Site icon A2Z ADDA

Vishnu Priya: ఎవ్వరికీ బానిసల్లా ఉండాల్సిన పని లేదు : యాంకర్ విష్ణు ప్రియ

Vishnu Priya యాంకర్ విష్ణుప్రియ ప్రస్తుతం పుణ్య క్షేత్రాల దర్శనంలో బిజీగా ఉంది. ఇప్పుడు త్రయంబకేశ్వరం ఉంది. అసలే విష్ణుప్రియకు పరమేశ్వరుడంటే మహా ప్రీతి. అందుకే దేవుడి పేరు మీదుగానే రుద్ర ఫౌండేషన్ అని స్థాపించింది. తనకు చేతనైన సాయాన్ని చేస్తూ వెళ్తోంది. తాను సంపాదించే దానిలో కొంత భాగంతో విష్ణుప్రియ తన ఫౌండేషన్‌ను నడిపిస్తోంది.

ఈ మధ్య విష్ణుప్రియ ఎక్కువగా వర్కవుట్ల మీద దృష్టి పెట్టేస్తోంది. ఒకప్పుడు ఎంతో బొద్దుగా ఉండే విష్ణుప్రియ ఇప్పుడు జీరో సైజులోకి వచ్చింది. తన నడుము అందాలను తిప్పుతూ విష్ణుప్రియ షేర్ చేసే వీడియోలు మామూలుగా వైరల్ అవ్వవు. విష్ణుప్రియ డ్యాన్స్ వీడియోలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇక ఇంట్లో అద్దం ముందు అందాలను తిప్పుతూ వేసే మూమెంట్స్‌కు అందరూ ఫిదా అవుతుంటారు.

విష్ణుప్రియ సద్దుగురు జగ్గీ వాసుదేవ్ కొటేషన్లను ఫాలో అవుతుంటుంది. ఈషా ఫౌండేషన్ అంటే విష్ణుప్రియకు ఇష్టం. అయితే తాజాగా సద్గురు పోస్ట్‌కు విష్ణుప్రియ స్పందించింది. ఎదుటి వారి ఆలోచనలకు,అభిప్రాయాలను నువ్వెప్పుడూ బానిసలా ఉండకు. నువ్ ఏది నమ్ముతావో దాని కోసం బలంగా నిలబడు.. నీకు ఏది ఇష్టమో అదే చెయ్ అంటూ విష్ణుప్రియ చెప్పుకొచ్చింది.

ఇక ఈ మధ్యే విష్ణుప్రియ ఆహా కోసం ఓ వెబ్ సిరీస్‌లో నటించింది. ది బ్యూటీ అండ్ బేకర్స్ అంటూ వచ్చిన ఈ వెబ్ సిరీస్‌లో విష్ణుప్రియ తన అందం, నటనతో అందరినీ ఆకట్టుకుంది.

Exit mobile version