Site icon A2Z ADDA

Sreemukhi : వర్షిణి, శ్రీముఖి ఖతం నెక్ట్స్ దీపిక పిల్లి.. నిజంగానే ‘కామెడీ’గా ఉంది!

Comedy Stars-Naga Babu జుట్టునమ్మ ఎన్ని కొప్పులైన వేస్తుందన్నట్టుగా.. షోలో పస ఉంటే ఎవరున్నా లేకున్నా కూడా నడుస్తుంది. ఈ విషయం తెలియక కొంత మంది షోలో విపరీతమైన మార్పులు చేర్పులు చేస్తుంటారు. వీటికి మంచి ఉదాహరణగా జబర్దస్త్ నిలుస్తుంది. జబర్దస్త్ అనే షోలోనే మంచి పస, కంటెంట్ ఉంది. అందుకే అందులోకి ఎవరు వచ్చినా రాకున్నా కూడా ఆ షో అలా నడుస్తూనే ఉంటుంది.

అదే అదిరింది షోను తీసుకుంటే.. మధ్యలో తుస్సుమంది. జబర్దస్త్ నుంచి కొంత మంది బయటకు వెళ్లారు. అదిరింది అంటూ కొత్త దుకాణం పెట్టారు. అక్కడ యాంకర్లను, జడ్జ్‌లను మార్చి బొమ్మ అదిరింది అని పెట్టారు. అయినా కూడా ఆ షో పైకి లేవలేదు. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చి మొత్తం షోనే లేకుండా చేసుకున్నారు. అయితే ఇప్పుడు కామెడీ స్టార్స్ షోకు కూడా అలాంటి గతే పడుతోంది.

కామెడీ స్టార్స్ షోలోనే అసలు పస లేదు. అదేమీ కొత్త షో కాదు. జబర్దస్త్ లాంటి ఇంకొక షో. పోనీ అందులో ఏమైనా కొత్త ఆర్టిస్ట్‌లు, అదరగొట్టే పర్ఫామెన్స్‌లుంటాయా? అంటే అదీ లేదు. కామెడీ స్టార్స్ మొత్తం కూడా అవినాష్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక అవినాష్ చేసే కామెడీకి నవ్వు కంటే విరక్తి ఎక్కువగా పుడుతుంది. ఇక అషూ, హరి, సుజాత, సద్దాం ఇక సరే సరి.

ఈ అందరితో షోను మెల్లిగా కిందా మీదా పడి నెట్టుకొస్తున్నారు. అయితే ఈ షోకు మొదటగా వర్షిణి యాంకర్‌గా ఉండేది. ఆ తరువాత శ్రీముఖిని తీసుకొచ్చారు. అయితే మధ్యలో జడ్జ్ అయిన శ్రీదేవిని కూడా తీసి అవతలపారేశారు. మొత్తానికి శేఖర్ మాస్టర్ మిగిలాడు. ఆ తరువాత నాగబాబును రంగంలోకి దించారు. షోలో దమ్ములేకపోతే ఏ బాబు వచ్చినా కూడా ఏమీ చేయలేరు.

అయితే ఇప్పుడు మళ్లీ శ్రీముఖిని తప్పించారు. ఆమె స్థానంలో Deepika Pilli దీపిక పిల్లిని తీసుకొచ్చారు. ఈమెను తీసుకురావడం పెద్ద కామెడీగా మారిపోయింది. అసలే కామెడీ స్టార్స్. ఈమెను యాంకర్‌గా తీసుకుని నిజంగానే కామెడీ అయ్యేలా ఉన్నారు. ఢీ షోలో ఏడాది పాటుగా ఈమె ఉంటేనే ఎవ్వరూ పట్టించుకోలేదు. అది కూడా రష్మీ పక్కన ఉంది కాబట్టి కాస్త ఫేమస్ అయింది.

ఆది అప్పుడప్పుడు ఆమె మీద పంచులు వేశాడు కాబట్టి కొంత మందైనా గుర్తు పట్టారు. అలాంటి దీపిక పిల్లిని తీసుకొచ్చి కామెడీ స్టార్స్ షోకు యాంకర్‌గా చేయడమనే నిర్ణయమే పెద్ద తప్పు. ఇక ఈమెను ఎన్ని రోజులు ఉంచుతారన్నది కూడా చూడాలి. ఈమె మీద విడుదల చేసిన ప్రోమోను చూస్తే మరింత నవ్వొస్తుంది. యాంకర్‌గా ఉండాల్సిన ఆ ఎనర్జీ, మాటల్లో ఉండాల్సిన చలాకీదనం ఏదీ కూడా కనిపించదు.

పుష్ప రేంజ్‌లో డైలాగ్ చెప్పింది దీపికి. పిల్లి అనుకుంటివా.. పులి అంటూ.. తగ్గేదేలే అని రెచ్చిపోయింది. నిజంగా ఆమె పులా? పిల్లా? అనేది కొన్ని రోజుల్లోనే తేలుతుంది. ఇక కామెడీ స్టార్స్ పేరుని కాస్తా కామెడీ స్టార్స్ ధమాకా అని మార్చారు. ఇన్ని మార్పులు చేర్పులు చేశారు.. ఫలితం ఎలా వస్తుందా? అన్నది కొన్ని రోజలు ఆగితే తెలుస్తుంది.

Exit mobile version