Site icon A2Z ADDA

Jabardasth Varsha: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వర్ష సోదరుడు.. వేడుకున్న జబర్దస్త్ బ్యూటీ

Jabardasth Varsha Brother Accident బుల్లితెరపై వర్ష తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకుంది. సీరియల్స్‌లో ఎన్ని పాత్రలు పోషించినా కూడా రాని గుర్తింపు జబర్దస్త్ వేదిక మీద కనిపించడంతోనే పాపులర్ అయింది. ఊహించిన దాని కంటే ఎక్కువగా క్రేజ్ వచ్చింది. వర్ష అందాలకు అందరూ ఫిదా అయ్యారు. ఇక వర్ష ఇమాన్యుయేల్ ట్రాక్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది.

అయితే మధ్యలో వర్ష ఫ్యామిలీ, వర్ష సోదురుడి టాపిక్ కూడా వార్తల్లోకి వచ్చింది. తన గురించి, ఇమాన్యుయేల్ గురించి పిచ్చి వార్తలు రావడంతో ఇంట్లో వాళ్లంతా భయపడుతున్నారని, తన సోదరుడు కూడా తనని చూసి అసహ్యించుకుంటున్నారని, అలాంటివి ఎందుకు రాస్తారు.. ఎందుకు ట్రోల్ చేస్తారు.. మీ ఇంట్లో కూడా అమ్మాయి ఉంటుంది.. ఇలానే చేస్తారా? అంటూ వర్ష ఆ మధ్య ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా వర్ష సోదరుడు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడట. ఈ మేరకు వర్ష ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్.. మీరు డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా నడపండి.. ముగ్గురు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్ల నా బ్రదర్‌కి యాక్సిడెంట్ అయి హాస్పిటల్‌లో డేంజర్ పరిస్థితుల్లో ఉన్నాడు.

ఫ్యామిలీ అంతా కూడా చాలా కష్టాలు పడ్డాం. అందుకే ఎవరైనా సరే డ్రైవ్ చేసేటప్పుడు కేర్ ఫుల్‌గా ఉంటే.. ఎవ్వరూ కూడా ఏ ఫ్యామిలీ కూడా బాధ పడకుండా ఉంటారు.. ఇప్పుడు నా సోదరుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. క్షేమంగానే ఉన్నాడు అని చెప్పుకొచ్చింది.

Exit mobile version