Guppedantha Manasu గుప్పెడంత మనసు ఈ రోజు సీరియల్‌తో అంతా కూడా గౌతమ్ హంగామానే కనిపించింది. రిషి, మహేంద్ర, గౌతమ్‌ల ముచ్చట్లే ఎక్కువగా కనిపించాయి. జగతి, వసుల మధ్య చర్చ కూడా ప్రధానంగా సాగింది. అయితే గౌతమ్ మాత్రం వసు విషయంలో కాస్త అతి చేస్తున్నాడు. అది రిషికి అంతగా నచ్చడం లేనట్టు కనిపిస్తోంది. వసు నంబర్ కోసం గౌతమ్ నానా రకాల ప్రయత్నాలు చేస్తే.. చివరకు వసునే తిరిగి ఫోన్ చేస్తుంది. దీంతో రిషి మొహం మాడిపోతుంది. అలా నేటి ఎపిసోడ్ ఎలా సాగిందంటే..
వసుకు ఫోన్ చేసిన ధరణి.. జరిగిన గొడవ గురించి ఆరా తీస్తుంది. మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు జరిగాయా? అని ధరణి అడిగితే.. రిషి సర్ ఉన్న చోట కోపం అనుమానాలు కామన్ కదా? అని వసు అంటుంది. జరిగిందాంట్లో నా తప్పు లేదు.. అని వసు చెప్పబోతోంటే.. నీ గురించి నాకు తెలీదా? అని ధరణి అంటుంది… ఆవిడకు ఎలా ఉంది? అని దేవయాణి గురించి వసు అడుగుతుంది. ఆవిడ గురించి మనకు తెలిసిందే కదా?. ఎక్కువ చేస్తోంది.. కాసేపు ఆగు పాలు పొయ్యి మీదున్నాయి.. అని ధరణి కాస్త బిజీ అవుతుంది. ఫోన్ పక్కన పెట్టేస్తుంది. ఇంతలో రిషి వంట గదిలోకి వస్తాడు. లైన్‌లో వసు ఉందని తెలుసుకున్న రిషి.. అనాల్సిన మాటలన్నీ అనేస్తాడు.
మన వల్ల ఎవరికైనా గాయమైతే.. ఫీలవుతామా? ఫీలవ్వమా? వదిన.. కానీ వసుధార మాత్రం ఇంత వరకు ఫోన్ చేయలేదు.. సారీ చెప్పలేదు.. గర్వమా, పొగరా?.. అని రిషి అంటాడు. జరిగిందాంట్లో ఆమె తప్పు లేదు కదా? అని ధరణి అనబోతోంటే.. జరిగిందే ఆవిడ వల్ల కదా?.. అని రిషి అంటాడు. జరిగింది వేరే మీరు చూసింది వేరు.. అని వసు తన మనసులో తాను అనుకుంటుంది.
మనుషులు అలా ఎలా ఉంటారో.. కాలేజ్ టాపర్, యూత్ ఐకాన్ అయితే ఇలా చేస్తుందా? అని వసుపై ఉన్న కోపాన్నంత కక్కేస్తాడు. వదిన నా ఫ్రెండ్ వస్తాడు.. వంటలు చేయకండి.. పని మనిషిని మాట్లాడండి అని రిషి చెప్పి వెళ్లిపోతాడు.. వసుధార వినే ఉంటుంది.. వినాలనే అన్నాను.. అని రిషి తన మనసులో తాను అనుకుంటాడు. నా తప్పు లేదు సారీ చెప్పేది లేదు.. అని వసు కూడా తనలో తాను అనుకుంటుంది.
ఆ తరువాత సీన్ వసు, జగతిల మీద ఓపెన్ అవుతుంది. జగతి తన ప్రాజెక్ట్ పని మీద షార్ట్ ఫిల్మ్ కోసం పని చేస్తుంటుంది. వసుని జగతి కాస్త సాయం అడుగుతుంది. ఇప్పుడు నేను ఏ పనీ చేయలేను మేడం అని వసు అంటుంది. ఏమైంది అని జగతి అంటే. ఏం కాలేదు అని వసు రిప్లై ఇస్తుంది. ఏదో అయిందని నీ ఫేస్ చూస్తేనే అర్థమైంది.. అని జగతి అంటుంది.
దేవయాణి గారి విషయంలో నన్ను నిందిస్తున్నారు.. నాకు అహంకారమట.. సారీ చెప్పాలట.. అని రిషి అన్ని మాటల గురించి జగతితో వసు అంటుంది. నీతో అన్నాడా?..అని జగతి ప్రశ్నిస్తుంది. నాతో కాదు.. ధరణి గారితో ఫోన్‌లో మాట్లాడుతున్నాను.. అప్పుడు సర్ వచ్చినట్టున్నాడు.. అని వసు చెప్పేసింది. మనం తప్పు చేయలేదని మనకు తెలుసు కదా?. ఇంకేంటి బాధ అని జగతి అంటుంది.
