Site icon A2Z ADDA

Artist Varalakshmi: కోవిడ్‌తో ఇంట్లో వరుస మరణాలు.. శవాన్ని కూడా అంటూ నటి వరలక్ష్మీ కంటతడి

Artist Varalakshmi కరోనా మానవ ప్రపంచాన్ని ఎంతలా కుదిపేసిందో అందరికీ తెలిసిందే. కుటుంబం మొత్తాన్ని కబళించేసిన ఘటనలున్నాయ్. తల్లిదండ్రులు కరోనాతో చనిపోతే.. అనాథలైన బిడ్డలున్నారు. బిడ్డలు కరోనాతో చనిపోతే తల్లడిల్లిన తల్లిదండ్రులున్నారు. ఇక మొదటి వేవ్‌లో అయితే సొంత వాళ్లు చనిపోయినా కూడా శవాన్ని పట్టుకొచ్చే వారు కాదు. అలా ఎన్నో శవాలు చెత్తకుప్పలు, మున్సిపాలిటీ వాళ్ల చెంతకు చేరాయి.

అలా కరోనా దెబ్బకు అంతా అస్తవ్యస్తమైంది. అయితే కరోనాకు వారు వీరు అనే తేడా లేదు. అందరినీ ఒకే రకంగా చూసింది. సెలెబ్రిటీలను సైతం కరోనా ముప్పు తిప్పలు పెట్టేసింది. ఎంతో మంది ప్రముఖులు కరోనాతో కన్ను మూశారు. అయితే సీనియర్ నటి వరలక్ష్మీ మాత్రం తన విషాద గాథను చెప్పుకుని తెగ ఎమోషనల్ అయింది.
YouTube video player

తాజాగా వరలక్ష్మీ సుమ క్యాష్ షోలో గెస్టుగా వచ్చింది. వరలక్ష్మీతో పాటుగా ఆమని, యమును, దివ్యా వాణి కూడా వచ్చారు. అయితే వరలక్ష్మీ మాత్రం తనకు కరోనా చేసిన గాయాన్ని చెప్పుకుని ఏడ్చేసింది. కుటుంబంలో ఐదుగురు మరణించారని చెప్పింది. తన చెల్లి సరస్వతి భర్త కోవిడ్ మరణించాడని.. సరస్వతి కూడా చనిపోతుందని అనుకున్నామని కానీ కష్టపడి బతికించుకున్నామని కంటతడి పెట్టింది.

ఇక ఆ సమయంలో ఎవ్వరం కూడా తన చెల్లికి తోడుగాలేకపోయామని అంది. మా ఇంట్లోకూడా పంపించలేరు. తన చెల్లి ఒక్కత్తె తన భర్త శవాన్ని మోసుకుంటూ వెళ్లింది అంటూ వరలక్ష్మీ కన్నీరు పెట్టేసింది. అలా ఆమె తన బాధను చెప్పుకోవడంతో అందరి కంట్లో నీళ్లు తిరిగాయి.

Exit mobile version