Site icon A2Z ADDA

Guppedantha Manasu Episdoe 293 : అనుకున్నట్టే అయింది.. అది ఊహ మాత్రమే.. ఇక రిషి మారడు

గుప్పెడంత మనసు సీరియల్ సున్నితమైన అంశాలతోనే ముందుకు సాగుతుంది. ఉన్న ప్రేమను గుర్తించలేకపోవడం, గుర్తించినా బయటపడకపోవడం, అహమో, ఇగోనే ఏదో ఒకటి ఇలా అడ్డం వస్తూనే ఉంది. మొత్తానికి రిషి మాత్రం వసు ఆలోచనలతో సతమతమవుతున్నాడు. రిషి మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టలేకపోతోన్నాడు. అసలు ప్రేమ ఉందనే విషయాన్నే తెలుసుకోలేకపోతోన్నాడు. ఇక మరో వైపు వసు కూడా అంతే. తన మనసులో ఏముందో? అనేది గుర్తించలేకపోతోంది.

శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో వసుని నిలదీస్తాడు అని అంతా అనుకుంటారు. కానీ అది ఊహ మాత్రమే. వసు చేతిని గట్టిగా పట్టుకున్న రిషి.. ఊహల్లో తేలిపోతాడు. తన మనసులో అనుకుంటున్న వాటిని అడిగేశాను అనే భ్రమలో ఉంటాడు. చేయిని వదలండి సర్ అని వసుు అనడంతో మన ప్రపంచంలోకి వస్తాడు. ఏమైనా అడిగానా? నిన్ను అని అంటాడు. ఏమీ అడగలేదు అని వసు చెబుతుంది. నా మనసులో ఇంత ఉందా? అయినా బయటకు ఎందుకు చెప్పలేకపోతోన్నాను అని రిషి అనుకుంటాడు.

కాలేజ్‌లో వసు గురించి జగతి కంగారు పడుతుంది. ఉదయాన్నే టిఫిన్ తినకుండా వెళ్లింది. ఇంకా రాలేదు అని మహేంద్రతో చెబుతూ కంగారు పడుతుంది. కానీ అంతా తెలిసిన మహేంద్ర మాత్రం సైలెంట్‌గా ఉంటాడు. వసు రావడంతో జగతి మనసు కాస్త ప్రశాంతంగా మారుతుంది. రిషి సర్ అని వసు ఏదో చెప్పబోతోంటే టాపిక్ డైవర్ట్ చేస్తాడు మహేంద్ర. అంతలోపే రిషి కూడా వస్తాడు అక్కడికి. రెండు టిఫిన్ బాక్స్‌లు అని రిషి అనబోతోంటే.. మళ్లీ టాపిక్ డైవర్ట్ చేస్తాడు మహేంద్ర. ఆయన ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటూ జగతి లోలోపల అనుకుంటుంది.

డాడీ ఎందుకు అలా రెండు బాక్సులు పెట్టావ్ అని అంటాడు. ఏదైతేనేం నువ్ హ్యాపీ కదా? అని మహేంద్ర అంటాడు. ఆ తరువాత కాలేజ్‌లో ఓ కొత్త ప్రోగ్రాం గురించి చర్చలు నడుస్తుంటాయి. విద్యార్థుల్లో ఎగ్జామ్స్ భయం పోగొట్టేందుకు ఫియర్ ఫ్రీ అనే కొత్త ప్రోగ్రాంను పెడతారు. స్టాఫ్, స్టూడెంట్స్ మధ్య ఈ పోటీలు ఉండబోతోన్నాయని చెబుతారు. ఇదే విషయాన్ని శిరీష్‌కు ఫోన్ చేసి తన కాలెజ్ గొప్పదనం గురించి చెబుతుంది. అదంతా కూడా రిషి వింటాడు.

మధ్యలో పెళ్లి గురించి శిరీష్ అడుగుతాడు. నీకు ఎప్పుడూ అదే గోలనా? అని వసు చిరాకు పడుతుంది. అది రిషికి ఇంకోలా అర్థమవుతుంది. ఈ ఆటలపోటీలు అయ్యాక చూద్దాంలే అని వసు అంటుంది. కాన్ఫిడెంట్‌కు కేరాఫ్ అడ్రస్.. విజయానికి పర్మనెంట్ అడ్రస్ అని వసు కొట్టిన డైలాగ్‌కు రిషికి కాలుతుంది. అలా మొత్తానికి ఆటల పోటీల ప్రారంభోత్సవంలో రిషి మాట్లాడతాడు. వసుకు పరోక్షంగా కౌంటర్లు వేస్తాడు. అది మహేంద్రకు అర్థమవుతుంది.

ఇక ఆటల పోటీల్లో భాగంగా చేతితో కుస్తీ పోటీలు పెట్టారు. ఇందులో మొదటగా జగతి, పుష్ప పోటీ పడతారు. టేబుల్ మీద చేతులు పెట్టి తమ సామర్థ్యాన్ని పరీక్షించుకున్నారు. జగతి మేడం ఓడిపోతోండటం చూసిన రిషి తట్టుకోలేడు. ఓడిపోకండి మేడం అని కొడుకు అనడంతో జగతి ఎమోషనల్ అవుతంది. ఇక రేపు జగతి మేడం తన సత్తాను చూపుతుందేమో. కొడుకు కోసం ఆటలో గెలుస్తుందేమో చూడాలి.

Exit mobile version