మనం కరెక్ట్‌గా ఉన్నాం కానీ రిషి సర్ లేడు అని వసు అంటుంది. అయితే వసు పదే పదే మీ అబ్బాయి అబ్బాయి అని అంటుంటుంది. దీంతో జగతి సెటైర్ వేస్తుంది. మా అబ్బాయికి మీ రిషి సర్‌కి చాలా తేడా ఉంటుంది.. నీకు నచ్చే పని చేస్తే రిషి సర్, జెంటిల్మెన్, ఎండీ గారు అవుతారు.. నీకు నచ్చని పని చేయకపోతే మా అబ్బాయా?. అని జగతి కౌంటర్లు వేస్తుంది.
ఏమో మేడం నేను అంత ఆలోచించలేదు.. నన్ను కోప్పడుతున్నారు.. అని వసు అంటుంది. దానికి నేనేం చేయాలి అని జగతి అంటుంది.. నా గురించి తప్పుగా ఆలోచిస్తున్నాడు.. నాకే ఆయన సారీ చెప్పాలి.. రెస్టారెంట్‌లో అన్నదానికి, ఇప్పుడు ధరణి గారితో అన్న మాటలకు సారీ చెప్పాలి.. అని వసు అంటుంది. మీరేం అంటారు మేడం అని వసు అడిగితే.. ఈ పనులు నేనే చేసుకుంటాను అని అంటాను.. అని జగతి కౌంటర్లు వేస్తుంది.
మొత్తానికి రిషిని తప్పు దారి పట్టించడంలో దేవయాణి అక్క పాసైంది.. రిషి తొందరపాటు గురించి తెలిసి కూడా వసు ఇలా చేస్తోందేంటో.. అని జగతి తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇక సీన్ గౌతమ్, రిషి, మహేంద్రల వామ్ అప్ మీద ఓపెన్ అవుతుంది. డంబెల్స్‌తో జిమ్ చేస్తూ ఉన్న రిషి.. ఇలా రెండు రోజులు చేస్తే నీలా అయిపోతానారా?.. అని జోకులు వేస్తాడు. అవుతానులే..అని గౌతమ్ తనది తానే అనుకుంటాడు.
ఈ వాతావరణం బాగుంది కదా? అని గౌతమ్ అంటే.. మన మనసు బాగుంటే అన్నీ బాగుంటాయ్ అని మహేంద్ర అంటాడు. నా మనసుని ఒక్క మాటలో చదివేశారు.. అని మహేంద్రను పొగిడేస్తాడు గౌతమ్. పొగుడుతున్నావ్ అంటే ఏదో పని ఉంది.. అని మహేంద్ర అంటాడు. ఇది నిజం చెప్పారు.. అని రిషి అంటాడు. వరినైనా బుట్టలో వేసుకుంటాడు అని గౌతమ్ గురించి రిషి చెబుతాడు. అది బుట్టలో వేసుకోవడం కాదు.. టాక్టిక్స్, లౌక్యం అంటారు.. అని గౌతమ్ గొప్పలు చెప్పుకుంటాడు.
వసుధార తెలుసా? అంకుల్.. అని గౌతమ్ మెల్లిగా దారిలోకి వస్తాడు. ఆ టాపిక్ అవసరమా డాడ్ అని రిషి అంటే.. నేనా తీసింది అంటూ మహేంద్ర అంటాడు. ఆమె గురించి తెలియని వారెవ్వరూ ఉండరు.. అని మహేంద్ర అంటే.. తను అంత స్పెషలా?. స్పెషల్‌కే స్పెషల్ అయి ఉంటుంది..అని గౌతమ్ అనేస్తాడు. నీకు మాట్లాడటానికి ఆ టాపిక్ దొరికిందా.. అని రిషి అంటాడు.
పొద్దున్నే ఇంత బాగుంది.. అలాంటప్పుడు మంచి టాపిక్ మాట్లాడాలి.. మంచివారి గురించి మాట్లాడాలి అని గౌతమ్ అంటాడు. అంటే మిగతా రోజంతా నోర్మూసుకునే ఉండాలా? అని రిషి కౌంటర్ వేస్తాడు. నువ్ ఇంకా మారలేదారా? అని గౌతమ్ అంటే.. నేను మారలేదు.. మారనురా.. అని రిషి అంటాడు. అలానే ఉంటే జడ పదార్థంలా ఉండిపోతావ్.. అని అని గౌతమ్ అంటాడు.
