాధానం లేదు.. నా కొడుకు వేరే దాంతో బిడ్డను కన్నాడు అని.. ఆనంద్ రావు అనేలోపు.. ఆపండి ప్లీజ్ డాడీ అంటూ కార్తీక్ అరిచేస్తాడు.. కోపం వచ్చిందా??. నేను అంటేనే ఇలా ఉంటే.. వేరే వాళ్లు అంటే ఎలా ఉంటుందిరా అని ఆనంద్ రావు అంటాడు… మీరు దయచేసి వాడిని ఇంకా చంపకండి అని సౌందర్య అంటుంది..లోపల పిల్లలు వింటారు అని సౌందర్య అంటుంది.. లోకం మాట్లాడే మాటలు వినకుండా పిల్లలను తలుపులు కిటికీలు మూసి పెట్టు అని ఆనంద్ రావు వెళ్లిపోతాడు.. ఆ తరువాత సీన్ మళ్లీ వంటలక్క మీద ఓపెన్ అవుతుంది. అది దోష నివారణ పూజ ఇదేనా? అంటూ తన గతాన్ని గుర్తు చేసుకుంది దీప.. పెళ్లి నాటి సంగతులు తలుచుకుని బాధపడింది..11 ఏళ్లు పోరాడి ఏం సాధించాను అంటూ ప్రశ్నించుకుంది. అలా ఎపిసోడ్ ముగిసింది. ఇక మోనితకు వార్నింగ్ ఇచ్చే సీన్ శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో వస్తుందేమో చూడాలి.

Exit mobile version