Site icon A2Z ADDA

మానవత్వం చచ్చిపోయింది!.. దారుణ ఘటనపై యాంకర్ రష్మీ ఎమోషనల్

మానవత్వం చచ్చిపోతోంది.. రోజురోజుకూ మనుషులు దిగజారి పోతోన్నారని చెప్పడానికి ఎన్నెన్నో ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అందులో తాజాగా ఓ ఘటన బయటకు వచ్చింది. మూగ జీవాల మీద ఆకతాయిలు తమ ప్రతాపాన్ని చూపించారు. కుక్కను హింసించారు. కుక్క తోకకు టపాసులు కట్టి పేల్చేశారు. ఈ దారుణ ఘటనపై అందరూ భగ్గుమంటున్నారు. ఆ ఆకతాయిలను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషాదకర ఘటనపై యాంకర్ రష్మీ స్పందించింది.

పశ్చిమ బెంగాల్‌లో ఈ విచారకరమైన ఘటన జరిగింది. ఓ వీధి కుక్కకు తొమ్మిది మంది ఆకతాయిలు కలిసి దాని తోకకు పటాకలు అంటించారు. దీంతో ఆ కుక్కకు సంబంధించిన కాలు, తోక తెగి పడిపోయాయి. అయితే అది గమనించిన చుట్టు పక్కల వాళ్లు కుక్కను కాపాడారు. ఆసత్రికి తీసుకెళ్లారు. చికిత్సఅందించారు. అయితే ప్రస్తుతం ఆ కుక్క సురక్షితంగానే ఉందట. ఈ వార్త రష్మీ కంట పడింది. దీంతో రష్మీ తెగ ఎమోషనల్ అయింది.

మామూలుగా స్వతాహాగానే రష్మీ జంతు ప్రేమికురాలు. రష్మీ పెట్ లవర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. వీధి కుక్కలకు గాయమై ఎక్కడైనా ఉంటే.. ఇంటికి తీసుకొచ్చి మరీ పెంచుకుంటుంది.అలాంటి రష్మీ ఇంతటి దారుణమైన ఘటనను విని, చూసి చలించిపోయింది. ఇక మానవత్వం చచ్చిపోయింది. మనుషులకు ఈ భూమ్మీద బతికే హక్కు లేదు అంటూ ఎమోషనల్ అయింది. ఇది వరకు కూడా ఇలాంటి ఘటనల మీద రష్మీ కామెంట్ చేస్తూ కంటతడి పెట్టిన సందర్బాలున్నాయి.

Exit mobile version