Site icon A2Z ADDA

ప్రవీణ్‌ను లాగి పెట్టి కొట్టిన ఫైమా.. వామ్మో గుట్టంతా విప్పేశారుగా!

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా అందరికీ పరిచయమైన మరొక లేడీ కమెడియన్ ఫైమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి వారం జబర్దస్త్ కార్యక్రమం ద్వారా తన అద్భుతమైన కామెడీ పంచ్ డైలాగులతో ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే ఫైమా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలను తెలియజేశారు. ఇకపోతే జబర్దస్త్ ఫైమా, పటాస్ ప్రవీణ్ మధ్య అనుబంధం గురించి మనకు తెలిసిందే.

వీరిద్దరి మధ్య లవ్ రిలేషన్ ఉందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ వీడియో ద్వారా వీరి మధ్య ఉన్న రిలేషన్ కి క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే ఈ వీడియో ద్వారా ఫైమా మాట్లాడిన మాటలు ప్రవీణ్ కూడా మాట్లాడుతూ తనని ఆట పట్టించారు. అలాగే ఈ రోజు యూట్యూబ్ వీడియో ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలోనే ప్రవీణ్ వచ్చాడు అని చెప్పగానే ప్రవీణ్ నేను రాలేదు పిలిచింది అంటూ చెప్పుకొచ్చారు.

ఈ మాటకు ఫైమా మాట్లాడుతూ.. ఆ చెప్పు చెప్పు నా యూట్యూబ్ ఛానల్ కి వీడియో లేదు ఫోన్ చేసి రా..రా అని బతిమిలాడింది కాళ్ళు కూడా మొక్కడానికి వచ్చింది అదంతా కూడా చెప్పురా వాళ్లకి అంటూ ప్రవీణ్ ను లాగి పెట్టి కొట్టింది. ఆ తర్వాత ప్రవీణ్ అదంతా నువ్వే చెప్పేసావ్ అని అనగానే చెప్పానా అంటూ ఫైమా తడబడింది.

ఇకపోతే ఈ వీడియో ద్వారా వీరిద్దరి గురించి వస్తున్న రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చారు. వీరిద్దరి జర్నీ గత నాలుగు సంవత్సరాల నుంచి కొనసాగుతోందని, ఏ సమయంలోనైనా ప్రవీణ్, ఫైమా వెనకుండి తనని నడిపిస్తానని వీరిద్దరి మధ్య ఉన్న లవ్ రిలేషన్ బయట పెడుతూ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి ప్రవీణ్ ప్రేమ ఎప్పుడు ఫలిస్తుందో చూడాలి.

Exit mobile version