Site icon A2Z ADDA

Rashmi Gautam : ఆ మాటతో చెలరేగిన రష్మీ.. ఢీ కంటెస్టెంట్ చెంపలు వాయించిన యాంకర్

Anchor Rashmi యాంకర్ రష్మీ బుల్లితెరపై చేసే సందడి మామూలుగా ఉండదు. కానీ రష్మీ ఎంత చేసినా ఓ పద్దతి ఉంటుంది. తన హద్దుల్లోనే ఉంటుంది. అది వస్త్రాధారణ విషయంలో అయినా సరే.. స్కిట్లలో అయినా సరే. రష్మీ తనకంటూ కొన్ని హద్దులు గీసేసుకుంది. వాటిలోనే చేస్తుంది. కానీ వెండితెరపై ఒకప్పుడు రష్మీ చేసిన అందాల ఆరబోత మామూలుగా లేదు. అలా వెండితెరపై రష్మీ చేసిన రచ్చకు అందరూ షాక్ అయ్యారు.

అలా సిల్వర్ స్క్రీన్ మీద రష్మీ చేసిన స్కిన్ షో హాట్ టాపిక్‌గా మారింది. విచ్చల విడిగా అందాల ప్రదర్శన చేయడంతో రష్మీ మీద అభిమానులు ఫైర్ అయ్యారు. దీంతో అప్పటి నుంచి రష్మీ కాస్త వెనక్కి తగ్గింది. సినిమాల్లో నటించడం మానేసింది. ఇప్పుడిప్పుడే మళ్లీ రష్మీ నటించడం ఆరంభించింది. కానీ మంచి పాత్రలు వస్తేనే ప్రాజెక్ట్‌లకు ఓకే చెబుతోంది.

అయితే రష్మీకి మాత్రం బుల్లితెరే ఎక్కువగా కలిసి వచ్చింది. రష్మీ సుధీర్ ట్రాక్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అన్న సంగతి తెలిసిందే. ఆ ట్రాక్ ఉన్నంత కాలం రష్మీ సుధీర్‌కు బుల్లితెరపై అవకాశాలు తగ్గవు. ఢీ, జబర్దస్త్, ఇతర పండుగల ఈవెంట్లతో రష్మీ, సుధీర్ రచ్చ చేస్తుంటారు. తాజాగా ఎక్స ట్రా జబర్దస్త్ ప్రోమోను వదిలారు. అందులో రష్మీ రెచ్చిపోయింది.

Extra Jabardasth Latest Promo - 10th December 2021 - Sudigali Sudheer,Rashmi Gautam - Mallemalatv

ఢీ కంటెస్టెంట్ పండు బుల్లితెరపై డ్యాన్సులు, కామెడీలు చేస్తూ దూసుకుపోతోన్నాడు. పేరుకే డ్యాన్సర్ అయినా కూడా కామెడీ స్కిట్లతోనూ పండు దుమ్ములేపుతున్నాడు. తాజాగా రాకింగ్ రాకేష్ స్కిట్లో కనిపించాడు. ఎంట్రీ సాంగ్‌కు రష్మీతో కలిసి పండు డ్యాన్స్ వేశాడు. పండుకు వ్యాల్యూ ఎప్పుడు ఉంటుంది? అని రష్మీని అడుగుతాడు పండు. చిలక్కొట్టినప్పుడు అని రష్మీ అంటుంది. అందుకే ఈ చిలకతో ఎంట్రీ ఇచ్చాను అని పండు అంటాడు. ఆ మాటతో పండు చెంప చెల్లుమనిపిస్తుంది రష్మీ. ఎందుకు కొట్టావ్ అని పండు ఆశ్చర్యపోతాడు. చిలక కొట్టింది అంటూ టపటపా వాయించేస్తుంది.

Exit mobile version