హైపర్ ఆది చదువు, ఉద్యోగం వంటి వాటి గురించి ఇది వరకే ఎన్నో వార్తలు వచ్చాయి. బీటెక్ చదివిన ఆది.. ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాడు. బ్యాచ్‌లర్ రూంలో ఎన్నో కష్టాలు పడ్డాడు. యూసుఫ్ గూడలో ఉండే ఆది జీవితాన్ని కృష్ణకాంత్ పార్క్ మార్చేసింది. ఆట విడుపు కోసం చేసిన స్ఫూప్, అందులో రాసుకున్న డైలాగ్స్ చాలా ఫేమస్ అయ్యాయి. వాటిని చూసిన అధిరే అభి.. ఆదికి అవకాశం ఇచ్చాడు. అయితే చదువులు, ఉద్యోగాలు తనకు సెట్ కావని, తన టాలెంట్‌ను ఏంటో తెలుసుకున్నాడు..ఇప్పుడు స్టార్ అయ్యాడు.
అయితే తాజాగా ఆది తెరపై కనిపించక ముందు జరిగిన సంఘటనలతో ఓ స్కిట్ చేసినట్టున్నారు. దాంట్లో తన పాత రోజులను గుర్తు చేసుకున్నాడు. బీటెక్ చదివి సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ కోసం వెళ్లాడట. అక్కడ ఇంగ్లీష్ రాదని చిన్నచూపు చూశారట. ఇంగ్లీష్ రాకపోవడంతే ఉద్యోగం ఇవ్వలేదట. అప్పుడు తనకు అనిపించిందట. తెలుగు వాళ్లమై ఉండి.. ఇక్కడ ఇంగ్లీష్ రాకపోతే ఉద్యోగం ఇవ్వకపోవడం ఏంటో నాకు అర్థం ఆ రోజు అర్థం కాలేదు.
కానీ ఆ రోజు ఇంటర్వ్యూ చేసిన వాడికి చెబుతున్నా.. మీరు తెలుగులో మాట్లాడుతున్నాను అని నాకు ఉద్యోగం ఇవ్వలేదు. కానీ ఈ రోజు ఆ తెలుగు వల్లే మీ కంటే ఎక్కువ సంపాదిస్తున్నా.. తెలుగులో మాట్లాడేవాళ్లకే ఉద్యోగం ఇచ్చే సంస్థను ఎప్పటికైనా పెడతాను.. అది మాత్రం గారెంటీ అని ఆది బల్లగుద్ది చెప్పేశాడు. అందుకే చదువులు మాత్రమే ముఖ్యం కాదు.. మనలోని ప్రతిభను తెలుసుకోవాలి.. గుర్తించాలి.. దాన్ని సాన పెట్టుకుని ముందుకు వెళ్లాలని అంటారు.
అలా ఆది తన టాలెంట్‌ను తెలుసుకున్నాడు. తెరపైకి వచ్చాడు. కలం పట్టి మాటలు రాశాడు.. పంచ్‌లు వేశాడు. ఇప్పుడు బుల్లితెరపై స్టార్‌గా మారాడు. వెండితెరపైనా బిజీగా మారిపోయాడు. అలా ఆది ఇప్పుడు ఉంతె మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
