Site icon A2Z ADDA

ఏయ్ శ్రీముఖి రావే నీ..! రెచ్చిపోయిన అవినాష్

బుల్లితెరపై అవినాష్ చేస్తోన్న హంగామా అందరికీ తెలిసిందే. స్టార్ మా, జీ తెలుగు స్పెషల్ ఈవెంట్లలో అవినాష్ రచ్చ చేస్తుంటాడు. షో మొత్తం ఒక్కడే కనిపిస్తాడు. కాస్త అతి అనిపిస్తుంది. కానీ తన స్టైల్లో నవ్వించేస్తాడు. ఇక తాజాగా ఓ ఈవెంట్‌లో అవినాష్ రెచ్చిపోయాడు. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న సినిమాలన్నింటినీ స్ఫూప్ చేసి పడేశాడు. ఈ క్రమంలో ముందుగా అఖండ గెటప్‌లో వచ్చాడు.

బాలయ్య బాబులా నటించేందుకు ప్రయత్నించాడు. బాలయ్య స్టైల్లో డైలాగ్‌లతో రెచ్చిపోయాడు. మళ్లీ బాలయ్య అభిమానులు ఎక్కడ హర్ట్ అవుతారో అని ఇదంతా కామెడీగానే, ఆయనకు అంకితం ఇస్తూ చేస్తున్నానని చెబుతాడు. అలా చివరకు భీమ్లా నాయక్ గెటప్‌లో వస్తాడు. పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్‌ను దించేందుకు ప్రయత్నిస్తాడు.

అందులో భాగంగా హోస్ట్‌గా చేస్తోన్న శ్రీముఖిపై పంచ్ వేస్తాడు.. రేయ్ డానీ రా రా నా కొడకా.. అని పవన్ కళ్యాణ్ అంటే.. ఇక్కడ అవినాష్ మాత్రం ఏయ్ శ్రీముఖి రావే నీ.. అంటూ ఆపేస్తాడు. శ్రీముఖి ఫైర్ అవుతుంది. వెంటనే అవినాష్ సెలైంట్ అయిపోతాడు. అలా మొత్తానికి అవినాష్ మాత్రం జీ తెలుగు చానెల్‌లో రాబోతోన్న కార్తీక మాసంలో వనభోజనాల సందడి ఈవెంట్‌లో నిజంగానే సందడి చేశాడు.

Karthika Maasamlo Vanabhojanala Sandadi Special Event Promo | Sreemukhi, Avinash | This Sunday, 6 PM

ఇదే ఈవెంట్‌లో అవినాష్ తన భార్యను రంగంలోకి దించాడు. తన భార్యతో కూడా వేషాలు వేయిస్తున్నాడు. అనూజ అవినాష్ కలిసి స్కిట్ వేశారు. మొత్తానికి అవినాష్ అలా రెండు రకాలుగా కూడా సంపాదించేస్తున్నాడు.

Exit mobile version