ఏమంటారు అంకుల్ అంతే కదా? అని మహేంద్రను ఇరికించే ప్రయత్నం చేస్తాడు గౌతమ్. జడ పదార్థాల గురించి మీరు మీరు తేల్చుకోండి..అని మహేంద్ర అనేస్తాడు. నేను నీకు ఇంత మంచి ఫ్రెండ్.. యంగ్ ఏజ్ డాడ్ ఉండగా.. నువ్వే వాడుకోవడం లేదు.. అని గౌతమ్ అంటాడు. అలా గౌతమ్ పొగుడుతుంటే.. థ్యాంక్యూ గౌతమ్.. అని మహేంద్ర అంటాడు.
మీరు వాడి వల్లో పడకండి.. పొగడ్తలతో మునగ చెట్టు ఎక్కిస్తాడు.. అని రిషి అంటాడు. ఒరేయ్ పొగిడితే.. ముళ్ల చెట్టు అయిన ఎక్కుతారు.. ఇవన్నీ నా గుండెల్లోంచి వచ్చాయి.. మీరు సూపర్, యూనిక్, యాక్టివ్, హ్యాండ్సమ్, సూపర్ సూపర్.. అని ఇలా పొగిడేస్తాడు. థ్యాంక్యూ గౌతమ్.. అని మహేంద్ర అంటాడు. వసుధార ఫోన్ నంబర్.. అని గౌతమ్ అసలు విషయంలోకి వస్తాడు.
అర్థమైందా? వాడి పొగడ్తలు, ఇది వాటి ఎత్తుగడ.. అని రిషి అంటాడు. ఫోన్ నంబర్ కోసం మరీ అంత పొగడ్తానా?.. ఇంటి అడ్రెస్ కోసం అయితే పొగుడుతాను అని గౌతమ్ అసలు విషయాన్ని బయటపెట్టేస్తాడు. గౌతమ్‌లో.. గో.. అని ఉంటుంది అంటే.. దూసుకెళ్లు..అని అర్థం.. అంకుల్ వసు ఫోన్ నంబర్ ఇవ్వరా.. అని మహేంద్రను అడుగుతాడు గౌతమ్.
ఎందకురా నీకేంటి అవసరం అని రిషి ఉడికిపోతాడు. గుడ్ మార్నింగ్ శుభోదయం.. అని మెసెజ్‌లు పెడతాను అని గౌతమ్ అంటాడు. నీకు అవసరమా? అని రిషి అంటే.. నీకు అవసరమా? గాలి అవసరమా? వర్షం అవసరమా?. చెట్లు అవసరమా? అనుకుంటే మనకు పళ్లు ఎలా వస్తాయ్.. అవసరం.. అత్యవసరం..కొంచెం ఎక్కువైనట్టుందా?. అవసరానికి మించి అవసరం గురించి చెప్పినా కూడా అర్థం కాలేదా?.. పానీ పూరి బండికి చక్రాలుంటాయ్ కానీ అది మన దగ్గరకు రాదు.. అని అంటాడు గౌతమ్.
అర్థం కాలేదా?.. తరువాత అర్థమవుతుంది లే అని మళ్లీ ఫోన్ ఇవ్వండి అంకుల్ అని అంటాడు.. ఇవ్వకండి నాన్న అని రిషి అంటాడు.. నువ్వెంట్రా ఇలా తయారయ్యావ్.. ఫోన్ ఇవ్వరా అంకుల్ అని గౌతమ్ అడిగేస్తాడు.. రూంలో ఉందే.. అని మహేంద్ర తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. రూంలో ఉందా? వసుధార నంబర్ సంపాదించడం ఎలా.. అని గౌతమ్ ఫీలవుతుంటాడు.
ఇక అదే సమయంలో వసు తన బ్యాగులో పడ్డ కార్డ్ గురించి ఆలోచిస్తుంది. ఇవి గౌతమ్ గారివి కదా?. అని అనుకుంటుంది. ఇక మరో వైపు.. నాకు నువ్వే దిక్కయ్యా.. ఏదో ఒక దారి చూపించు.. అని గౌతమ్ తెగ ప్రార్థిస్తుంటాడు. అదే సమయంలో ఫోన్ వస్తుంది. ఎవరబ్బా అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో సర్ నేను వసుధారని మాట్లాడుతున్నాను..అని చెప్పడంతో గౌతమ్ గాల్లో తేలిపోతాడు. మీ కార్డ్స్ నా బ్యాగులో పడిపోయాయ్.. అని వసు అంటుంది. విధి విచిత్రమైంది.. ఎలా ఆలోచిస్తే అలానే జరుగుతుంది.. అని గౌతమ్ ఏదేదో అంటాడు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిపోడ్‌లో రిషి తెగ కంగారు పడుతున్నట్టు కనిపిస్తోంది. నీకు ఎందుకు ఫోన్ చేసింది అని వసు గురించి గౌతమ్‌ని రిషి అడిగితే.. పర్సనల్స్ అడగొద్దు మిత్రమా? అని గౌతమ్ కౌంటర్లు వేస్తాడు.