గుప్పెడంత మనసు సీరియల్‌లో సోమవారం నాడు అంటే 289వ ఎపిసోడ్‌లో మంచి సీన్లు పడ్డాయి. రిషి మనసులో ఉన్న ప్రేమ బయటకు వస్తుందని ఆశపడ్డ మహేంద్రకు మళ్లీ భంగపాటు ఎదురైంది. శిరీష్ కాలేజ్‌కు వచ్చి పెళ్లికి సంబంధించిన విషయం గురించి మాట్లాడతాడు. సోమవారం నాడు గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.
క్లాస్‌లో వసు పాఠాలు చెప్పడం, రిషి వచ్చినా చూడకుండా క్లాసు చెబుతూనే ఉంది వసు. చివరకు రిషిని చూసి వసు షాక్ అవుతుంది. ఏ శిక్ష వేస్తారు.. క్లాసులోంచి బయటకు వెళ్లమంటారా? అని రిషిని వసు అడుగుతుంది. నేను చెప్పానా? అని రిషి అంటే.. మీరు ఎలాగూ చెబుతారు కదా? అని వసు ఉంటుంది.అన్నీ నువ్వే ఊహించుకుంటావా? అని రిషి అంటాడు. నేను సరిగ్గా చెప్పనా? డౌట్లు అడిగితే విసుక్కుంటానా? అని రిషి అడిగాడు. క్లాస్ నువ్వే చెప్పు.. ఆమె సరిగ్గా చెప్పకపోతే.. నాకు చెప్పండని స్టూడెంట్స్‌కు రిషి చెప్పి వెళ్లిపోతాడు.
అలా సీన్ కట్ చేస్తే.. శిరీష్ కాలేజ్‌కి వస్తాడు. రిషికి నిజం ఎక్కడ తెలిసిపోతుందా? అని మహేంద్ర కంగారు పడతాడు. దీంతో శిరీష్‌ను దగ్గరుండి రిషి వద్దకు తీసుకెళ్తాడు. అమ్ము అంటూ తనకు కాబోయే భార్య గురించి చెబుతుందే మహేంద్ర చెప్పనివ్వడు. టాపిక్ డైవర్ట్ చేస్తాడు. పెళ్లి కదా? సర్.. వసు లేకపోతే ఎలా.. అందుకే తీసుకెళ్తామన అనుకుంటున్నా. మీ పర్మిషన్ కావాలి అని రిషిని శిరీష్ అడుగుతాడు. అవును వసు లేకపోతే నీ పెళ్లి ఎలా జరుగుతుంది? అని అంటాడు. వసును పిలవమని ప్యూన్‌కు చెబుతాడు.
కానీ వసు వచ్చే లోపలే పర్మిషన్ ఇస్తున్నానంటూ శిరీష్‌కు చెబుతాడు. చెప్పకుండా ఎందుకు వచ్చావ్? అని శిరీష్‌ను అక్కడి నుంచి వసు తీసుకెళ్తుంది. ఆ తరువాత మహేంద్ర, రిషిలు మాట్లాడుకంటారు. మనసే మనిషికి పెద్ద శత్రువు.. లోపల ఏదైనా ఉంటే చెప్పేసేయ్ అని మహేంద్ర అంటాడు. అనుకున్నవన్నీ చెప్పలేం కదా? అని రిషి వెళ్లిపోతాడు.
శిరీష్ కారులో వసు వెళ్లడం చూసి రిషికి కోపం వస్తుంది. నేనే పర్మిషన్ ఇచ్చాను కదా? వెళ్లకుండా ఉంటుందా? అని వసు పని చేసే రెస్టారెంట్‌కు వెళ్తాడు. రిషి వస్తాడేమో అని వసు కూడా ఎదురుచూస్తుంది. ఇద్దరూ ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూనే ఉంటారు. అదే సమయంలో వసు నుంచి రిషికి ఫోన్ వస్తుంది. మీరు ఎందుకు మా రెస్టారెంట్ వద్దే ఉన్నారని అనిపిస్తోందని వసు అంటుంది. నిజానికి రిషి రెస్టారెంట్ వద్దే ఉంటాడు. మొత్తానికి రిషి చూపులు వసుకు గుచ్చుకుంటున్నాయేమో. పోకిరి సీన్ రిపీట్ అవుతుందేమో చూడాలి.