రోహిణి బుల్లితెరపై చేసే అల్లరి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. బుల్లితెరపై సీరియల్స్‌తో అందరినీ మెప్పింది. ఈమె కెరీర్ బిగ్ బాస్ షోకు ముందు ఒకలా.. బిగ్ బాస్ షో తరువాత ఒకలా మారిపోయింది. బిగ్ బాస్ ఇంట్లో ఫుల్ కామెడీ చేసి అందరినీ ఆకట్టుకుంది. అయితే త్వరగానే ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో శివజ్యోతి, రోహిణి, హిమజ, రవికృష్ణ, అషూ ఇలా అందరూ ఒక గ్యాంగులా ఉండేవారు.
బయటకు వచ్చాక కూడా అందరూ క్లోజ్‌గా ఉంటున్నారు. అయితే ఇందులో అందరూ కూడా యూట్యూబ్ చానెళ్లు పెట్టేశారు. ఎవరి చానెళ్లు వారు ప్రమోట్ చేసుకుంటూ పోతోన్నారు. రౌడీ రోహిణి అంటూ రోహిణి తన యూట్యూబ్ చానెల్‌లో దుమ్ములేపుతోంది. తాజాగా తాను మైసూర్ వెళ్తున్నానని, బంగార్రాజు షూటింగ్ కోసం అవుట్ డోర్ షూటింగ్ అని ఓ వీడియోను చేసింది. ఇందులో రోహిణి ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది.
ఇక ఈ వీడియోలో రోహిణి చేసిన కామెడీ మామూలుగా లేదు. అయితే ఇలా వీడియోలు చేస్తోన్న క్రమంలోనే మధ్య మధ్యలో యాడ్స్ కూడా పెట్టేస్తుంటారు. వాటిని ప్రమోట్ చేస్తుంటారు. తాజాగా రోహిణి కూడా కొన్ని ప్రొడక్ట్‌ల గురించి ప్రమోషన్ చేసింది. మేకప్‌కు సంబంధించిన ఉత్పత్తుల గురించి చెప్పింది.
ఇలా సడెన్‌గా ప్రోగ్రాంలు పెట్టుకున్నప్పుడు.. మేకప్ చేసుకునే సమయం, అవాంచిత రోమాలను తీసివేసేందుకు సమయం లేకపోతే ఈజీగా వాటిని వాడి తీసుకోవచ్చని రోహిణి తెలిసింది. తాను ఈ మధ్య పార్లర్‌కు వెళ్లలేదని, తనకు ఎక్కువగా గదవ భాగంలో హెయిర్ వస్తుందని, వెంటనే పెరుగుతుందని అందుకే ఇలా వీటితో ఎప్పటికప్పుడు తీసేసుకుంటాను అని రోహిణి చూపించింది. కను బొమ్మలు కూడా సెట్ చేసుకోవచ్చని, పార్లర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపింది.